Lakshimi Raave Maa Intiki Serial Today January 12th:సింధూ పెళ్లి ఆపాలని చూసిన మ్యాడీకి లక్ష్మీ ఎలా బుద్ది చెప్పింది..? సూర్యనారాయణ పరువు ఎలా కాపాడింది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 12th: ఇంట్లోనుంచి పారిపోయిన సింధూను లక్ష్మీ తీసుకొచ్చి పెళ్లిపీటలపై కూర్చోబెడుతుంది. సూర్యనారాయణ పరువు కాపాడుతుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: పెళ్లి చీర మార్చుకోవడానికి వెళ్లిన సింధూజాక్షిని మ్యాడీ త్రిష వాళ్లకు ఇచ్చి జాగ్రత్తగా ఇల్లుదాటిస్తాడు. వాళ్లను కారులో ఊరుదాటి వెళ్లిపొమ్మని చెబుతాడు. ఈలోగా ముహుర్తం సమయం మించిపోతుండటంతో పంతులుగారు పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెను రమ్మని చెబుతాడు. గోపీ వచ్చి పెళ్లిపీటల మీదు కూర్చోగా....సింధూను తీసుకొచ్చేందుకు వాళ్ల అమ్మ, పిన్ని ఆమె రూమ్‌కు వెళ్తారు.అక్కడ సింధూ కనిపించకపోయేసరికి కంగారుగా వచ్చి సూర్యనారాయణకు చెబుతారు.ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందని చెప్పి వెతకమని చెప్పగా....కొడుకులిద్దరూ వెళ్లి అన్నిచోట్ల వెతికి ఎక్కడా లేదని చెప్పడంతో సూర్యనారాయణకు ఏం అర్థం కాదు. పెళ్లి ఇంట్లో పెళ్లి కూతురు లేకపోయేసరికి అందరూ కంగారు పడతారు. ఈలోగా మ్యాడీ త్రిషకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్లారని అడగ్గా...ఇప్పుడే ఊరి మధ్యలోకి వచ్చేశామని కాసేపట్లో వెళ్లిపోతామని చెబుతారు. పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసినందుకు సింధూ చాలా సంతోషపడుతుంది.త్రిషతోపాటు వాళ్ల ప్రెండ్స్ అందరికీ థ్యాంక్సు చెబుతుంది.
సింధూజాక్షి, త్రిష వెళ్తున్న కారుకు ఉదయం కారు కిందపడిన ముసలావిడ ఊరు వాళ్లని తీసుకుని అడ్డుపడుతుంది. ఉదయం పొగరుగా డబ్బులు విసిరేసి వెళ్లింది వీళ్లేనని చెబుతుంది. దీంతో గ్రామస్తులు గొడవ చేస్తారు.ముసలావిడకు సారీ చెప్పాల్సిందేనంటూ పట్టుబడతారు. దీంతో చేసేది ఏమీలేక త్రిష ఆ ముసలావిడ కాళ్లుపట్టుకుని సారీ చెబుతుంది.ఇంతలో మ్యాడీ ఫోన్ చేసి వెళ్లిపోయారా ఇక్కడ గొడవ జరుగుతోందని అడగ్గా...లేదని ఈ ముసలివాళ్లంతా కలిసి మమ్మల్నిఆపారని చెబుతుంది.
పెళ్లికూతురు కనిపించకపోయేసరికి గోపీ వాళ్ల అమ్మకు అనుమానం వచ్చి ఈపెళ్లి అసలు మీ అమ్మాయికి ఇష్టమేనా అని నిలదీస్తుంది. ఇష్టం లేకుండా ఇంతదూరం ఎలా వస్తామని వాళ్లు సమాధానమిస్తారు. కానీ మీ అమ్మాయి ఇంట్లో లేదు కదా అని అడగ్గా....నిజంగా ఈ పెళ్లి సింధూకు ఇష్టం లేకపోతే మాకు చెప్పేదే కానీ...ఇలాంటి పనిచేయదని అంటారు. ఈ మాటలకు సూర్యనారాయణకు ముఖం కొట్టేసినట్లు అవుతుంది. అప్పుడే లక్ష్మీ తండ్రి కోటేశ్వరరావు ఊరంతా వెళ్లివెతుకుదామని....ఆఅమ్మయి ఊరు దాటి వెళ్లలేదని అనగా..గోపీ వాళ్లందరినీ ఆపుతాడు. అలా చేస్తే సూర్యనారాయణగారి పెంపకాన్ని అవమానించినట్లేనని అంటాడు. ఖచ్చితంగా పెళ్లి ముహూర్తానికి పెళ్లి కూతురు వస్తుందన్న నమ్మకం నాకు ఉందని అంటాడు. ఇంతలో ప్రియంవద కలుగజేసుకుని పెళ్లికూతురు ఇక్కడ లేదని...ఈపెళ్లి కూడ జరగదని చెబుతుంది. అప్పుడే అక్కడికి సింధూను తీసుకుని వచ్చిన లక్ష్మీ ఈపెళ్లి జరుగుతుందని చెప్పడంతో మ్యాడీ, ప్రియంవద షాక్‌కు గురవుతారు. స్పృహతప్పి ఉన్న సింధూకు ఏమైందని సూర్యనారాయణ కంగారుపడగా....ఉపవాసం ఉండటంతో నీరసంతో పడిపోయిందని లక్ష్మీ చెబుతుంది. ముఖంపై నీళ్లు చల్లి సింధూను లేపగా...కారులో ఉండాల్సిన తాను పెళ్లి మండపంలో ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్లి పడిపోయానని అబద్దం చెప్పి వెళ్లి పెళ్లిపీటలపై కూర్చుంటుంది.
సింధూ తిరిగి రావడంతో మ్యాడీ త్రిషకు ఫోన్ చేయగా...మీ అక్క మా దగ్గరే ఉందని...ఊరుదాటేశామని చెబుతాడు. అక్క తిరిగి వచ్చిందని చెప్పడంతో ముసుగులో ఉన్నది ఎవరని చూసి త్రిష షాక్‌కు గురవుతుంది. ఆ లక్ష్మీ మాయచేసి పెళ్లికూతురుని తీసుకుని వెళ్లిందని చెబుతుంది. దీంతో లక్ష్మీపై మ్యాడీకి చాలా కోపం వస్తుంది.




















