Prema Entha Madhuram June 23th: ఆస్తుల కోసం బరితెగించేస్తున్న మాన్సీ-మరో సీక్రెట్ ప్లేస్ కు చేరుకున్న అను?
మాన్సీ మళ్లీ వచ్చి ఆస్తుల కోసం రెచ్చిపోయి మాట్లాడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 23th: అనుకోసం వెతకడానికి వెళ్లిన ఆర్య అనుని తీసుకొస్తాడో లేదో అని టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. దాంతో అంజలి ధైర్యం ఇస్తుంది. అప్పుడే ఆర్య, జెండే వస్తారు. ఏం జరిగింది అని అడగటంతో తాము వస్తున్నామని తెలుసుకొని అను అక్కడి నుంచి వెళ్లిపోయిన అని చెప్పి బాధపడతాడు. అంతేకాకుండా కన్నెపిల్లలను దగ్గర తీసుకొని మరి దూరం చేసుకున్నాను అని అనుకోని బాధపడతాడు.
గతంలో పూజ చేయించిన పాప తన బిడ్డ అని.. పాపని ఎత్తుకున్నప్పుడు ఆ సమయంలో గుండెల్లో వచ్చిన సంతోషం పట్ల కన్న బంధం అని తెలుసుకోలేకపోయాను అని అంటాడు. అంతేకాకుండా అను ఉన్న ఇంటికి గతంలో కూడా వెళ్లాను అని అక్కడ కూడా పాపతో ఆడుకున్నాను అని కానీ అను అక్కడుంది అని గమనించలేకపోయాను అని చెప్పుకొని బాధపడతాడు.
వెంటనే నీరజ్ ఇదంతా మాన్సీ వల్ల జరిగింది అని.. తను చేసిన తప్పులను ప్రతిసారి క్షమించి వదిలేయడం వల్ల ఇప్పుడు ఇంత దానికి దారి తీసింది అని మంచితనమే శత్రువు అయింది అని కోపంతో చెబుతాడు. శారదమ్మ కూడా మాన్సీ ని తలుచుకొని కోపంగా రగిలిపోతుంది. అప్పుడే మాన్సీ సారీ అని చెబుతూ ఇంట్లోకి అడుగుపెడుతుండగా నీరజ్ అరుస్తాడు.
అయినా కూడా లోపలికి వచ్చి.. తను మొదటి నుండి ఇలా కాదు అని.. పిల్లలు పుట్ట లేకపోవటంతో, అను ని పైకి ఎత్తడంతో ఆ సమయంలో తనకు ఇలా కోపం వచ్చిందని అంటుంది. ఇక ఆమె రావటంతో అందరూ కోపంగా కనిపిస్తారు. మాన్సీ మాత్రం సారీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శారదమ్మ కూడా తనపై అరుస్తుంది.
మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ అంజలి నిలదీస్తుంది. జెండే కూడా తనపై కోపం చూపిస్తాడు. ఇక మాన్సీ తనది తప్పులేదు అన్నట్లుగా మాట్లాడుతూ కనిపిస్తుంది. వెంటనే ఆర్యకు కోపం రావడంతో తనపై అరుస్తూ తనను గడప అవతలికి పంపించేస్తాడు. ఇక క్షమించేది లేదు అని అంటాడు. మీరు ఇలా చేస్తారని సేఫ్ గా లాయర్ ని తెచ్చుకున్నాను అని షాక్ ఇస్తుంది మాన్సీ.
విడాకులు కోసమే కాకుండా ఇందులో భరణం కింద వచ్చే ఆస్తి కూడా రావాలి అని అంటుంది. అందరూ కోపంగా కనిపిస్తారు. ఇక విడాకులు వచ్చేవరకు నా రెస్పాన్సిబిలిటీ మీరే చూసుకోవాలి అంటూ.. నాకు భరించే ఖర్చు పెట్టాలని లేదంటే కోర్టు మెట్లు ఎక్కుతాను అని అనటంతో లాయర్ కూడా అదే విధంగా చెబుతాడు. వెంటనే ఆర్య నీరజ్ తో లాయర్ తో మాట్లాడి విడాకులు ఇప్పుడే వచ్చేలా చేయమని చెప్పటంతో నీరజ్ ఓకే అంటాడు.
ఇక ఆర్య అక్కడి నుంచి వెళ్లగా శారదమ్మ తనపై చీదరించుకుంటుంది. అంజలి, నీరజ్ కూడా తనపై ఫైర్ అయ్యి లోపలికి వెళ్ళిపోతారు. మరోవైపు అనుని పిల్లలతో సహా బామ్మ తన అక్క కాంతం ఇంటికి వెళ్లి అను గురించి చెప్పి తనని చూసుకోమని చెబుతుంది. ఇక ఎవరైనా వచ్చి తన గురించి అడిగితే చెప్పొద్దు అని అంటుంది అను. దాంతో బామ్మ కూడా చచ్చేవరకు నీ గురించి నిజం ఎవరికీ చెప్పను అని అంటుంది. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు అను ఆర్య కంటపడటం చాలా కష్టమని తెలుస్తుంది.
Also Read: Rangula Ratnam June 22th: సంతోషంలో సూర్యం దంపతులు.. రేఖ చెంప పగలగొట్టిన ప్రసాద్?