Krishna Mukunda Murari Serial Today February 17th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మురారితో తాను తీసుకున్న సెల్ఫీ చూస్తూ ఆదర్శ్‌కి దొరికిపోయిన ముకుంద!
Krishna Mukunda Murari Serial Today Episode: మురారి తలనొప్పి అని కృష్ణ ఒడిలో వాలిపోవడం ముకుంద, ఆదర్శ్ మురారిని ఆటపట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode: మురారి పెద్దమ్మ కోరిక తీర్చుదాం అంటూ కృష్ణని అడిగితే ముహూర్తం పెట్టే వరకు ఆగాలని కృష్ణ అంటుంది. దానికి మురారి మళ్లీ ముహూర్తమా ఈ ముహూర్తం మీద నాకు నమ్మకం లేదు ఇక మన శోభనం అయ్యేలా లేదు అని అంటాడు. ఈ జన్మకు నాకి రాసిపెట్టలేదు ఏమో అంటాడు. ఉదయం ముకుంద వాలంటైన్స్ డే రోజు మురారికి తెలీకుండా తీసిన ఫొటోలు కడిగించి వాటి ఫ్రింట్‌లను చూసుకుంటుంది.
ముకుంద: చెప్పేస్తా మురారి ఆదర్శ్‌లో నిన్ను చూసుకుంటూ మ్యానేజ్ చేయడం నావల్ల కావడం లేదు. ఎప్పటికి అప్పుడు ఎదురవుతున్న పరీక్షలు తట్టుకోలేక ఎక్కడ అందరి ముందు ఓపెన్ అయిపోతానో అది మళ్లీ ఏ గొడవలకు దారి తీస్తుందో అని భయంగా ఉంది. అందుకే బయటకు వెళ్లాక ఆదర్శ్‌కి చెప్పేస్తాను. పెద్ద మనసుతో తను అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నాను.
ఆదర్శ్: ముకుంద అని పిలవగానే.. ఫొటోలను బ్యాగ్‌లో వేసేస్తుంది. ముకుంద అన్నీ సర్దుకున్నావా.. మనం వెళ్లే చోట చలి ఎక్కువ స్వెటర్‌లు కూడా పెట్టు. ఏమైంది ముకుంద ఎందుకు అంత కంగారుగా ఉన్నావ్.. ఎంత కాంగారు పడుతున్నావో తెలుసా ఈ బ్యాగ్‌లో ఏదో పాము ఉన్నట్లు ముట్టుకుంటే కాటేస్తుంద అన్నట్లు కంగారు పడుతున్నావ్.
ముకుంద: మనసులో.. పాము కాటుది ఏంముంది వెంటనే మందు వేస్తే ఏం కాదు. కానీ ఈఫొటో మీ కంట పడితే నా జీవితమే ప్రమాదంలో పడుతుంది. నా నోటితో నిజం చెప్పే వరకు మీకు నచ్చజెప్పే వరకు ఇది మీ కంట పడకూడదు.
ఆదర్శ్: ముకుంద ఏం ఆలోచిస్తున్నావ్ ఇప్పుడు మనం వెళ్తున్న ట్రిప్ నీకు ఓకేనా..
ఇక అందరూ రెడీ అయి కిందకి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని నందూ కృష్ణని అడిగితే ఏమో నాకేం తెలుసు ప్లాన్ చేసింది ముకుంద తననే అడుగండి అంటుంది.
మధు: ఇంత సడెన్‌గా ఎందుకు వెళ్తున్నారో కారణం తెలుసుకోవచ్చా..
ఆదర్శ్: సరదాగా వెళ్తున్నాం అని ముకుంద చెప్పింది కదా దానికి కారణాలు కావాలా నీకు.
మధు: అంటే మరీ రూంలు కూడా బుక్ చేయకుండా వెళ్తున్నారు కదా అందుకే డౌట్ వచ్చింది. అయినా ఏం ప్లాన్ లేకుండా భలే ప్లానింగ్‌తో వెళ్తున్నారు. ఇక రెండు జంటలు బయల్దేరుతారు. ఇక నందూకి డ్రాప్ చేసి రమ్మని మధుకి రేవతి చెప్తుంది. దీంతో మధు ఆ నలుగురిని ఫాలో అవుతాను అని మధు అంటాడు. రేవతి తిడుతుంది. దీంతో మధు నందూని డ్రాప్ చేయడానికి వెళ్తాడు.
ముకుంద: మనసులో.. ఆదర్శ్‌కి ఈ విషయం ఎలా చెప్పాలి. ఎక్కడో ప్రశాంతంగా తన బతుకు తాను బతుకుతున్న మనిషిని నేను మారాను అని తీసుకొచ్చి ఇప్పుడు ఇష్టం లేదు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడు. కచ్చితంగా బాధ పడతాడు. కానీ తప్పదు. తనని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకోలేను. ఎలాగైనా ఈ ట్రిప్‌లో చెప్పేస్తాను. మనసు భారం దించుకొని ప్రశాంతంగా తిరిగి రావాలి. ఇంతలో ఆదర్శ్ ముకుంద భుజాన్ని తాకుతూ ఉంటాడు. దానికి ముకుంద ఈ మనిషి పక్కన కూర్చొవడమే కష్టం ఉందే... మురారి కారు ఆపు..
మురారి: దేనికి..
ముకుంద: ఆపు చెప్తాను.
కృష్ణ: ఏమైంది ముకుంద..
ముకుంద: ఒకసారి దిగండి.. ఏంటి కృష్ణ ఎప్పుడూ మీరే ముందు కూర్చొంటారా మేం కూర్చొవద్దా..
కృష్ణ: మనసులో. నువ్వు సూపర్ ముకుంద.. ఏసీపీ సార్ వాళ్లని కూర్చొనివ్వాలి కదా..
ఆదర్శ్: పర్లేదు వెనక కంఫర్ట్ గానే ఉంది.
కృష్ణ: అయ్యో ఆదర్శ్ భర్త డ్రైవ్ చేస్తూ ఉంటే భార్యకైనా పక్కన కూర్చొవాలి అని ఉంటుంది. అంతే కదా ముకుంద..
ముకుంద: హా అంతే..
మురారి: ఆదర్శ్ డ్రైవ్ చేయ్.. కృష్ణతో వాళ్లు వెనక కూర్చొమనగానే ఎస్ అని ఎందుకు అన్నావో నాకు తెలుసులే.. అదే మనద్దరం ఇలా పక్కపక్కనే కూర్చొని హ్యాపీగా వెళ్లొచ్చుకదా..
కృష్ణ: అంత లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.
మురారి: దొరికిన ఛాన్స్ ఎందుకు వదిలేస్తాను..
ముకుంద: ఇక్కడైతే మురారిని హాయిగా చూసుకోవచ్చు అని అద్దం తన వైపు తిప్పుకుంటుంది. ఇక మురారి కృష్ణ చేయి పట్టుకుంటాడు. ముకుంద అద్దంలో చూస్తుంది. తలనొప్పి అని యాక్ట్ చేసి మురారి కృష్ణ ఒడిలో వాలిపోతాడు. ఆ సీన్ ముకుంద అద్దంలో చూస్తుంది. కృష్ణ మురారికి మర్దనా చేస్తుంది. తగ్గిందా అని కృష్ణ అడిగితే లేదు అని అంటాడు.
ఆదర్శ్: మురారి ఇంకా తగ్గలేదా..
మురారి: లేదు బ్రో..
ఆదర్శ్: అదృష్ట వంతుడివి నేను బ్యాక్ సీటులో ఉంటే నాకు తలనొప్పి వచ్చుండేది. మంచి ఛాన్స్ నేను మిస్ అయిపోయాను.
మురారి: మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అంటే నీ ఉద్దేశం ఏంటి బ్రో. కావాలనే నేను కృష్ణ ఒడిలో తల పెట్టడానికే తలనొప్పి అన్నాను అనుకుంటున్నావా. కావాలంటే నువ్వు రిటర్న్‌లో బ్యాక్ కూర్చొ అప్పుడు నీకు తలనొప్పి వస్తుంది. అలాగే ముకుంద నొక్కుతుంది. కానీ నేను మాత్రం ఛాన్స్ తీసుకోవాలి అని ఇలా చేయలేదు అబ్బా ఎక్కువ మాట్లాడించకు నువ్వు డ్రైవింగ్ చేయ్.
ముకుంద: మెడికిల్ షాప్‌లో ఒక బామ్ తీసుకుంటే బెటర్ ఏమో..
కృష్ణ: ఎందుకులే ఇలా చేస్తే తగ్గిపోతుందిలే..
మురారి: ఒవరాక్షన్ చేసినట్లు ఉన్నాను. ఏ నొప్పి లేకుండా రాసుకుంటే మండిపోతుంది.
కృష్ణ: పడుకోండి బామ్ రాస్తా..
ఆదర్శ్: మురారి అంత కష్టపడి కృష్ణ తెస్తే వద్దు అంటావ్ ఎందుకురా.. నువ్ రాయు కృష్ణ.
ముకుంద: ఎక్కువ రాయ్ కృష్ణ దెబ్బకు నొప్పి తగ్గిపోవాలి. కృష్ణ కావాలనే ఎక్కువ రాసేస్తుంది. దీంతో మంటతో మురారి వద్దు తగ్గిపోయింది అని అంటాడు. రిసార్ట్‌కి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: చిరంజీవి: 'పద్మ విభూషణ్' చిరంజీవికి అమెరికాలో సన్మానం - ఈ వెకేషన్ అందుకేనా?