Krishna Mukunda Murari September 30th: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ
ముకుంద, కృష్ణ ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Krishna Mukunda Murari September 30th: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ Krishna Mukunda Murari Serial September 30th Episode 276 Written Update Today Episode Krishna Mukunda Murari September 30th: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/73df46b81ca16c796af4df97ec6476451696047997137521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Serial September 30th: అందరి ముందు మురారీతో క్లోజ్ గా ఉండొద్దని మధుకర్ కృష్ణకి సలహా ఇస్తాడు. మేమిద్దరం విడిపోవాలని చేస్తున్నావా అని తిడుతుంది. మీరు ఇలా ఉంటే ఇగోఇస్ట్ ముకుంద ఏదో ఒకటి చేస్తుంది అందుకే దూరంగా ఉన్నట్టు ఉంటే తను సైలెంట్ గా ఉంటుందని చెప్పేసరికి కృష్ణ సరేనని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఒంటరిగా కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటుంటే ముకుంద వస్తుంది.
ముకుంద: నిన్ను చదివిస్తానని మీ నాన్నకి మా మురారీ మాట ఇచ్చాడు. చదివించాడు, వెళ్లిపోయావ్ పైగా కోడలిగా బాధ్యతలు సరిగా నిర్వర్తించమని నాకు అప్పగించావ్.. కానీ మళ్ళీ వచ్చింది నువ్వు. ఇప్పుడు చెప్పు పరాయి వాళ్ళు ఎవరు
కృష్ణ: నువ్వే.. అప్పుడు నీ నిజస్వరూపం తెలియదు. నిజంగానే ఆదర్శ్ కోసం ఎదురుచూస్తున్నావ్ అనుకున్నా. కానీ నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదని అర్థం అయ్యింది. పరాయి వాళ్ళ భర్త కోసం ఆరాట పడుతున్న నిన్ను ఏం అనాలో అర్థం కావడం లేదు
ముకుంద: మురారీ మనసులో నువ్వు శరణార్థివి దిక్కు మొక్కు లేనిదానివి. నువ్వు నా దారికి అడ్డువస్తావ్ ఏంటి?
Also Read: రాహుల్-రుద్రాణికి షాక్ ఇచ్చిన రాజ్ , అయ్యో తల్లీకొడుకుల ఆస్కార్ పెర్ఫామెన్స్ వేస్ట్!
కృష్ణ: అడ్డు వస్తాను. నీ మాయలో పడితే ఏసీపీ సర్ మాత్రమే కాదు ఈ ఇంటి పరువు కూడ సర్వనాశనం అయిపోతుంది
ముకుంద: నువ్వు ఏం చేసిన అవి వృధా ప్రయత్నాలే. నీ కాపురం మూన్నాళ్ళ ముచ్చటే
కృష్ణ: నీకున్న మానసిక రోగం పోవాలంటే ఆదర్శ్ కోసం వెయిట్ చేయి
ముకుంద: అది ఎన్నటికీ జరగదు
కృష్ణ: జరిగేది ఇదే జరిపించేది నేనే. లాస్ట్ పంచ్ మనది అయితే ఆ కిక్కే వేరబ్బా
మురారీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉండగా తను గదిలోకి వస్తుంది. జడ కంటే పొడవుగా పూలు పెట్టుకుని వచ్చేసరికి మురారీ ఆశ్చర్యంగా అడుగుతాడు. తన జడలో పూలు తీసి వాటిని సరిగా చేసి పెళ్ళాం జడలో పెడతాడు. మీ మనసులో ప్రేమ ఒక్కసారి బయట పెడితే ముకుందని మార్చి ఆదర్శ్ తో హనీ మూన్ కి పంపించేస్తానని అనుకుంటుంది. ముకుంద కృష ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలేఖ్య వచ్చి ఏమైందని పలకరిస్తుంది.
ముకుంద: కృష్ణ నా కంట్లో నలుసులాగా తయారైంది నన్ను బాగా రెచ్చగొడుతుంది
అలేఖ్య: ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావ్
ముకుంద: ప్లాన్ నెంబర్ 1.. ఆదర్శ్ వస్తాడని తీసుకొస్తామని హామీలు ఇస్తున్నారు. కృష్ణ అయితే ఆదర్శ్ ని తీసుకొస్తానని మా నాన్నకి నేరుగా మాట ఇచ్చింది. అందుకే ఆదర్శ్ రాడని వాళ్ళకి నమ్మకం కలిగేలా చేయాలి
అలేఖ్య: అది ఎలా సాధ్యం
ముకుంద: ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదర్శ్ వస్తాడనే నమ్మకాన్ని ఒమ్ము చేయడమే నా పని
ALso Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!
భవానీ వచ్చి కృష్ణ ఎక్కడ ఉందని మురారీని అడుగుతుంది. అప్పుడే ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు. ముకుంద అక్కడికి రావడంతో రేవతి కృష్ణతో క్లోజ్ గా ఉండమని రేవతి చెప్పిన సలహా గుర్తు చేసుకుంటాడు మురారీ. అటు మధుకర్ కృష్ణ మురారీకి దూరంగా ఉండమని అంటాడు. మురారీ కావాలని కృష్ణ దగ్గరకి వెళ్ళి తన తల సరి చేయడం చేస్తూ ఉంటాడు. అది చూసి భవానీ, రేవతి ముసిముసి నవ్వుకుంటారు. కృష్ణ మాత్రం మురారీకి దూరం జరుగుతుంది. అమ్మ అలా చెప్తే కృష్ణ ఏంటి దూరం జరిగిందని అనుకుంటాడు. భవానీకి ఫోన్ వస్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ ఫోన్ చేస్తాడు. ఆ పేరు వినగానే కృష్ణ సంతోషపడుతుంది. ఎవరు నువ్వు అని భవానీ అడుగుతుంది. కృష్ణ తన చిన్నాన్న అని చెప్తుంది. అలా ఫోన్ పెట్టేయగానే ఇలా ఎంట్రీ ఇస్తాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)