అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today December 30th: సింధూజాక్షిపై సూర్యనారాయణ కోపానికి కారణమేంటి..? మ్యాడీ చెప్పిన మాటలు శ్రీలక్ష్మీ వినేసిందా..?

Lakshimi Raave Maa Intiki December 30th: శ్రీలక్ష్మీ చదువు,సంస్కారం చూసి సూర్యనారాయణ ఎంతో మెచ్చుకుంటాడు. ఆమెకు పెన్ను బహుమతిగా ఇస్తాడు. అక్కను ఊరి నుంచి పంపించేయడానికి మ్యాడీ ప్లాన్‌ వేస్తాడు.

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: లక్ష్మీని చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకుని ఆమె నచ్చడంతో కట్నం కూడా వద్దని అంటాడు. ఇంతలో ఆమె తండ్రి కోటేశ్వరావు కలుగజేసుకుని...మా అమ్మాయి బాగా చదువుకుంటుందని...గోల్డ్‌మెడల్‌ కూడా వచ్చిందని చెబుతాడు. కాబట్టి చదవించే అబ్చాయికే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెబుతాడు. ఈ మాటలకు నూకాలు అడ్డుచెబుతుంది. మంచి సంబంధం వస్తే లేనిపోనివి చెప్పి చెడగొట్టేలా ఉన్నావ్ అని అంటుంది. దీనికి కోటేశ్వరరావు అడ్డుచెబుతాడు. వాళ్లు చదివిస్తానంటేనే ఈపెళ్లికి ఒప్పుకుంటానని అంటాడు. దీనికి మగపెళ్లివారు ఒప్పుకోరు...కానీ పెళ్లి కొడుకు మాత్రం తనకు ఓకే అని అంటాడు. దీనికి శ్రీలక్ష్మీ ఎంతో సంతోషపడుతుంది. మంచిరోజులు చూసి ముహూర్తులు పెట్టుకుందామని అంటాడు. మా అమ్మానాన్నల ఇష్టమే తన ఇష్టమని లక్ష్మీ చెబుతుంది.

శ్రీలక్ష్మీని ఒకసారి చూడాలని ఉంది పిలిపించమని సూర్యనారాయణ చెప్పడంతో...గోపీ లక్ష్మీకి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు. దీంతో తండ్రీ, కుమార్తెలిద్దరూ  అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఇంతలో ఈ పెళ్లి చెడగొట్టి ఈ ఊరి నుంచి సింధూను పంపించేయడానికి మ్యాడీ, ప్రియం వద కుట్రలు పన్నుతుంటారు. ఇంతలో లక్ష్మీ అక్కడికి వచ్చి సూర్యనారాయణ ఆశీస్సులు తీసుకుంటుంది. ఆమెను పొగుడుతూ నువ్వు బాగా చదువుకుంటున్నావని గోపి చెప్పాడని...ఆమెను సూర్యనారాయణ అభినందిస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ కోటేశ్వరరావును,శ్రీలక్ష్మీని సూర్యనారాయణ పరిచయం చేస్తాడు. ఈయన వల్లే మనకి ఇంత గొప్ప సంబంధం దొరికిందని చెబుతాడు. శ్రీలక్ష్మీ ని బాగా చదివించాలని చెబుతాడు.అప్పుడే ఎందుకు పెళ్లి చేస్తున్నావని అడగ్గా...పెళ్లి తర్వాత కూడా చదివిస్తానన్న అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేస్తున్నాని కోటేశ్వరావు చెబుతాడు. శ్రీలక్ష్మీని మెచ్చుకుంటూ తనకు ఎంతో ఇష్టమైన, తన గౌరవాన్ని కాపాడే పెన్నును తీసి ఆమెకు ఇస్తాడు. ఇది పెన్నుకాదని...అది నా గౌరవం అంటాడు. దాన్ని తీసుకుని కళ్లకు అద్దుకుని లక్ష్మీ తీసుకుంటుంది. లక్ష్మీ కాసేపు ఇక్కడే ఉంటుందని...తర్వాత పంపిస్తానని చెప్పడంతో కోటేశ్వరరావు వెళ్లిపోతాడు.

ఇంతలో ఊరిలో ఉన్నవాళ్లంతా సూర్యనారాయణను కలవడానికి ఆయన ఇంటికి వస్తారు. వాళ్లకు సింధూజాక్షిని పరిచయం చేయగా....వాళ్లంతా ఆమెను చుట్టుముట్టి ముద్దులుపెడుతుంటారు. దీంతో ఆమె చిరాకుపడి ముసలావిడను కిందకు నెట్టిపడేస్తుంది. దీంతో సూర్యనారాయణకు తీవ్రమైన కోపం వచ్చి ఏం జరిగిందని నిలదీస్తాడు. లక్ష్మీ ఏదో చెప్పబోతుంటే...అడ్డుపడి ఏం జరిగిందో చెప్పమని సింధూను గట్టిగా నిలదీస్తాడు. గొడవను సద్దుమణిగించాలని నువ్వు చూస్తున్నావని అది నీ సంస్కారమని...కాకపోతే ఏం జరిగిందో తెలుసుకోవడం నా బాధ్యత కాబట్టి నిజం చెప్పమని లక్ష్మీని అడుగుతాడు. దీంతో సింధూ,మ్యాడీ నిజం చెప్పొద్దని సైగ చేస్తున్నా....లక్ష్మీ తప్పక నిజం చెబుతుంది. వదినకు జామపండు తినిపించాలని ఆ పెద్దావిడ ప్రయత్నిస్తుంటే...సింధూకు ఇబ్బంది అనిపించి తోసేస్తే కిందపడిందని చెప్పేస్తుంది. దీంతో సూర్యనారాయణ  తీవ్రమైన కోపంతో రగిలిపోతాడు. సింధూపై గట్టిగా అరుస్తాడు. పెద్దవాళ్లపై గౌరవం లేకుండా ఇలా ప్రవర్తించడం పద్దతి కాదని...పెద్దావిడ కాళ్లుపట్టుకుని క్షమాపణ కోరాలని అంటాడు. ఎవరు చెప్పినా పెద్దాయన వినడు. దీంతో క్షమించాలని సింధూ ఆవిడను కోరుతుంది. కాళ్లుపట్టుకుని చెప్పమని మరోసారి గద్దిస్తాడు. చేసేది లేక సింధూ పెద్దావిడ కాళ్లుపట్టుకుని క్షమించమని కోరుతుంది. దీనంతటికి  లక్ష్మీయే కారణమని మ్యాడీ, సింధూ కక్షపెంచుకుంటారు.

ముసలివాళ్లంతా ఇంటికి వెళ్లిపోతామని చెప్పగా....మీరందరూ ఇక్కడే భోజనం చేయాలని సూర్యనారాయణ చెబుతాడు. ఒంటరి వాళ్లంతా కలిసి రాత్రి భోజనాలు వండుకుని ఒకేచోట రోజూ తింటారని గోపి చెబుతాడు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారని చెప్పగా...ఇదంతా లక్ష్మీ ఆలోచనేనని వాళ్లు చెబుతారు.దీంతో మరోసారి లక్ష్మీని సూర్యనారాయణ మెచ్చుకుంటారు.అయితే ఇవాళ మేం కూడా మీతోనే భోజనం చేస్తామని చెప్పడంతో లక్ష్మీ సరేనంటుంది.  దీంతో అందరూ కలిసి భోజనాలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఊరిలో వాళ్లతో కలిసి సూర్యనారాయణ కుటుంబం కూడా భోజనాలకు సిద్ధమవుతారు.అటు ఇదే రాజు రాత్రికి సింధూను ఊరి నుంచి పంపించేందుకు మ్యాడీ ఏర్పాట్లు చేస్తుంటాడు. ఆ విషయం ఆమెకు చెబుతుండగా...లక్ష్మీ గదిలోకి వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget