Krishna Mukunda Murari Serial March 19th: మురారి, కృష్ణలకు యాక్సిడెంట్, ముకుందే కారణమా.. ఆదర్శ్‌ని చంపేస్తానన్న మధు!
Krishna Mukunda Murari Serial Today Episode మురారి, కృష్ణలు హాస్పిటల్ ఓపెనింగ్‌కు బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్ మాటల్ని తలచుకొని కృష్ణ ఏడుస్తుంటుంది. ఇక నందూ అక్కడికి వస్తుంది. తన అన్న అలా మాట్లాడుతాడు అని కలలో కూడా అనుకోలేదు అని ఓ సైకోలా ప్రవర్తించాడు అని అంటుంది నందు. ఇక కృష్ణ కూడా వాళ్ల జీవితం బాగు పడాలని నేను చాలా ప్రయత్నించాను కానీ చివరకు అవి నా స్వార్థం కోసం చేశాను అంటున్నాడు అని కృష్ణ బాధపడుతుంది.
కృష్ణ: నువ్వు చెప్పు నందు అని నా స్వార్థం కోసం చేశానా.
నందు: లేదు కృష్ణ. ఆదర్శ్ అన్నయ్య తప్ప ఎవరూ నిన్ను తప్పుగా అనుకోవడం లేదు. అన్నయ్య కూడా ఏదో బాధలో అలా అంటున్నాడు కానీ నీ మీద ద్వేషం లేదు. నాలుగు రోజులు తర్వాత తనే అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు చూడు.
కృష్ణ: అసలు నా బాధ ఆదర్శ్ ఏదో అన్నాడు అని కాదు. పెద్దత్తయ్య నాకు ఒక బాధ్యత అప్పగించారు. అది నిర్వర్తించలేకపోతున్నాను అదే నా బాధ. ఆదర్శ్ ముకుందల జీవితం చక్కదిద్దాలి అనుకున్నాను కానీ ముకుంద ప్రాణాలతోనే లేదు. దానికి కారణం నేను అని ఆదర్శ్ అంటున్నాడు. ఎందుకు ఇలా చేశావ్ అంటే ఏం సమాధానం చెప్పాలి. ఎలా నా ముఖం చూపించాలి.
నందు: అమ్మకి నీ గురించి బాగా తెలుసు. ఆ ముకుంద గురించి కూడా తెలుసు. నీ గురించి తప్పుగా అనుకోదు.
కృష్ణ: ఆదర్శ్ ఇలా మాట్లాడుతాడు అని ఊహించామా. టైం బాలేనప్పుడు మనం చేసిన మంచి పని కూడా ఎదుటి వారికి చెడుగా కనిపిస్తుంది. రేపు పెద్దత్తయ్య కూడా నా గురించి చెడుగా అనుకోరు అని గ్యారెంటీ ఏంటి.
నందు: నేను గ్యారెంటీ.. ఇంట్లో అందరూ గ్యారెంటీ.. అమ్మ వచ్చేలోపు అన్నయ్య మారిపోతాడు. అంత వరకు నువ్వు సహనంగా ఉండు..
ఇక నందు కిందకి వస్తే.. మధు రగ్గు కప్పుకొని వచ్చి నందు తనకు తగలడంతో ముకుంద ఇచ్చిన షాక్‌కు గుర్తు చేసుకొని భయపడతాడు. సుమలత, రేవతి అక్కడికి వస్తే నందు జరిగింది చెప్తుంది. దీంతో మధు మీకు కూడా ఆ ముకుంద కనిపిస్తే అప్పుడు తెలుస్తుందని అంటాడు.
మురారి: మనసులో.. వీడికి కూడా నాకు కనిపించినట్లు ముకుంద కనిపించినట్లుంది. భయపడిపోతున్నాడు.
మధు: మురారి ఇంట్లో ఇంత మంది ఉండగా ముకుంద నాకే ఎందుకు కనిపిస్తుంది. అయినా మురారికి నువ్వుంటే ఇష్టం నిన్ను ఏం చేయదు. కానీ నన్ను వదలట్లేదు.
మురారి: అది నిజమే కావొచ్చు నీ భ్రమే కావొచ్చు. చివరకు నీ నీడ అయినా సరే మనం భయపడితే భయపెడుతుంది. అందుకే ధైర్యంగా ఉండు. దీంతో మధు మందు బాటిల్ తీసుకోవడానికి బయటకు వెళ్తాడు. ఇక మురారి అయితే ఇప్పుడు వీడికి మళ్లీ ముకుంద కనిపిస్తే ఏమైపోతాడో అనుకుంటాడు. బయటకు వెళ్లిన మధు చిన్న చిన్న శబ్ధాలకే హడలిపోతాడు. ఆ సీన్స్ చాలా కామెడీగా ఉంటాయి.
మురారి: మన గురించే ఆలోచిస్తున్నా కృష్ణ ఇక నుంచి వేరే ఆలోచినలు ఏం వద్దు. ఆలోచించినంత మాత్రానా జరిగింది కల కాదు కదా. సో ఆ ఆలోచనల్ని మానేయ్..
కృష్ణ: ఏసీపీ సార్ ఏమైంది మీకు మీరు ఏదో ఆలోచిస్తూ నన్ను అంటారు ఏంటి.
మురారి: నేను ఆలోచిస్తుంది మన గురించి మన బతుకు గురించి కృష్ణ. ఇకపై మనం దేని గురించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
కృష్ణ: ఇప్పుడు మాత్రం ఎవరికి బయపడుతున్నాం ఏసీపీ సార్.
మురారి: ముకుంద ఆత్మ కనిపించింది అంటే టెన్షన్ పడుతుంది. ఏయ్ భయం అంటే ఎవర్నో చూసి కాదు. ఇంకేదో జరుగుతుంది అని. రేపు మనం హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్తున్నాం. ఇక మురారి రేపు కట్టుకోవడానికి కృష్ణ కోసం సారీ సెలక్ట్ చేస్తాడు.
ఆదర్శ్ ముకుంద గురించి ఆలోచిస్తూ విపరీతంగా తాగుతుంటాడు. సుమలత వెళ్లి మంచి చెప్పాలి అని చూసినా వినడు. ఎవరు ఎన్ని చెప్పినా ఆదర్శ్ వినడు.
సుమలత: ఆదర్శ్ ఏంట్రా ఇది. ఎవరు ఏం చెప్పినా వినవు. కనీసం నన్ను చూసి అయినా ఆ మందు బాటిల్ పక్కన పెడతావు అనుకున్నా. కొంచెం కూడా భయం లేదు నీకు. కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు అంటే నీ మనసు ఎంత చెడిపోయిందో అర్థం అవుతుంది.
ఆదర్శ్: మనసు అని ఉంటేనే కదా పిన్ని అందరూ కలిసి దాన్ని ఎప్పుడో నాశనం చేసేశారు.
సుమలత: ఎందుకురా అందరి మీద అలా ద్వేషం పెంచుకుంటున్నావ్. మీ అమ్మకి నువ్వుంటే ప్రాణంరా. రేపు వచ్చి అక్క నిన్ను ఇలా చూస్తే ఏమైపోతుందా అని భయంగా ఉందిరా.
ఆదర్శ్: అమ్మ ఏమీ అయిపోదు పిన్ని నన్ను ఇలా చూసి నాకు జరిగిన అన్యాయం తెలుసుకొని అన్యాయం చేసిన వాళ్ల అంతు చూస్తుంది. అయినా ఇంత జరిగినా మీరు ఆ కృష్ణని ఎలా వెనకేసుకొస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. పిన్ని చెప్తున్నా తనని ఇంకా ఈ ఇంట్లో ఉండనిచ్చావే అనుకో బాబాయ్‌ని నిన్ను కూడా విడదీయడానికి వెనకాడదు. ఆవిడ మనసే అంత ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేదు.
సుమలత: ఆపరా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావ్. ఈ ఇంట్లో ఏం స్వార్థం లేకుండా అందరి గురించి ఆలోచించేది ఒక్క కృష్ణ మాత్రమే. మనసులో ఇంత విషాన్ని పెట్టుకొని అందరి మీద కక్ష పెంచుకుంటున్న నీకు కృష్ణ మంచితనం గురించి చెప్పినా అర్థం కాదు.
ఇక ఉదయం మురారి కృష్ణ కోసం కాఫీ తీసుకొని వస్తాడు. కృష్ణ స్నానం చేసి వచ్చి కాఫీ తీసుకుంటుంది. ఇద్దరి మధ్య కాస్త సరదా సంభాషణ జరుగుతుంది. ఇక మురారి కృష్ణ తల తుడుస్తాడు.
మురారి: మనసులో.. నువ్వు ఎక్కడున్నా చూడు ముకుంద. రోజు రోజుకు కృష్ణ మీద నా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నాకు కనిపించడం భ్రమ కాదు నిజం అయితే బాగున్ను బతికున్నంత కాలం మనస్శాంతి లేకుండా బతికావు. ఇప్పుడు మమల్ని ఇలా చూస్తే చనిపోయిన తర్వాత కూడా మనస్శాంతి లేకుండా ఉంటావ్.. వెళ్లిపో..
ఆదర్శ్: రేవతి ఆదర్శ్‌ని చూసి కాఫీ ఇవ్వకుండా అలానే నిల్చొని ఉండటం చూసి.. ఏంటి పిన్నిఅలాగే ఉండిపోయావ్ నన్ను చూస్తే భయంగా ఉందా. ఎందుకు ఇలా అడిగాను అంటే రోజు పొద్దున్నే ఎవరో ఒకరు నా గదికే కాఫీ తెచ్చేవాళ్లు ఈరోజు కూడా రావాలి కదా. ఈరోజు రాలేదు అంటే నా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు అని అర్థమైంది. అంతేలే పిన్ని పైకి కనిపిస్తున్న నన్ను చూసి భయపడతారు కానీ లోపల బాధ అర్థం చేసుకోరు. అయినా ఇక్కడికి అందరూ వచ్చారు. ఆ ఆదర్శ్ దంపతులు ఎక్కడ.
నందు: అన్నయ్య పొద్దుపొద్దున్నే మొదలెట్టావా..
ఆదర్శ్: ఇప్పుడు నేనేం అన్నాను నందు అందరూ ఉన్నారు వాళ్లెక్కడ అని అడిగాను. చూడు మనకు మేలు చేసేవారే కాదు అన్యాయం చేసే వాళ్లని కూడా మర్చిపోలేం కదా. అలా తలచుకున్నానో లేదో వచ్చేశారు. కచ్చితంగా వీళ్లు వందేళ్లు బతికేస్తారు.
కృష్ణ: అత్తయ్య బయటకు వెళ్లి వస్తాం.
ఆదర్శ్: ఎక్కడికో.. ఎవరి కాపురాలు కూల్చడానికి బయల్దేరుతున్నారా అని అడుగుతున్నాను.
మధు: బ్రో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.
ఆదర్శ్: ఏం పిన్ని నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా..
మధు: ఎవరు నీతో ఏం మాట్లాడరు ఎందుకు అంటే నీతో మాట్లాడటమే అనవసరం అనే నిర్ణయానికి వచ్చాం. అనవసరంగా వీళ్లని ఏమైనా అన్నావే అనుకో..
ఆదర్శ్: ఏం చేస్తావ్ చంపేస్తావా..
మధు: ఏమో క్లారిటీ లేదు ఎంతకైనా తెగిస్తా. వీళ్లిద్దరినీ ఒక్క మాట అన్న సరే ఊరుకోను చెప్తున్నా..
కృష్ణ: మధు ఇంకేం మాట్లాడకు పద వెళ్దాం.
ఆదర్శ్: నవ్వుతూ.. అబ్బబ్బా రెచ్చగొట్టేది నువ్వే మళ్లీ కంట్రోల్ చేసేది నువ్వేనా.. నువ్వు నీ నాటకాలు..
మురారి: ఆదర్శ్..
ఆదర్శ్: చెప్ప మురారి..
నందు: అన్నయ్య మతిగాని పోయిందా ఏం మాట్లాడుతున్నావ్. ఇది నువ్వు కాదు.. ఏమైంది..
సుమలత: ఇంకేం అవుతుంది పిచ్చి పట్టింది.
ఆదర్శ్: వీళ్ల నిజస్వరూపం ఏంటో మీ తెలిసిన రోజున మీ అందరికీ పిచ్చి పడుతుంది. రేయ్ మధు నన్ను చంపాలి అనుకుంటే పైన ఉంటా రారా..
ఇక బయటకు వచ్చిన మురారి ముకుంద ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉండాలి అనుకుంటాడు. కృష్ణను బయటకు తీసుకెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిందని ఇప్పుడు ఇద్దర్ని ఇలా చూస్తే ఊరుకోదు ఎక్కడుందా అని ఆలోచిస్తాడు. ఇక కృష్ణ మురారి ఇద్దరూ బైక్ మీద బయల్దేరుతారు. మరోవైపు ఆదర్శ్ ప్రవర్తన గురించి ఇంట్లో వాళ్లు మీటింగ్ పెడతారు. దీంతో మధు ఈసారి ఆదర్శ్ ఎవరినైనా ఏమైనా అంటే చెంప పగలగొడతాను అని అంటాడు. దీంతో రేవతి మధుని తిడుతుంది. భవానికి కాల్ చేసి రప్పిద్దామని మధు, నందులు అంటారు. అయితే రేవతి వద్దు అనేస్తుంది.
ఇక మురారి, ముకుందలు వెళ్తున్న బైక్ టైర్‌లో కృష్ణ చీర అంటుకొని ఇద్దరూ కింద పడిపోతారు. మురారి లేచి కృష్ణకు ఏమైందా అని చూస్తాడు. ఇంతలో పక్కన ఓ కార్ టాప్‌లో ముకుంద మురారిని చూసి నవ్వుతూ కనిపిస్తుంది. మురారి షాక్ అవుతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Also Read: రాజమౌళి: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా