అన్వేషించండి

Meghasandesam Serial Today February 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను మెచ్చుకున్న అపూర్వ – గుడిలో ఎదరుపడ్డ శరత్‌ చంద్ర, గగన్‌

Meghasandesam serial today episode February 14th: గగన్‌, శరత్‌ చంద్రల ఫ్యామిలీలు గుడిలో ఎదురుపడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: అపూర్వ రూంలో కూర్చుని ఆలోచిస్తుంటే సుజాత వెళ్లి అమ్మాయి ఈ ఇంటికి ఎలాగూ సంక్రాంతి పండుగ లేదు కనీసం గుడికి వెళ్లడం అయినా ఉందా..? అని అడగ్గానే.. అపూర్వ ఇరిటేటింగ్‌ గా ఉంది పిన్ని అని చెప్తుంది. దీంతో వినబడనట్టు సుజాత ఉందా లేదా..? అంటుంది.

అపూర్వ: మనమే కాదు మనతో పాటు బావ కూడా వస్తారు గుడికి .

సుజాత: ఏం రావడమో ఏంటో అమ్మాయి. అల్లుడు గారు నిన్ను నిన్న చంపేస్తారేమోనని నా ఒళ్లంతా వణికిపోయింది. నువ్వు చచ్చి ఉంటే ఈరోజుకు  రెండు.. రేపటికి మూడు. అంటే రేపు నీ చిన్న కర్మ అన్నమాట. నీ ఫోటోకు దండేసి దండం పెట్టి మా ఊరు బయలుదేరాల్సి వచ్చేది. ఇంకా నేను తినే ఈ మెతుకుల మీద నా పేరు రాసి ఉంది కాబట్టి నువ్వు బతికి ఉన్నావు అమ్మాయి.

నక్షత్ర: అంత తేలిగ్గా మా మమ్మిని ఎలా చావనిస్తాను గోరింటాకు. టైంకు నేను రెడీ చేసినా ఏఐ ఇమేజనరీని నేను ప్లే చేశాను కదా..?

అపూర్వ: నిజమే బేబీ టైంకి నువ్వు కనక ఆ వీడియో ప్లే చేయకుండా ఉండి ఉంటే . పిన్ని చెప్పినట్టు ఇప్పటికి నేను చచ్చిపోయి ఉండాల్సింది. నేను నీకు జన్మను ఇవ్వడం కాదే ఈ రోజు నువ్వే నాకు మరుజన్మను ఇచ్చావు. అవును నిన్న నువ్వు చేసిన ఏఐ ఇమేజ్‌ అలాగే ఉందా..? మరి మనమీద డాడీకి తప్పుగా చూపించిన ఆ ఇమేజ్‌ ఎవరు చేసినట్టు.. మనంతట మనమే చూపించేలా నీ ఫోన్‌లోకి ఆ ఇమేజ్‌ను  మార్చింది ఎవరు..?

సుజాత: ఆ ఇంకెవరు ఆ చెర్రి గాడి ఆత్మ అమ్మాయి..

అపూర్వ: చీ నోరు మూయ్‌..

సుజాత: ఆ నువ్వు ఇలాగే నోరు మూయ్‌ నోరు మూయ్‌ అంటావ్‌.. నీకా ఆ దెయ్యం బండగాడు కనబడడాయో.. మమ్మల్ని వదలడాయో.. ఇది కూడా ఆ చెర్రి గాడి ఆత్మ పనేనమ్మాయి.

అపూర్వ: పిన్ని ఆత్మ లేదు ప్రేతాత్మ లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తుంటే మన వెనకాల ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అసలు అదేంటో తెలుసుకోవాలి. ఏదో ఉంది మిస్టరీ..?

అంటూ అపూర్వ ఆలోచిస్తుంది. నక్షత్ర, సుజాత కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. తర్వాత గుడి దగ్గర సంక్రాతి సంబరాలు జరుగుతుంటాయి. అక్కడ సంబరాల్లో భాగంగా కర్రసాము పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కర్రసాము పోటీలలో విజేతగా నిలుస్తున్న శరత్‌చంద్రను మెచ్చుకుంటూ ఫ్లెక్సీలు ఉంటాయి. అప్పుడే అక్కడకు శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర, సుజాత వెళ్తారు. వాళ్ల వెనకాలే కేపీ, మీరా వెళ్తారు. అదే గుడికి గగన్‌ కూడా కుటుంబంతో వెళ్తాడు. గగన్‌ వాళ్లను చూసిన శరత్‌ చంద్ర కోపంతో రగిలిపోతుంటాడు. అపూర్వ కోపంగా చూస్తుంది. భూమి మాత్రం శరత్‌ చంద్ర వైపు బాధగా చూస్తుంది. శారద చూస్తుందని మీరా, కేపీని దగ్గరకు తీసుకుని చేయి పట్టుకుంటుంది.

సుజాత: ఇక్కడ అందరికీ రియాక్షన్స్‌ ఉన్నాయి. క్యామెడీ క్యారెక్టర్‌ను నాకే ఏ రియాక్షన్స్‌ లేవు. ఈ సమ్మర్‌లో అయినా నాకు తాళి కట్టే జోడీ దొరికితే నేను కూడా ఒక మంచి రొమాంటిక్‌ రియాక్షన్ ఇవ్వాలి

అని మనసులో అనుకుంటుంది. శరత్‌ చంద్ర అందరినీ తీసుకుని గుడిలోకి వెళ్తాడు. వాళ్ల వెనకాలే గగన్‌ ఫ్యామిలీ వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget