Lakshimi Raave Maa Intiki Serial Today December 25th:తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి శ్రీలక్ష్మీ ఏం చేస్తుంది..? ఆస్ట్రేలియా పారిపోవాలనుకున్న సింధూకు ఎదురైన అడ్డంకులేంటి..?
Lakshimi Raave Maa Intiki Serial : కన్నతల్లిదండ్రులు ఎవరో పెంచిన వాళ్లనే అడగాలనుకుని నాన్న మాటలు విని శ్రీలక్ష్మీ ఆగిపోతుంది. ఆస్ట్రేలియా పారిపోదామనుకున్న సింధూ పాస్‌పోర్టును తాతయ్య తీసుకుంటాడు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీ ఇన్నాళ్లు తన తల్లిదండ్రులు అనుకుంటున్న వాళ్లు సొంత అమ్మానాన్న కాదని తెలిసి ఎంతో బాధపడుతుంది.ఈ నిజం నాకు తెలియకున్నా బాగుండేదని ఏడుస్తుంది. తనను ఇంత ప్రేమగా పెంచిన వారికోసం చదువు మానేస్తానని అంటుంది. మా అమ్మ ఎవరిని చూసి పెళ్లిచేసుకోమంటే వారినే పెళ్లిచేసుకుంటానని అంటుంది.
అక్కని ఆస్ట్రేలియా పంపించేందుకు మ్యాడీ ఏర్పాట్లు చేస్తుండగా...సూర్యనారాయణ సింధూ గదికివస్తాడు. నీ పెళ్లికోసం చీరలు,నగలు తెప్పిస్తే...నువ్వు కనీసం వచ్చి చూడటం లేదని అడుగుతాడు. కిందకు వచ్చి నీకు కావాల్సినవి తీసుకోమని చెబుతాడు. నువ్వేమీ బాధపడకని...నేనే నిన్ను ఆస్ట్రేలియా పంపిస్తానని అంటాడు. సింధూ,గోపికి పెళ్లి అయిన తర్వాత కొన్నిరోజులు వారు ఆనందంగా గడపడానికి వాళ్లిద్దరినీ నేనే ఆస్ట్రేలియాకు పంపుతానని...అందుకే పాస్‌పోర్ట్ ఇవ్వమని అంటాడు. దీంతో చేసేదిలేక పాస్‌పోర్ట్ తాతయ్య చేతిలో పెడుతుంది. దీంతో సింధూ ఏడుస్తుంది.
తల్లిదండ్రులకు భారం కాకూడదని చదువుమానేద్దామని నిర్ణయించుకున్న శ్రీలక్ష్మీ తన పాత పుస్తకాలన్నీ తెచ్చి అమ్మేస్తుంది. వాళ్ల చెల్లి అడిగితే నేను ఇక పై చదువులు చదువుకోవడం లేదని చెబుతుంది. అమ్మ చెప్పినట్లే వినాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నూకాలు...లక్ష్మీ చదవు మానేయాలని నిర్ణయించుకుందని తెలిసి ఎంతో సంతోషిస్తుంది. వాళ్ల నాన్న ఎందుకు ఇలా చేశావని అడగ్గా...నా చదువుకోసం నువ్వు ఎంతకి తిప్పలు పడతావు అందుకే నేను పై చదువులు చదవాలని అనుకోవడం లేదని చెబుతుంది. దీంతో మేం పోట్లాడుకుంది వినేసిందా ఏంటి అని తండ్రికి అనుమానం వస్తుంది. ఇంతలో నూకాలు కల్పించుకుని లక్ష్మీకి మంచి సంబంధం చూసి పెళ్లిచేద్దామని అనడంతో...లక్ష్మీ కూడా అమ్మ చెప్పినట్లే వింటానని అంటుంది. అయితే నిన్ను చదివించుకుంటానని మాట ఇచ్చిన వాడికే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని తండ్రి అంటాడు.
పాస్‌పోర్ట్ తాతయ్య తీసుకెళ్లిపోవడంతో అక్కాతమ్ముడు ఎలా తప్పించుకుని వెళ్లాలా అని మదనపడిపోతుంటారు. ఇంతలోఅక్కడికి వాళ్ల ప్రియంవద అత్త వస్తుంది.సింధూ జీవితం కూడా నా జీవితంలా కాకూడదంటే ఈ పెళ్లి జరగకూడదని అంటుంది. నా ఓటు మీకే అంటుంది. ఆ పాస్‌పోర్టు నాన్న దగ్గర ఉందని...నువ్వు కొట్టేసి తీసుకురా అని మ్యాడీకి చెబుతారు. వాడిని తాతయ్య రూంలోకి ఇద్దరూ కలిసి తోస్తారు.
వీళ్లిద్దరూ మా అమ్మానాన్న కానప్పుడు...నా అసలు తల్లిదండ్రులు ఎవరో వీరినే అడగాలని లక్ష్మీ అనుకుంటుంది.వారిని అడగాలని వెళ్లేలోపు...తండ్రి నూకాలుపై అ రుస్తుంటాడు. ఇంకోసారి లక్ష్మీ మన కూతురు కాదని అంటే నా గుండె ఆగిపోతుందని అంటాడు. ఈ విషయం లక్ష్మీ వింటుందని తెలుసుకున్న నూకాలు కొత్త నాటకం ఆడుతుంది. ఉన్న డబ్బంతా అయిపోతే మిగితా పిల్లలకు డబ్బు ఎలా అని అలా మాట్లాడానే తప్ప...లక్ష్మీ నాకు కూడా కూతురేనంటుంది. లక్ష్మీకి ఈ విషయం చెప్పకూడదని తండ్రి నూకాలు దగ్గర మాట తీసుకుంటాడు. లక్ష్మీ నా కూతురు కాదన్న సంగతి ఆమెకు తెలిసిందన్న సంగతి నాకు తెలిస్తే అదే ఆఖరి రోజు అవుతుందని అనడంతో లక్ష్మీ భయపడుతుంది. ఇక వాళ్లను ఈవిషయం గురించి అడగకూడదని నిర్ణయించుకుంటుంది.
తాతయ్య రూమ్‌లోకి దొంగలా దూరిన మ్యాడీ పాస్‌పోర్ట్ కోసం వెతుకుతాడు. చివరికి పాస్‌పోర్టు తీసుకుని బయటపడతాడు. సంతోషంతో గంతులు వేసిన సింధూ...ఆస్ట్రేలియా పారిపోయేందుకు లగేజీ సర్దుకుంటుంది.





















