అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: శ్రీనివాస్ కాళ్లు పట్టుకున్న ఫైనాన్షియర్ - ఆ ఫ్యామిలీకి అండగా నిలిచిందెవరు?

Lakshmi Nivasam Today Episode: తులసిని ఇంప్రెస్ చేసేందుకు సిద్ధు పాట్లు పడుతుండగా.. శ్రీనివాస్ ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు లాగేందుకు భార్గవ్ ప్లాన్ చేస్తుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today April 26th Episode: ఓవైపు తులసిని ఇంప్రెస్ చేసేందుకు తిప్పలు పడుతుంటాడు సిద్ధు. ఆమె దృష్టిలో మంచివాడిని అనిపించుకోవాలంటూ తాపత్రయపడుతుంటాడు. మరోవైపు, భార్గవ్.. శ్రీనివాస్ ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగేందుకు ప్లాన్ చేస్తాడు. అతనికి అప్పిచ్చిన ఫైనాన్షియర్‌ను వారి ఇంటి మీదకు ఉసిగొల్పుతాడు. దీంతో పూర్తి డబ్బైనా కట్టాలని లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు ఫైనాన్షియర్. అటు కొడుకులిద్దరూ ఈ విషయంలో చేతులెత్తేస్తారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

శ్రీనివాస్‌కు అండగా తులసి, జాను

ఫైనాన్షియర్ ఇచ్చిన వార్నింగ్ తలచుకుని బాధ పడుతుంటాడు శ్రీనివాస్. లక్ష్మి అతన్ని ఓదారుస్తుంది. తన కొడుకులిద్దరికీ ఎందుకు ఇది అర్థం కావడం లేదంటూ లక్ష్మితో అంటాడు శ్రీనివాస్. ఇంతలో తులసి, జాను ఇద్దరూ తాము సంతకాలు పెడతామంటూ శ్రీనివాస్‌తో అంటారు. అది మా బాధ్యత అని డబ్బులు ఎలాగైనా కట్టేస్తామంటూ చెప్తారు. దీంతో వాళ్లను చూసి శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లను చూసి గర్వపడతాడు.

తులసి, జాను సంతకాలు పెడుతున్నారన్న విషయాన్ని లక్ష్మి.. తన కొడుకులు మహేష్, హరీష్‌లకు చెప్తుంది. దీంతో వాళ్లు వారిపై కోపం తెచ్చుకుంటారు. ఏది ఏమైనా సరే ఆ అప్పు మేమే తీరుస్తామంటూ కచ్చితంగా చెప్తారు తులసి, జాను. 

శ్రీనివాస్ కాళ్లు పట్టుకున్న ఫైనాన్షియర్

అలా వాళ్లకు చెప్తూ.. శ్రీనివాస్, జాను, తులసి ఫైనాన్షియర్ వద్దకు వెళ్లేందుకు యత్నిస్తుండగా.. ఫైనాన్షియర్ కేకలు వేసుకుంటూ వచ్చి శ్రీనివాస్ కాళ్లు పట్టుకుంటాడు. క్షమించమని అడుగుతూ ఇంటి పత్రాలను వారి చేతిలో పెడతాడు. బాకీ మొత్తం మాఫీ అయిపోయిందని.. నానా మాటలు అన్నందుకు క్షమించాలని అంటాడు. దీంతో శ్రీనివాస్ ఫ్యామిలీ ఆశ్చర్యానికి గురవుతారు. విషయం ఏంటని అడుగుతారు. ఫైనాన్షియర్ వారి చేతికి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి మీ డౌట్స్ అన్నీ ఆ అడ్రస్‌లో వెళ్లి అడగాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో వాళ్లు షాక్‌కు గురవుతారు. 

మరోవైపు, జాను ఎందుకు ప్రపోజ్ చేయడం లేట్ అయ్యిందంటూ విశ్వను అడుగుతారు అతని ఫ్రెండ్స్. దీంతో పాతవి తలుచుకుంటూ విశ్వ వేదనకు గురవుతాడు. జై అసలు మంచివాడా కాదా? అనేది తెలుసుకోవాలంటూ విశ్వకు సలహా ఇస్తారు అతని ఫ్రెండ్స్. అతని నిజ స్వరూపాన్ని జాను ఫ్యామిలీకి చెప్తే పెళ్లి క్యాన్సిల్ అవుతుందని అంటారు. ఓ డిటెక్టివ్ హెల్ప్ తీసుకుందామని అంటారు. దీనికి విశ్వ ఓకే అంటాడు. 

శ్రీనివాస్ ఫ్యామిలీకి హెల్ప్ చేసిందెవరు?

అటు.. ఫైనాన్షియర్ ఇచ్చిన అడ్రస్‌కు వెళ్తారు లక్ష్మి, శ్రీనివాస్. అక్కడ వాళ్లకు రాచ మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకెళ్తారు సెక్యూరిటీ. అది చూసి ఆశ్చర్యపోతారు శ్రీనివాస్, లక్ష్మి. ఓ రూంలో కూర్చోబెట్టి సార్ వస్తారని.. వెయిట్ చేయాలని అంటారు. 

వాళ్లను ఓ వ్యక్తి వచ్చి సార్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంతలో జై వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటాడు. అతన్ని చూసిన లక్ష్మి, శ్రీనివాస్ ఆశ్చర్యపోతారు. మాకు హెల్ప్ చేసింది మీరా? అంటూ షాక్ అవుతారు. తమను జైలు నుంచి విడిపించింది, తాకట్టు నుంచి ఇంటి పత్రాలు తిరిగి ఇప్పించింది అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఇదే సమయంలో వారి ఆశీర్వాదం తీసుకుంటాడు జై. దీంతో అతన్ని ప్రశంసలు కురిపిస్తారు లక్ష్మి, శ్రీనివాస్. తన స్థలంలో ఇల్లు కట్టి నా భార్య పెట్టాలనుకున్నానని.. తన స్థలం తాకట్టు పెట్టడంతో చాలా వేదన అనుభవించానని అంటాడు శ్రీనివాస్. జాను అంటే తనకు చాలా ఇష్టమని.. తనకిచ్చి పెళ్లి చేయాలని వారితో అంటాడు జై. ఫ్యామిలీ అందరితో మాట్లాడి నిర్ణయం చెప్తామని జైతో అంటారు లక్ష్మీ, శ్రీనివాస్.

మరి జైతో పెళ్లికి జాను ఒప్పుకుంటుందా?, విశ్వ పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget