అన్వేషించండి

Prema Entha Madhuram July 11th: మోసపోయానని తెలుసుకున్న మాన్సీ, అను నిజజీవితం గురించి తెలుసుకున్న ప్రీతి?

డాక్యుమెంట్ విషయంలో మాన్సీ ఆర్య వాళ్ళ నుండి మోసపోయినందుకు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram July 11th: అను తన పిల్లలతో ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని.. ఇక నాకు మంచి జాబ్ రావటమే కాకుండా అక్కడ మీ నాన్న వాళ్ళకు కూడా కష్టాలు తప్పాయని.. మీ పిన్ని, బాబాయ్, నానమ్మ అందరూ సంతోషంగా ఉన్నారు అని చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రీతి, రేష్మ వచ్చి అనుని గట్టిగా కోపంతో పిలుస్తారు. దాంతో అను ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ అడుగుతుంది.

ఇక వాళ్ళు వెంటనే ఇట్స్ ఏ సెలబ్రేషన్స్ టైం అంటూ సంతోషంగా కనిపిస్తారు. అంజలి, నీరజ్ వాళ్ళ ఈవెంట్ సోషల్ మీడియాలో పెట్టినందుకు మరో 15 ఈవెంట్లు వచ్చాయి అని సంబరపడి పోతారు. ఇదంతా నీ వల్లే అని ప్రీతి అనుని పొగుడుతుంది. మనమంతా ఒక టీం అని సంతోషంగా చెబుతుంది. మరోవైపు మాన్సీ అంజలి వాళ్ళు సంతకం పెట్టిన డాక్యుమెంట్లు లాయర్ దగ్గరికి తీసుకువచ్చి ఇవన్నీ తన పేరుకి వచ్చేలా చేయమని అంటుంది.

ఇక ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈరోజు గుడ్ డే అని అనటంతో వెంటనే లాయర్ ఆ డాక్యుమెంట్లు చేసి బ్యాడ్ డే అని అంటాడు. వెంటనే మాన్సీ ఏం జరిగింది అని అడగడంతో అక్కడ సైన్ లేవు అని అంటాడు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నా కళ్ళముందే వాళ్ళు సైన్ చేశారు అని అసలు ఎలా పోతుంది అని అనడంతో వెంటనే ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఇది మ్యాజిక్ ఇంక్ తో సైన్ చేశారు అని చెబుతాడు. ఆ సమయంలో అంజలి మిమ్మల్ని కూల్ చేయడానికి అలా చేసింది అని అంటాడు.

దాంతో మాన్సీ తను మోసపోయినందుకు కోపంతో రగిలిపోతుంది. ఇది అంజలి ప్లాన్ కాదు అని ఇటువంటి ఐడియాస్ ఆర్య కి వస్తాయని కోపంతో అంటుంది. ఇక వాళ్ళను ఎవ్వరిని వదిలిపెట్టను అని.. అంతకు అంత పగ తీర్చుకొని నేనేంటో వాళ్లకి క్లియర్గా తెలిసేలా చేస్తాను అని అంటుంది. ఇక ఆఫీసులో టాయ్స్ కు సంబంధించిన బిజినెస్ గురించి తను వర్కర్స్ కు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.

ఇక అను బర్త్డే వరకు ఆ బిజినెస్ టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అని అనటంతో వెంటనే మర్చిపోయాను ప్రీతికి ఫోన్ చేయాలి అని ప్రీతికి ఫోన్ చేసి ఈవెంట్ గురించి మాట్లాడుతుంది. అను బర్త్డే కోసం ఈవెంట్ గురించి ఆర్య సార్ మీకు అన్ని చెప్పే ఉన్నాడు కదా.. ఇక ఈవెంట్ గురించి మాట్లాడటానికి మీరు ఒకసారి మీ టీం తో ఆఫీస్ కి రండి అని అంటుంది. అంతే కాకుండా అను డీటెయిల్స్ కూడా పంపిస్తాను అని అంటుంది.

అక్కడే ఉన్న అను షాక్ అవుతుంది. ఆర్య సార్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాలి అనటంతో అను ఇబ్బంది పడుతుండగా పక్కనే ఉన్న రేష్మ అను ని చూసి అను ఎందుకు నేను వస్తాను అని అంటుంది. కానీ అను రావాలి అని అనటంతో అను ఏమి చెప్పలేక పోతుంది. రేష్మ ఏవేవో చెప్పటంతో అప్పుడే ప్రీతికి అంజలి అను డీటెయిల్స్ పంపిస్తుంది.

ఇక అందులో అను ఫోటో చూసి ప్రీతి షాక్ అవుతుంది. ఇక ఎదుట నిలబడిన అను మరింత టెన్షన్ పడుతుంది. ఇక ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నీలాగా ఉంది అనడంతో.. అది నేనే అని అంటుంది. ఇక రేష్మ అను గురించి నిజం చెబుతుంది. దాంతో ప్రీతి ఇలా పేరు మార్చుకొని ఇక్కడ ఉండటం ఏంటి అని అడుగుతుంది. ఇక అను తన భర్త క్షేమం కోసం అజ్ఞాతంలో ఉంటున్నాను అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది. 

దానితో అర్థం చేసుకున్నాను అని ప్రీతి అంటుంది. ఇక ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నట్టే ఏ దోషం కైనా పరిహారం ఉంటుంది అని ప్రీతి సలహా ఇస్తూ ధైర్యం ఇస్తుంది. ఇక ఆ ముసుగులోనే ఆర్య సార్ కి దగ్గరగా ఉండు అని సలహా ఇస్తుంది. అంతేకాకుండా మీరు కలిసే మార్గం త్వరలోనే ఉంది అని చెబుతుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఫ్యామిలీకి దగ్గర ఉండమని చెబుతుంది. దాంతో అను థాంక్యూ అని సంతోషపడుతుంది.

కాస్త అలిగినట్లు రేష్మ బుంగమూతి పెట్టడంతో ప్రీతి మన ముగ్గురం ఫ్రెండ్స్ అని చెబుతుంది. ఇక నేను పాపని చూసుకుంటాను నువ్వు బాబుని తీసుకొని వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఆఫీసులో ఉన్న ఆర్య అను ఆలోచనలో ఉండగా అక్కడికి వచ్చిన జెండే, నీరజ్ వచ్చే ఆర్య ని చూసి బాధపడతారు. అను వచ్చాక సంతోషంగా ఉంటాడు అని మాట్లాడుకుంటారు. ఇక ఆర్య దగ్గరికి వచ్చి ఆర్య బాధలు అర్థం చేసుకుంటూ మాట్లాడతారు. ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అప్పుడే అంజలి అక్కడికి వచ్చి ప్రీతీ వాళ్ళు ఈవెంట్ గురించి మాట్లాడటానికి వచ్చారు అని చెబుతుంది. ఇక ప్రీతి వాళ్ళు లోపలికి రాగా అను ఆర్య పక్కన కూర్చుంటుంది.

Also Read: Madhuranagarilo July 10th: సంయుక్త అడ్డు తొలగించుకున్న శ్యామ్.. అపర్ణ మాటలకు నిజం తెలుసుకున్న కూతురు?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget