Meghasandesam Serial Today February 17th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్‌కు పీఏగా భూమి – గగన్, నక్షత్రల పెళ్లి చేద్దామన్న ప్రసాద్
Meghasandesam Today Episode: ప్రసాద్ చెప్పడంతో గగన్ ఆఫీసుకు వెళ్తుంది భూమి. అక్కడ జరుగుతున్న ఇంటర్వూ చూసి తాను రెస్యూమ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్‌కు టిఫిన్ వడ్డిస్తున్న శారదకు చెమటలు పడుతుంటాయి. దీంతో గగన్ ఏంటమ్మా ఆ చెమటలు.. ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. తన చేతిలో ఉన్న కర్చీప్ తో శారదకు వచ్చిన చెమటలు తుడుస్తుంటాడు.
శారద: బాగానే ఉన్నాను నాన్నా. కిచెన్ లో ఉక్కపోత. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా..? అందుకే ఈ చెమటలు నువ్వు తిను..
గగన్ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే శారద ఆపుతుంది.
శారద: హ్యాండ్ వాష్ కు వాటరే కదా నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు.
గగన్: పర్వాలేదు అమ్మా నేను వెళ్తాను.
శారద: గగన్ ఫ్లోర్ అంతా పాలతో ఉంది కదరా..? నువ్వు ఉండు నేను తీసుకొస్తాను.
గగన్: సరే
అంటూ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. బౌల్‌లో వాటర్ తీసుకెళ్తుంది శారద. గగన్ చేతులు క్లీన్ చేసుకుంటాడు.
శారద: సరే నాన్నా ఆఫీసుకు టైం అయింది కదా..? బయలుదేరుతావా..?
గగన్: ఇంకా టైం ఉంది అమ్మా ఓ కాఫీ ఇస్తావా..?
శారద: సరే నాన్నా..
అంటూ వెళ్లి శారద కాఫీ చేసుకుని గగన్‌కు ఇస్తుంది. టేబుల్ మీద ప్రసాద్ ఫోన్ ఉంటుంది. చాటు నుంచి ఫోన్ చూసిన ప్రసాద్, శారదకు సైగ చేస్తాడు. శారద కంగారుగా మెల్లగా తన కొంగుతో ఫోన్ తీసుకుంటుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది.
గగన్: ఎవరిదమ్మా ఫోన్.
శారద: ఇంకెవరిది నా ఫోనేరా..?
గగన్: కానీ రింగ్ టోన్ అది కాదే..?
శారద: ఈ మధ్యనే మార్చానురా
గగన్: అవునా సరేలే మాట్లాడు..
శారద: అనౌన్ నెంబర్ రా..
గగన్: నా ఫోన్‌కు సిగ్నల్ కనెక్ట్ కాలేదని ఎవరైనా నీకు ఫోన్ చేశారేమో..? ఇటువ్వు చూస్తాను.
అంటూ ఫోన్ తీసుకుని చూసి తన ఫోన్ చూసి సిగ్నల్ ఉందిలే అమ్మా.. నా కారు చెర్రి తీసుకెళ్లాడమ్మా.. నాకు క్యాబ్ వచ్చింది. నేను వెళ్తాను అంటూ గగన్ వెళ్లిపోతాడు. తర్వాత శారద ఎమోషనల్ అవుతూ నీకు ఎంత చెప్పినా వినలేదు. గగన్ కు విషయం తెలిస్తే.. నా క్యారెక్టర్ ఎంత దిగజారిపోయేది. అంటూ ఏడుస్తుంది. దీంతో ప్రసాద్ శారదకు సారీ చెప్తాడు. నీతో మాట్లాడాలి అంటాడు. శారద కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.
శారద: ఏదో మాట్లాడాలి అన్నారు.
ప్రసాద్: శారద భూమి గురించి నీ అభిప్రాయం ఏంటి..?
శారద: ఉదయాన్నే వచ్చి నన్ను టెన్షన్ పెట్టింది చాలు. నా కొడుకును కాదన్న దాన్ని ఊసెత్తి మళ్లీ నా తల పాడు చేయకండి కాఫీ తాగి బయలుదేరండి.
ప్రసాద్: సరే బయలుదేరే ముందు నీకో విషయం చెప్పాలి.
శారద: భూమి గురించేనా..?
ప్రసాద్: కాదు నక్షత్ర గురించి
శారద: దాని గురించి అయితే మాత్రం ఎందుకు..?
ప్రసాద్: నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆల్‌మోస్ట్ చచ్చి బతికింది.
శారద: అయ్యో ఎందుకు అలా చేసింది పాపం
ప్రసాద్: పాపం అనకు తన సూసైడ్ అటెంప్ట్ చేసుకుందే మన గగన్ తనను ప్రేమించడం లేదని..
శారద: ఏంటి గగన్ ప్రేమించలేదని చావబోయిందా..? ఏదో కుర్రతనం తోటి అది వెంట పడుతుందని అనుకున్నాను కానీ చచ్చేంతగా ప్రేమిస్తుంది అనుకోలేదు.
ప్రసాద్: నేను అనుకోలేదు. ఏదో ఒకటి చేసి నక్షత్రకు గగన్‌కు పెళ్లి చేసేద్దామా..?
శారద: చీచీ అది నా కొడలు ఏంటి..?
ప్రసాద్: నువ్వు చీ అన్నా.. చా అన్నా.. నా అంచనా ప్రకారం గగన్‌తో పెళ్లి అయ్యేదాకా..? ఆ నక్షత్ర విడిచిపెట్టదు. ఏదో ఒకటి చేస్తుంది.
శారద: అది ఏం చేసినా నా కోడలుగా దాన్ని ఒప్పుకోనంటే ఒప్పుకోను.
ప్రసాద్: పోనీ భూమి మన కోడలు అయితే ఒప్పుకుంటావా..?
అని ప్రసాద్ అడగ్గానే.. శారద హ్యపీగా చూస్తుంది. కానీ భూమి ఒప్పుకోవాలి కదా అని అడుగుతుంది. దీంతో నువ్వు ఓకే అను అంతా నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తాడు ప్రసాద్. తర్వాత భూమి దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు ప్రసాద్. భూమి.. గగన్ కోసం ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ పీఏ జాబ్ కోసం ఇంటర్వూ జరుగుతుంది. నేనే పీఏగా జాయిన్ అవుతానని భూమి అంటుంది. తన రెస్యూమ్ తీసుకెళ్లి ఆఫీస్ బాయ్‌కి ఇవ్వగానే ఆ రెస్యూమ్ గగన్‌కు ఇస్తాడు. గగన్ ఆశ్చర్యంగా.. భూమిని ఇంటర్వూ కు పిలుస్తాడు. భూమి లోపలికి వెళ్లి గగన్ తెలియనట్టే బిహేవ్ చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















