Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: సిద్ధుకు తులసి దగ్గరవుతుందా? - జైతో పెళ్లికి రెడీ అవుతున్న జానుకు విశ్వ లవ్ లెటర్!
Lakshmi Nivasam Today Episode: జైతో పెళ్లి విషయంలో జానుకు నచ్చచెప్తుంది తులసి. ఇదే సమయంలో తనకు జాబ్ ఇప్పించాలంటూ బసవ ఇంటికి వెళ్లి అడుగుతుంది. అదే సమయంలో ఆమెను సిద్ధు చూస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో...

Lakshmi Nivasam Serial Today April 29th Episode: జైతో పెళ్లి విషయంపై ఏదో నిర్ణయం తీసుకోవాలంటూ జానుకు చెప్తారు లక్ష్మి, శ్రీనివాస్. దీంతో జాను సందిగ్ధంలో ఉండగా.. తులసి ఆమెకు నచ్చచెప్తుంది. మరోవైపు.. తన జాబ్ కోసం కాస్త రికమెండ్ చేయాలంటూ బసవ ఇంటికి వెళ్తుంది తులసి. త్వరలోనే జాబ్ వేయిస్తానంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు బసవ. ఇదే సమయంలో సిద్ధు కిందకు వస్తాడు. తులసిని చూసి ఆమె వెంటపడగా ఈలోపే ఆమె ఆటో ఎక్కి వెళ్లిపోబోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
సిద్ధుతో తులసి జర్నీ..
తులసి ఆటోలో వెళ్లబోతుండగా.. పరిగెత్తుకుంటూ వెళ్లి అదే ఆటోలో ఎక్కుతాడు సిద్ధు. ఇదేంటని తులసి అడిగితే.. ఇది షేర్ ఆటో అంటూ చెప్తాడు. దీంతో తులసి విసుక్కుంటూ ఆటోలో కూర్చుంటుంది. కుదుపులకు తులసి తలను ఢీకొంటాడు సిద్ధు. కొమ్ములొస్తాయంటూ తులసి విసుక్కుంటూనే అతని తలను మళ్లీ ఢీకొంటుంది. దీంతో వాటర్ క్వీన్ కోపంలోనూ చాలా అందంగా ఉందంటూ కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాడు సిద్ధు.
జానుకు విశ్వ ప్రపోజ్
మరోవైపు.. జాను కాలేజీ క్యాంటీన్‌లో ఉండగా.. ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఆమెకు ప్రపోజ్ చేయబోతాడు విశ్వ. ఇదే సమయంలో అక్కడకు వస్తుంటాడు జై. ఇంతలో జానుకు 'ఐ లవ్ యూ' అని చెప్తాడు విశ్వ. అయితే.. జాను బ్లూ టూత్ తీస్తూ.. నువ్వెప్పుడు వచ్చావంటూ విశ్వను అడుగుతుంది. దీంతో షాక్ అవుతాడు విశ్వ. జై ఆమె దగ్గరకు వచ్చి పర్సనల్‌గా మాట్లాడాలని అంటాడు. దీంతో మీరు మాట్లాడుకోండి అంటూ విశ్వ అక్కడి నుంచి వచ్చేస్తాడు.
జాను నువ్వు చెప్పిందేదీ వినలేదని.. ఇప్పుడేం చేస్తావని అడుగుతారు ఫ్రెండ్స్. దీంతో లెటర్ రాస్తానంటాడు విశ్వ. మరోవైపు.. జై తమ ఫ్యామిలీకి చేసిన హెల్ప్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది జాను. దీనికి నన్ను మీ ఫ్యామిలీలోకి రానివ్వాలంటూ.. పెళ్లికి ఓకే చెప్పాలంటూ రిక్వెస్ట్ చేస్తాడు జై. తనకు ఏం చెప్పాలో తెలియడం లేదంటూ చెప్తుంది జాను. ఆ తర్వాత జై అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో విశ్వ లవ్ లెటర్ పూర్తి చేసి బుక్‌లో పెట్టి జానుకు ఇస్తాడు. 13 పేజీలోది చదవడం అస్సలు మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో ఓకే అంటూ జాను అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సిద్ధుతో తులసిని చూసిన సుపర్ణిక
సిద్దు, తులసి ఆటో దిగగా.. ఛేంజ్ లేకపోవడంతో ఓ షాప్ వద్ద చిల్లర తీసుకుని సిద్ధుకి ఇస్తుంది తులసి. ఇదే సమయంలో సుపర్ణిక వీరిని చూసి.. కారు దిగి తులసితో తప్పుగా మాట్లాడుతుంది. ఖుషి జోలికి రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మళ్లీ సిద్ధు తులసి దగ్గరకు రాగా.. ఇక నువ్వు వెంటపడి విసిగించొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోతుంది. ఏమీ అర్థం కాక సిద్ధు సైలెంట్‌గా ఉండిపోతాడు.
అటు.. జైతో జాను పెళ్లి గురించి అందరితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామంటూ శ్రీనివాస్, లక్ష్మి అంటారు. జైతో పెళ్లి ఇష్టమా? కాదా? అని జానును అడుగుతారు. తనకు ఇష్టమేనని వాళ్లతో అంటుంది జాను. దీంతో ఫ్యామిలీ అంతా సంతోషిస్తారు.
మరి విశ్వ రాసిన లెటర్‌ను జాను చదువుతుందా?, జైతో పెళ్లికి ఓకే చెప్పడంతో విశ్వ పరిస్థితి ఏంటి?, తులసికి సిద్ధు దగ్గరవుతాడా? ఇవి తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.





















