అన్వేషించండి

Prema Entha Madhuram September 30th: అనుకి పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చిన మాన్సీ - నిజం తెలుసుకుని షాక్ లో అను!

ఆర్య పెళ్లి గురించి అను తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram september 30th: చూసావా మనల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఛాయాదేవి అంటుంది.

మాన్సి: మనకున్న ఫేస్ వాల్యూ అలాంటిది

టీచర్: సార్ లోపలికి వచ్చి టీ తాగండి. అలాగే మీరు కూడా రండి మేడం.

ఛాయాదేవి: వద్దు యు క్యారీ ఆన్ అని చెప్పి ఆర్య చెవి దగ్గరికి వెళ్లి, పెళ్లికి అన్ని వస్తువులు కొనుక్కోవాలి పెళ్లప్పుడు కలుద్దాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఆర్య స్కూల్ లోపలికి వెళ్లి కొంచెం సేపటి తర్వాత బయటికి వస్తాడు. ఇంతలో అక్కి ఆర్య దగ్గరికి వస్తుంది.

అక్కి: ఫ్రెండ్ మీరు మా స్కూల్ ని కాపాడారు కదా అందుకే మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మీరు ఒకసారి పక్కకి రండి అని బెంచ్ మీద కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని చెప్తుంది. అప్పుడు తను పిల్లలకి ఒక సిగ్నల్ ఇవ్వగా పిల్లలందరూ వాళ్ళ లంచ్ డబ్బాలు పట్టుకొని వస్తారు.

అక్కి: ఈరోజు మా అందరి లంచ్ మీకు ఇద్దామనుకుంటున్నాము అని పిల్లలందరూ వచ్చి ఒక్కొక్క ముద్ద ఆర్యకి పెడతారు. అప్పుడు ఆర్య చాలా ఎమోషనల్ అవుతాడు. తింటున్నప్పుడు ఆర్య కు దగ్గు రాగా అభయ్ వచ్చి మంచినీళ్లు ఇస్తాడు.

అభయ్: పలబారినప్పుడు నుదుటిమీద తట్టితే మంచిదట మా అమ్మ చెప్పింది.

అక్కి: కడుపు నిండిందా ఫ్రెండ్?

ఆర్య: మనస్ఫూర్తిగా తిన్నాను. మరి మా ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తావు?

అక్కి: ఈ సండే వస్తాను

అభయ్: అమ్మ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు దేనికి సరే అనకూడదు అక్కి అని అనగా జెండే అభయ్ ని ఆటపాటిస్తాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత పిల్లలు ఇద్దరు వెళ్లిపోతారు.

ఆర్య: పిల్లలు ఇద్దరినీ బాగా పెంచారు మంచి లక్షణాలు వచ్చాయి అని అనగా ఒక మూల నుంచి అను ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది.

అను: మీ పిల్లలు కద సార్ అందుకే మీ పోలికలు వచ్చాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత సీన్లో అను తన ఇంట్లో కుట్టుకుంటూ ఉండగా పిల్లలిద్దరూ వస్తారు. పిల్లలతో పాటు టీచర్ కూడా వస్తుంది.

టీచర్: బట్టలు కుట్టడానికి మీకు ఆర్డర్ ఇద్దామనుకున్నాను. అదే దారిలో పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను అని అనగా పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు.

టీచర్: అయినా చేతుల్లో నుంచి కోల్పోయాం అనుకున్న స్కూల్ మళ్ళీ బాగుపడింది. ఎక్కడ ఉద్యోగాలు పోతాయి అని భయపడ్డాను ఆర్య వర్ధన్ గారు మంచి నిర్ణయం తీసుకుని మనల్ని కాపాడారు

అను: అవును ఆర్య సార్ ఇచ్చిన మాట కోసం ఎంతైనా చేస్తారు

టీచర్: అయినా ఆయన చేసిన త్యాగం అంతా కాదు. మీరు చెప్తున్నాను కానీ ఎవరికీ చెప్పొద్దు నేను కూడా ఎవరో మాట్లాడుకుంటే విన్నాను. ఆ ఛాయాదేవి మన స్కూల్ నీ లాక్కున్నది కదా ఆ స్కూల్ ని విడిపించడానికి ఆర్య వర్ధన్ గారు తనని పెళ్లి చేసుకుంటాను అని అన్నారట. అందుకే స్కూల్ ని ఛాయాదేవి విడిచిపెట్టింది.

లేకపోతే తను ఎందుకు వదులుతాది. సరే ఇంక నేను వెళ్తాను టైం అవుతుంది ఆర్డర్ ఏంటో మీకు ఫోన్లో మెసేజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది టీచర్. ఆ మాటలు విన్న అను ఒకేసారి కంగారు పడిపోతుంది.

ఆ తర్వాత సీన్ లో జెండే కార్ బయట ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చి రోహిత్ హియర్ అని అంటాడు ఒకడు. అప్పుడు జెండే రోహిత్ ని తన కారులో ఎక్కించుకొని వెళ్తాడు. ఇంతలో జెండే ఆర్యకి ఫోన్ చేస్తాడు.

జెండే: ఆర్య రోహిత్ ని కలిసాను. ఆగు తనికి ఇస్తున్నాను అని ఫోన్ ని రోహిత్ ఇస్తాడు. అప్పుడు ఎలా ఉన్నావు అని ఒకరినొకరు పలకరించుకుంటారు ఆర్య, రోహిత్లు.

ఆర్య: చూడు రోహిత్ నీకు ఒక గెస్ట్ హౌస్ ఇస్తాను నువ్వు పెళ్లయినంతవరకు అక్కడే ఉండు. అప్పటివరకు నువ్వు ఎవరికీ కనిపించకూడదు. మిగిలిన ఏర్పాటు అన్నీ జెండే చూసుకుంటాడు జాగ్రత్తగా ఉండండి. 

ALso Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!

రోహిత్: థాంక్యూ సర్ అని అనగా తర్వాత ఫోన్ పెట్టేస్తాడు ఆర్య. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నీరజ్, అంజలీలు ఉంటారు.

ఆర్య: మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు దయచేసి నన్ను ఏం అడగవద్దు. ఏం చేసినా చివరికి అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అంతకుమించి మీకు ఏం చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. ఆర్య ఎందుకు అలా చూస్తున్నాడు అని ఆలోచనలో పడతారు నీరజ్, అంజలీలు.

ఆ తర్వాత సిల్లో అను ఒకటే కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

అను: టీచర్ చెప్పింది నిజమై ఉండదు ఎందుకంటే ఆర్య సార్ నన్ను కాకుండా వేరొకరిని తన భార్య స్థానంలో ఊహించుకోరు. అందులోని ఆ ఛాయాదేవిని అంటే అసలు ఊహించుకోరు ఇదంతా జరిగే పని కాదు ఇది నిజం కాదు అనుకుంటూ ఉండగా మాన్సి అక్కడికి కుంకుమ బొట్టు పట్టుకొని వస్తుంది.

మాన్సి: ఏదో కోల్పోయినట్టు అంత దిగులుగా కూర్చున్నావు, నేను వస్తే అలా హడలిపోతున్నావంటే ఈ పాటికి విషయం నీ వరకు వచ్చే ఉంటుంది కదా. అంటే ఏమీ లేదు ఒకవేళ నీ వరకు ఈ విషయం వచ్చినా కూడా ఆర్య సార్ భార్య స్థానం ఎవరికీ ఇవ్వరు అని నువ్వు ఈ విషయాన్ని నమ్మవు కదా.

అందుకే కన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. బ్రో ఇన్ లా కి ఛాయాదేవికి పెళ్లి. దానికి ఫస్ట్ శుభలేఖ నీకే ఇస్తున్నాను. నువ్వు నమ్మకపోవచ్చు అందుకే నీకు వీడియో కూడా చూపిస్తాను అని ఆర్య తాంబూలాలు తీసుకోమన్న వీడియోని చూపిస్తుంది మాన్సి.

Also Read: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ

అను: సార్ తంబులలేంటి?జలంధర్ తీసుకోవడం ఏంటి? సార్ ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేశంగా కంగారు పడిపోతుంది.

మాన్సి: ఓ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఛాయాదేవి ఎవరో కాదు జలంధర్ కి తోడు పుట్టిన చెల్లెలు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget