Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: కనిష్కతో సిద్ధు పెళ్లి ఫిక్స్! - తులసికి సిద్ధు తన ప్రేమ విషయం చెబుతాడా?
Lakshmi Nivasam Today Episode: సిద్ధుకు ఎమ్మెల్యే కూతురితో పెళ్లి ఫిక్స్ చేయాలని చూస్తాడు బసవ. మరోవైపు, జాను దూరమైందంటూ విశ్వ వేదనకు గురవుతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial Today April 19th Episode: ఓ వైపు తన ప్రేమ విషయం తులసికి చెప్పేందుకు సిద్ధు ట్రై చేస్తుండగా.. అతని ఇంట్లో బసవ.. ఎమ్మెల్యే మునుస్వామి కూతురితో సిద్ధుకి పెళ్లి ఫిక్స్ చేసేందుకు చూస్తుంటాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలంటూ గుడికి రావాలంటూ ప్లేస్ ఫిక్స్ చేస్తాడు. మరోవైపు, జానుతో పెళ్లికి జై లైన్ క్లియర్ చేసుకుంటాడు. తన అత్త వాళ్ల గురించి తెలిసిన విశ్వ.. జాను దూరమై ఆ వేదనతో ఉంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
కనిష్కతో సిద్ధుకి పెళ్లి ఫిక్స్!
ఎమ్మెల్యే మునుస్వామి కుమార్తె కనిష్కతో సిద్ధు పెళ్లి ఫిక్స్ చేస్తాడు బసవ. గుడిలో కలుసుకుందామని బసవతో అంటాడు మునుస్వామి. తర్వాత రోజు ఉదయం మునుస్వామి, బసవ ఫ్యామిలీలు గుడికి చేరుకుంటారు. ఆలయానికి ఎందుకు వచ్చామంటూ బసవ కోడలు నీలిమ విశాలాక్షితో అంటుంది. ఇదే టైంలో బసవ తల్లి నీలిమపై కోపం తెచ్చుకుంటుంది. మరోవైపు, సిద్ధును కూడా గుడికి రమ్మంటాడు. సిద్ధు అక్కడికి బయలుదేరుతుండగా.. తులసి కూడా అదే గుడికి వస్తుంది.
విషయం ఏంటని పూజారి బసవను అడగ్గా.. ఎమ్మెల్యే మునుస్వామి కూతురితో సిద్ధు పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. ఇది విన్న నీలిమ, విశాలాక్షి ఆశ్చర్యపోతారు. సిద్ధుకైనా విషయం చెప్తే బాగుండేదని అంటారు. ఇదే సమయంలో తులసిని చూసిన విశాలాక్షి ఆమెను పలకరిస్తుంది. ఇది చూసిన బసవ, అతని తల్లి విశాలాక్షిపై కోపం తెచ్చుకుంటారు. తులసి ముందు బాగానే మాట్లాడినా.. ఆమె వెళ్లిన తర్వాత విశాలాక్షిపై రంకెలు వేస్తాడు బసవ.
సిద్ధు పెళ్లి ఆపేందుకు నీలిమ ప్లాన్
బసవ కోడలు నీలిమ.. ఎమ్మెల్యే మునుస్వామి కూతురు కనిష్కతో సిద్ధు పెళ్లి జరగకుండా ప్లాన్ చేయాలంటూ తన భర్తతో చెబుతుంది. ఈ పెళ్లి జరిగితే పవర్ పూర్తిగా సిద్ధు చేతుల్లోకి వెళ్లిపోతుందని అంటుంది.
ఇదే సమయంలో ఎమ్మెల్యే మునుస్వామి కుటుంబంతో సహా ఆలయంలోకి వస్తాడు. బసవ, మునుస్వామి ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇదే టైంలో ఎమ్మెల్యే కూతురు కనిష్క గుడిలో ప్రదక్షిణలు చేస్తూ అక్కడకు వస్తుంది. తన కూతురుని పరిచయం చేసిన తర్వాత పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆమె అణకువ చూసి అందరూ ఆమెను పొగిడేస్తుంటారు.
సిద్ధుతో కనిష్క లవ్
సిద్ధును చూసిన ఫస్ట్ టైమే కనిష్క ఇష్టపడిందని బసవతో అంటాడు మునుస్వామి. ఇదే సమయంలో అమ్మవారి దగ్గర శేషవస్త్రాన్ని అమ్మాయి చేతికి అబ్బాయి ఇవ్వాలని చెప్తారు పూజారి. సరిగ్గా అప్పుడే సిద్ధు ప్రదక్షిణలు చేస్తూ అక్కడకు వస్తాడు. అతన్ని చూసిన కనిష్క సంతోషపడుతుంది. సిద్ధును వాళ్లకు పరిచయం చేస్తాడు బసవ.
సిద్ధు షాక్
ఎమ్మెల్యే మునుస్వామిని అక్కడ చూసిన సిద్ధు షాక్ అవుతాడు. తనను గొడవ పడేందుకే ఇక్కడకు రమ్మన్నారా? అంటూ తండ్రితో అంటాడు సిద్ధు. విషయం అబ్బాయికి చెప్పలేదా? అంటూ మునుస్వామి బసవను అడుగుతాడు. ఇదే టైంలో సిద్ధును పక్కకు తీసుకెళ్లి విషయం చెప్తాడు.
మరి ఈ పెళ్లికి సిద్ధు ఒప్పుకుంటాడా?, అదే గుడిలో ఉన్న తులసిని సిద్ధు చూస్తాడా?, తన ప్రేమను తులసికి చెప్తాడా? బసవ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇది తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.






















