అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 17th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రా కిడ్నాప్‌తో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: ఆడిటర్‌ వద్దకు వెళ్లిన మిత్రాను కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యులంతా కంగారుపడిపోతుంటారు.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi : అరవింద, జయదేవ్‌ ఇద్దరూ దీక్షితులగారి వద్దకు వచ్చి ఏమైందని అడుగుతారు.  ఆయన వెంటనే మీరిద్దరూ ఇంటికి వెళ్లిపోండి అని చెబుతాడు. అసలు ఏమైంది...ఎందుకు కంగారుపడుతున్నారని అరవింద(Aravindha) మరోసారి అడుగుతుంది.
 
దీక్షితులు: కంగారుపడవలసిన సమయం వచ్చిందమ్మా..
జయదేవ్‌: అసలు ఏం మాట్లాడుతున్నారు దీక్షితులుగారు
దీక్షితులు: మిత్రా (Mithra) మీదకు మరొక గండం దండెత్తుకుని రాబోతోంది..? మిత్రాను అమాంతం కబలించడానికి సిద్ధంగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో మిత్రకను కంటికి రెప్పలా కాసుకుని చూసుకోవడం చాలా అవసరం. తనని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి
 
జయదేవ్: దీక్షితులు గారు ..దీనికి శాశ్వత పరిష్కారం ఏం లేదా.?
దీక్షితులు: మీరు ఇలాగే కాలయాపన చేయకండి. వెంటనే ఇంటికి వెళ్లండి. మిత్రను ఎక్కడికి వెళ్లకుండా ఆపండి
దీక్షితులకు నమస్కరించి వారిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు
 
ఇంతలోనే కారులోనే కారులో వెళ్తున్న మిత్రను గ్యాంగ్ కిడ్నాప్(Kidnap) చేస్తుంది. ఆ సమయంలో ఆయన ఫోన్ కిందపడిపోతుంది. మిత్రా ఇంకా రాకపోవడంతో ఆడిటర్ వివేక్‌కు ఫోన్ చేసి అడుగుతాడు. మీ వద్దకు బయలుదేరి వచ్చాడని వివేక్ చెప్పగా...రాలేదని, ఫోన్ చేస్తున్నా లిప్ట్‌ చేయడం లేదని చెబుతాడు. దీంతో వివేక్‌ కూడా అన్నయ్యకు ఫోన్ చేస్తాడు. వివేక్ (Vivek)కంగారుపడటం చూసి  సంయుక్త ఏమైందని అడుగుతుంది...అన్నయ్య ఫోన్ లిప్ట్ చేయడం లేదని, ఆడిటర్‌ వద్దకు అని చెప్పి వెళ్లాడని...అక్కడికి కూడా వెళ్లలేదని చెబుతాడు. దీంతో మిత్రా బిజిగా ఉండి ఉంటారులే కంగారుపడకు...కాస్త ఆగి మళ్లీ ఫోన్ చేద్దామని సంయుక్త సముదాయిస్తుంది. అప్పుడే అక్కడికి వివేక్‌ వాళ్ల అమ్మ దేవయాని(Devayani) వస్తారు. ఏమైందని అడగడంతో  వివేక్‌ మిత్రా గురించి చెబుతాడు. దీనికి ఆమె ఏం కాదులే అని చెబుతుండగా...అత్తయ్యగారు వచ్చే సమయం అయ్యింది ఆమె ముందు మిత్రా కనిపించడం లేదన్న సంగతి చెప్పొద్దంటూ సంయుక్త నోరుజారుతుంది. అరవిందను సంయుక్త అత్తయ్యగారు అని పిలవడంతో  దేవయానికి అనుమానం వస్తుంది. వెంటనే తేరుకున్న సంయుక్త  తాను పొరపాటుగా అలా  మాట్లాడనని చెబుతుంది. దీంతో  దేవయాని ఏం పర్వాలేదులే మా అక్క కూడా నిన్ను కోడలు అంటుంది కదా...పైగా నువ్వు అచ్చం మా లక్ష్మీలాగే ఉన్నావ్ అంటుంది. కాబట్టి నువ్వు మా అక్కని అత్తయ్యగారు అని పిలవడంలోతప్పులేదు అంటుంది. కావాలంటే నన్ను కూడా చిన్న అత్తగారు అని పిలువు అంటుంది
 
వివేక్‌: మామ్‌..ప్లీజ్‌ ఆపుతావా అసలే అన్నయ్యకు ఏమైందోనని నేను కంగారుపడుతుంటే నువ్వు అనవసరమైన చాట భారతమంతా సాగదీసి సాగదీసి చెబుతున్నావ్. దయచేసి కాసేపు సైలెంట్‌గా ఉండు.. పెద్దమ్మ వద్ద అన్నయ్య గురించి  ఏం చెప్పకండి 
 
స్కూల్‌కు వెళ్లిన లక్కీకి వాళ్ల నాన్న గుర్తొస్తాడు. తాను నాకు దూరంగా వెళ్లిపోతున్నట్లు అనిపిస్తోందని ఆమె ప్రెండ్‌తో చెబుతుంది. మళ్లీ కలుసుకోలేనేమో అన్నట్లు మనసంతా ఏదోలా ఉందని అంటుంది.  వాళ్ల ప్రెండ్‌ ఏం కాదులే అని చెబుతాడు
 
ఇంతలో  అరవింద, జయదేవ్‌ కంగారుపడుతూ ఇంటికి వస్తారు. మిత్రా...మిత్రా అంటూ అరవింద అరుస్తుంది. మిత్రాకోసం వెతుకుతున్న అరవిందను సంయుక్త మాటల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో దేవయాని అక్కడి వచ్చి వివేక్ పెళ్లి పెటాకులవ్వడం గురించి ప్రస్తావిస్తుంది. అందుకు అరవింద బదులిస్తుంది. మేం ఎప్పుడూ వివేక్ సంతోషమే కోరుకుంటామని...వాడు జానును చేసుకుంటేనే సంతోషంగా ఉంటాడని చెబుతుంది.
 
దేవయాని: వివేక్‌, జానూ పెళ్లి చేసుకోవడం...వాళ్లు కలిసి బ్రతకడం ఈ జన్మలో జరగదు అక్కా..అయినా ఇప్పుడు జానూకు కూడా వివేక్‌ను పెళ్లి చేసుకోవాలని లేదు.
 
సంయుక్త: దేవయాని ఆంటీ మనం కోరుకున్నప్పుడు వర్షం పడుతుందా..? కాదనుకున్నప్పుడు ఎండ కాస్తుందా..ఏదీ మన చేతిలో ఉండదు. ఏది ఎప్పుడు జరగాలో..ఎలా జరగాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి ఉంటాడు. ఎవరిని ఎప్పుడు కలపాలో ముందే రాసిపెట్టి ఉంటాడు. దాని ప్రకారమే జరుగుతుంది
 
దేవయాని: అవునవును...ఈ రాతలు, గీతలు నమ్ముకుని కూర్చోండి. ఆ రాతలు బాగాలేకే..ఈ ఇంటి కోడలు అయిన లక్ష్మీ కుక్క చావు చచ్చి కుటుంబానికి దూరమైంది...
 
అరవింద: నోర్మూయ్‌....లక్ష్మీ గురించి మాట్లాడేప్పుడు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు దేవయాని...నోరు ఉంది కదాని దాన్ని ఎటుపడితే అటు తిప్పితే  నేనేం చేస్తానో నాకే తెలియదు.
 
దేవయాని; ఇప్పుడు నేను అన్న మాటల్లో అబద్దం ఏముంది అక్కా..అన్ని బాగానే ఉంటే ఆ లక్ష్మీయే ఇప్పుడు నీ ఇంటి కోడలుగా ఉండేది కదా ...అసలు తాను ఏమైందో మీకు తెలుసా...? పంతులను పిలిపించి గొప్పగొప్ప ముహూర్తాలు పెట్టించారు. గొప్ప జాతకం ఉన్నదని లక్ష్మీని తీసుకొచ్చి మిత్రకు కట్టబెట్టారు. మీరు నమ్మిన ఆ రాతలు, గీతలు ఎందుకు పనికొచ్చాయి. ఎవరిని కాపాడాయి..?
 
అరవింద: మిత్ర అంటే గుర్తుకొచ్చింది...అరే వివేక్ మిత్రా ఎక్కడరా..?
వివేక్‌; ఆడిటర్ వద్ద ఏదో పని ఉందని వెళ్లాడు పెద్దమ్మ..ఈరోజు కొంచెం బిజీగా ఉంటాడులే.
 
అరవింద: అదేంటి...నేను ఆశ్రమం నుంచి వస్తున్నానని వాడికి తెలియదా..?
 
వివేక్‌: లేదు పెద్దమ్మా...అన్నయ్యకు నువ్వు వస్తున్న విషయం తెలియదు.
 
అరవింద: సరే...మిత్రాకు కాల్‌చేసి అర్జంట్‌గా ఇంటికి రమ్మని చెప్పు
వివేక్‌: ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది పెద్దమ్మా..అన్నయ్యకు కాల్‌చేస్తే కలవడం లేదు. 
ఫోన్ లిప్ట్‌ చేయడం లేదని వివేక్ చెప్పడంతో అరవింద, జయదేవ్ ఇద్దరూ కంగారుపడిపోతారు. అసలు ఏమైంది వాడికి అంటూ కంగారుపడుతుంది. మిత్రకు మళ్లీ ఏదో గండం ముంచుకొస్తోందని చెబుతుంది. మిత్రను ఇవాళ ఎట్టిపరిస్థితుల్లో బయటకు పంపొద్దని దీక్షితులు గారు చెప్పారని చెబుతుంది. నువ్వు వెంటనే ఆడిటర్ ఇంటికి వెళ్లి మిత్రను తీసుకునిరా అంటూ వివేక్‌కు చెబుతుంది. వివేక్ కంగారు పడుతుండగా...సంయుక్త కలగజేసుకుంటుంది. వెంటనే వెళ్లి ఆడిటర్ ఇంటి వద్ద ఉన్న మిత్రాను తీసుకుని రా అని చెప్పడంతో  వివేక్ బయటకు వెళ్లిపోవడంతో ఇవాల్టి ఏపీసోడ్ ముగుస్తుంది.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget