అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today March 14th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: తీవ్ర విషాదం.. గుండెలు బాధుకొని ఏడ్చిన ఆదర్శ్‌, పాపం ముకుందను కడసారి కూడా చూడనివ్వలేదుగా!

Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద శవాన్ని శ్రీనివాస్ ఆదర్శ్ కుటుంబానికి చూపించకపోవడంతో అందరూ గట్టిగా ఏడుస్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌ ముకుంద, మురారి కలిసి ఉన్న ఫొటోలను కాల్చేస్తాడు. ఇక రేవతి, మధు అక్కడికి వచ్చి కంగారు పడి మంటలు ఆర్పుతామంటే ఆదర్శ్‌ వద్దు అంటాడు. కాలుతున్న ఫొటోల్లో మురారి నవ్వుతున్నట్లు ఊహించుకున్న ఆదర్శ్‌ నన్ను చూసి నవ్వుతున్నారు పిన్ని అని రేవతికి చెప్పి ఏడుస్తాడు. 

రేవతి: రేయ్ ఆదర్శ్‌ ఏమైందిరా నిన్ను చూస్తే భయం వేస్తుందిరా.. ఏమైపోతావో అని భయంగా ఉందిరా..
ఆదర్శ్‌: ఇంతకన్నా ఇంకేం అయిపోతాను పిన్ని. అయిపోయింది నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎన్నో ఊహించుకున్నాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకున్నారు. 
మురారి: పిన్ని ముకుంద వచ్చిందా..
సుమలత: తనని తీసుకురావడానికి మీరు వెళ్లారు కదరా. నన్ను అడుగుతారేంటి.
మురారి: అంటే ఈ లోపు వచ్చేసిందేమో అని. 
రేవతి: అయితే ముకుంద ఎక్కడుందో ఇంకా తెలియలేదా.. ఇక్కడ వీడి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ముకుంద ఎక్కడుందో తెలీదు. ఈ ఇంటికి ఏమో అయిందిరా. ఏదో ఉపద్రవం రాబోతుంది.
మురారి: ఏం కాదు అమ్మ ముకుంద వచ్చేస్తుంది. ఆదర్శ్‌ కూడా ఏదో బాధలో ఉండి తాగుతున్నాడు అంతే..
రేవతి: తాగడం కాదురా తగలబెడుతున్నాడు. నువ్వు ముకుంద కలిసి ఉన్న ఫొటోలు చూసి తగలబెట్టేశాడు. సమయానికి నేను మధు వెళ్లాం కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. 
మురారి: ఛ ఎందుకు ఇలా చేస్తున్నాడు. జరిగిన దానికి మనకు బాధ లేదా.. ఏదో అంతా మనమే చేసినట్లు ఫీలవుతున్నాడు. ఇంతలో మధు పరుగున వచ్చి టీవీ వేస్తాడు. దీంతో మురారి.. రేయ్ ఆదర్శ్‌ని ఒంటరిగా వదిలేశావా ఎక్కడున్నాడు.
మధు: ఆదర్శ్‌కి ఏం కాదు ముందు ముకుంద గురించి ఆలోచిద్దాం. 
కృష్ణ: ముకుంద గురించి ఏమైనా తెలిసిందా..
మధు: ఏమో తెలిసింది నిజం కాకపోతే బాగున్ను.
రేవతి: ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు.

ఇంతలో మధు టీవీలో న్యూస్ వేస్తాడు. అందులో యాంకర్ 30 ఏళ్ల వయసున్న యువతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని చనిపోయింది అని చెప్తుంది. యువతి ఎవరో ఇంకా తెలీదు అని చెప్తారు. ముఖం చిద్రమైపోయింది అని ముఖం చూపించకుండా చీర చూపిస్తారు. అది ముకుందే. ఆత్మహత్య చేసుకోవడానికి యువతి ట్రైన్‌కు ఎదురుగా వెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని యాంకర్ చెప్తుంది. ఇక టీవీలో బాడీ విజువల్స్‌ని అందరూ చూసి షాక్ అవుతారు. ఇక రేవతి అది ముకుందే అని ఏడుస్తుంది. జరిగిన అవమానం భరించలేక  ముకుంద ఆత్మహత్య చేసుకుంది అని రేవతి తలకొట్టుకొని ఏడుస్తుంది. మురారి కాదు అని ఎంత చెప్పినా వినదు. 

రేవతి: అది ముకుంద ఏమో అని భయంగా ఉందిరా..
మురారి: అమ్మ ఏడవకు అమ్మ ఆదర్శ్‌ వింటాడు.
కృష్ణ: అవును అత్తయ్య ముకుంద ఏమో అని అనుమానంగా ఉన్నా తనో కాదో అని కచ్చితంగా తెలీదు కదా. అంత వరకు ఆదర్శ్‌కి తెలీకుండా ఉంచడం మంచిది. ఇంతలో ఆదర్శ్ అక్కడికి వస్తాడు. మధు మెల్లగా టీవీ ఛానెల్ మర్చేస్తాడు. 
ఆదర్శ్‌: కృష్ణతో.. నిజాలు దాచడం అలవాటు అయిపోయింది కదా నీకు. మనుషుల్ని అబద్ధాల్లో ఉంచడం బాగా అలవాటు అయిపోయింది నీకు.
మురారి: ఆదర్శ్‌..
ఆదర్శ్‌: నువ్వు మాట్లాడకు మురారి. నేను అంటే నా భార్యకు ఇష్టం లేదు అనే నిజం దాచి నన్ను ఓ వెర్రివాడిని చేశారు. ఇప్పుడు నా భార్య చనిపోయింది అనే విషయాన్ని కూడా దాచాలి అని చూస్తున్నారా..
కృష్ణ: ఆదర్శ్ తను ముకుంద కాదేమో. ఎందుకు ఊరికే కంగారు పడిపోవడం.
ఆదర్శ్‌: అయితే.. తను ముకుంద అయితే ఏంటి పరిస్థితి. తన చావుకి కారణం నువ్వే అని ఒప్పుకుంటావా.. 
కృష్ణ: ఏం మాట్లాడుతున్నావ్ ఆదర్శ్..
ఆదర్శ్‌: నిజం నువ్వు చేసిన దారుణం గురించి మాట్లాడుతున్నాను. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే. తను రాత్రే చెప్పింది జరిగిన దాని అంతటికి కారణం నువ్వే అని. ప్రాణాలు పోవడానికి ముందు మరణ వాగ్మూలం చెప్పినట్లు నీ గురించి మొత్తం చెప్పి ఈ రోజు తను పోయింది. ప్రాణాలు పోయి ఎవరూ అబద్ధం చెప్పరు కృష్ణ. నువ్వే కారణం కృష్ణ. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే. 
మధు: ఇది గొడవ పడే పరిస్థితి కాదు. ముందు తను ముకుంద అవునో కాదో హాస్పిటల్‌కి వెళ్లి నిర్ధారణకు రండి. వెళ్లండి.. అంత వరకు గొడవలు వద్దు. 

మరోవైపు ముకుంద తండ్రి శ్రీనివాస్ దేవ్‌కి కాల్ చేసి ముకుంద చనిపోయింది అని మనకు ఇక లేదు త్వరగా హాస్పిటల్‌కి రా అని ఫోన్‌లో ఏడుస్తాడు. చాలా దూరంలో ఉన్నానని రావడానికి రెండు రోజులు పడుతుంది అని తండ్రికి దేవ్ ధైర్యం చెప్తాడు. ఇంతలో రేవతి వాళ్లు అక్కడికి వస్తారు. శ్రీనివాస్‌తో ముకుంద గురించి అడుగుతారు. దీంతో శ్రీనివాస్ చనిపోయిందని చెప్పి ఏడుస్తాడు. నా కూతురు ఇక లేదు అని కుప్పకూలిపోతాడు. 

శ్రీనివాస్: అసలు మీరందరూ ఎందుకు వచ్చారు నా కూతురు చనిపోయిందో లేదో తెలుసుకోవడానికి వచ్చారా. లేదా కొన ఊపిరితో ఉంటే చంపేయాలి అని వచ్చారా. 
రేవతి: అన్నయ్య ఏంటి ఆ మాటలు.. టీవీలో న్యూస్ చూసి ముకుంద కాకూడదు అని మొక్కుంటూ వచ్చాం. అయినా ముఖం గుర్తు పట్టలేనంతగా చిద్రం అయిపోయింది అన్నారు కదా మన ముకుందేనా.. 
శ్రీనివాస్: నా కూతురు నా రక్తం నేను గుర్తుపట్టలేనా తను చనిపోయింది. కాదు మీరే చంపేశారు. మీరంతా కలిసి నా కూతురు ఆత్మహత్య చేసుకునేలా చేశారు. 
కృష్ణ: మీకు దండం పెడతా అలా మాట్లాడకండి బాబాయ్. ముకుంద చనిపోయినందుకు మీరు ఎంత బాధ పడుతున్నారో మేం అంతే బాధపడుతున్నాం.
శ్రీనివాస్: వద్దమ్మా చేయాల్సింది అంతా చేసి ఈ మొసలి కన్నీళ్లు కార్చొద్దు. నా కూతురుకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నాకు ముందే తెలుసు అమ్మా ఎప్పుడో ఊహించాను అందుకే ఆ ఇంట్లో నీకు విలువ లేదమ్మా. నా దగ్గరకు వచ్చేయ్‌మని బతిమాలాను అయినా వినలేదు. కన్న తల్లిదండ్రులును కూడా పట్టించుకోకుండా మీరే సర్వస్వం అనుకొని మీ దగ్గరే ఉండిపోయినందుకు మీరు మంచి బహుమతి ఇచ్చారు. చాలు ఇక చాలు 
కృష్ణ: బాబాయ్ మీరు బాధలో మాట్లాడుతున్నారు. అయినా పర్లేదు మేం ముకుందని ఎంత బాగా చూసుకున్నామో మాకు తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు.
శ్రీనివాస్: అంత బాగా చూసుకుంటే ఈరోజు నా కూతురు ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటుంది. ఆదర్శ్‌తో.. బాబు నువ్వెందుకు వచ్చావ్. పెళ్లి రోజు మూడు ముళ్లు వేసిన వెంటనే వెళ్లిపోయావ్ కదా మళ్లీ ఎందుకు వచ్చావ్. నువ్వు రాకపోయి ఉంటే తను కోరుకున్న జీవితం దక్కలేదు అని బాధగా ఉన్నా కనీసం ప్రాణాలతో అయినా ఉండేది. నువ్వు వచ్చి నీతో బతకలేక ప్రాణాలు వదిలేసింది.
మురారి: ప్లీజ్ అంకుల్ ఆదర్శ్‌ తప్పు ఏం లేదు వాడిని ఏం అనొద్దు. 
శ్రీనివాస్: మరి నీదా తప్పు. కచ్చితంగా నీదే. నువ్వు నా కూతుర్ని అర్థం చేసుకున్నా ఇదిగో నీ జీవితంలోకి ఈ కృష్ణ రాకపోయి ఉన్నా నా కూతురు సంతోషంగా ఉండేది. మీరందరూ కలిసి బలవంతంగా నా కూతుర్ని చంపేశారు. నా కూతురుది ఆత్మ హత్య కాదు హత్య మీరే చంపేశారు. వెళ్లిపోండి ఇక్కడ నుంచి వెళ్లిపోండి. 
కృష్ణ: బాబాయ్ ప్లీజ్ ఒక్కసారి ముకుందని చూడనివ్వండి.
శ్రీనివాస్: ఏమని చూస్తారమ్మ నా కూతురు నేనే గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మా ముకుంద అంటే అందమైన ముఖం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆ ముఖమే గుర్తుపట్టలేని హీనంగా మారిపోయింది.  వెళ్లిపోండి అమ్మా వెళ్లిపోండి. నా కూతురు ప్రాణాలతో లేదు అనే బాధ కంటే మీరు నా కళ్ల ఎదుట ఉంటే నాకు ఇంకా బాధగా ఉంది. 
రేవతి: అలా అనకండి అన్నయ్య ఒక్కసారి మా కోడలిని చూసివెళ్లిపోతాం.
శ్రీనివాస్: ఆడపిల్లకు అత్తింట్లో ఏదైనా కష్టం వస్తే పుట్టింటికి వస్తుంది. అలాంటి ముకుంద నాకు కూడా ముఖం చూపించకుండా తనని తాను కడతేర్చుకుంది అంటే ఎంత మానసిక క్షోభకు గురైందో దానికి కారణం అయిన మీరు తన శరీరం దగ్గరకు కూడా వెళ్లడానికి వీల్లేదు. అలా వెళ్తే తన ఆత్మ కూడా శాంతించదు. బతికి నన్ని రోజులు మనస్శాంతి లేకుండా బతికింది ఇప్పుడు తన ఆత్మకైనా శాంతి దొరకని. వెళ్లిపోండి..

ఆదర్శ్‌ ముకుంద మాటలు తలచుకొని ఏడుస్తాడు. మరోవైపు మురారి కూడా ముకుంద మాటలు తలచుకొని బాధ పడతాడు. ఇక కృష్ణ కూడా ఏడుస్తుంది. ఇక రేవతి, సుమలత, మధు ఇలా అందరూ ఏడుస్తారు. ఇక శ్రీనివాస్ ఇంటికి ఏడుస్తూ వస్తాడు. ఎదురుగా ముకుంద కూర్చొని ఉంటుంది. అయితే అది శ్రీనివాస్ అలా ఊహించుకున్నాడా లేక ముకుందా నిజంగానే బతికి ఉందా అనేది తెలీదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం: హీరోయిన్‌తో నిశ్చితార్థం చేసుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం - ఫోటోలు వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget