Lakshimi Raave Maa Intiki Serial Today January 20th: లక్ష్మీ పెళ్లిలో సింధూను తప్పించేందుకు మ్యాడీ ప్లాన్? సింధూ తన తమ్ముడితో మాట్లాడిన మాటలు అత్తగారు విని ఏమనుకుంది...?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 20th: లక్ష్మీ పెళ్లిలో సింధూను తప్పించేందుకు మ్యాడీ ప్లాన్? సింధూ తన తమ్ముడితో మాట్లాడిన మాటలు అత్తగారు విని ఏమనుకుంది...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మహాలక్ష్మీ మరీ మరీ అడగడంతో సూర్యనారాయణ పెళ్లికి ఉండి ఆశీర్వదించిన తర్వాతే వెళ్తామని అంటాడు. అందరినీ లగేజీ తీసుకుని లోపలకి వెళ్లండని ఆదేశిస్తాడు. మ్యాడీ చేసిన పనికి ప్రియంవద కోప్పడుతుంది. మనకు బద్దశత్రువైన ఆ శ్రీలక్ష్మీకి సపోర్ట్‌గా ఎందుకు మాట్లాడావని నిలదీస్తుంది. దాని పతనం చూడటానికే మనం ఉన్నాం కానీ...దాని పెళ్లిచేసి అది సంతోషంగా ఉంటే చూడటానికి కాదని అంటుంది. సింధూ బ్రతుకు ఇలా కావడానికి ఆ లక్ష్మీయే కారణమని మండిపడుతుంది. ఏది ఏమైతే ఏం...మనం ఊరు వెళ్లకుండా ఆగిపోవడానికి ఆ ఎర్రబస్సే కారణమని మ్యాడీ అంటాడు. మనం ఎంత బ్రతిమాలినా తాతయ్య ఊరుకునేవాడా అదే ఆ ఎర్రబస్సు అడగగానే ఒప్పుకున్నాడని అంటాడు. కాబట్టి...ఇప్పటి వరకు మనకు ఎంత నష్టం చేసినా....ఇప్పుడు మన ఊరు ప్రయాణం ఆగిపోవడానికి తనే కారణమని అంటాడు. పైగా రేపు సింధూను తప్పించడానికి కూడా ఈ పెళ్లి అడ్డం పెట్టుకోవచ్చనిచెబుతాడు. మనం ప్లాన్ చేసిన ప్రతిసారీ ఈ లక్ష్మీ అడ్డుపడుతోందని...ఇప్పుడు పెళ్లికూరురిగా పెళ్లిపీటలమీద లక్ష్మీ ఉంటుంది కాబట్టి మనల్ని అడ్డుకునేవారే ఉండరని అంటాడు. లక్ష్మీ పెళ్లికి అక్క కూడా వస్తుందని...అందరూ పెళ్లి హడావుడిలో ఉంటే మనం సింధూను ఊరిదాటించి పంచించొచ్చని చెబుతాడు. మ్యాడీ వేసిన ప్లాన్ అందరికీ నచ్చుతుంది.
ఇంతలో మ్యాడీకి సింధూ ఫోన్ చేస్తుంది.మీరంతా నన్ను వదిలేసి పట్నం వెళ్లిపోతే నేను ఇక్కడ చచ్చిపోతానని బెదిరిస్తుంది. దీంతో మ్యాడీ తాము ఊరు వెళ్లడం లేదని....సరిగ్గా బయలుదేరే టైంకు లక్ష్మీ వచ్చి తన పెళ్లికి పిలిచిందని...తాతయ్య అందరినీ ఆగిపొమ్మన్నాడని చెబుతాడు. ఆ పెళ్లిలోనే నిన్ను తప్పించడానికి ప్లాన్ చేస్తున్నామని చెబుతాడు. అయితే తప్పకుండా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో అంటూ తమ్ముడితో మాట్లాడుతుండగా....మంగతోపాటు వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి అదంతా వింటారు. గోపిని పిలిచి వాళ్ల అమ్మ విషయం మొత్తం చెబుతుంది. నీ పెళ్లాం ఎవరికో ఫోన్ చేసి తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపొమ్మని అంటోందని అరుస్తుంది. నేను మా తమ్ముడికి ఫోన్ చేశానని....లక్ష్మీ పెళ్లిగురించి చెబితే తనను కూడా తీసుకెళ్లమని అడిగానని సింధూ అబద్ధం చెబుతుంది. కానీ అత్తయ్యగారే ఎదేదో చెబుతున్నారని అంటుంది. ఈమాటలు విన్న గోపీ...వాళ‌్ల అమ్మపైనే కోప్పడతాడు. అయినా తను ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఎందుకు విన్నారని....ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతాడు. సింధూకు సారీ చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
లక్ష్మీ పెళ్లిచేసుకుని సంతోషంగా ఉంటే మన పగ ఎలా తీరుతుందని ప్రియంవద మ్యాడీతో అంటుంది. ఆ పెళ్లికొడుకు పెద్ద తాగుబోతు, తిరుగుబోతని మ్యాడీ చెబుతాడు.వాడు తాగివచ్చి రోజూ లక్ష్మీని హింసిస్తుంటే మనకు పండగే కదా అని అంటాడు. వాడు తాగుతున్న బార్‌కు వెళ్లి వాడి వేషాలన్నీచూసి సంతోషిస్తుంటాడు. ఇంతలో లక్ష్మీ ఇంట్లో పెళ్లిపనులు జరుగుతుంటాయి. ఆ ఇంటిని, గోమాతను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని లక్ష్మీఎంతో బాధపడుతుంది.





















