(Source: ECI/ABP News/ABP Majha)
Chiranjeevi: 'పద్మ విభూషణ్' చిరంజీవికి అమెరికాలో సన్మానం - ఈ వెకేషన్ అందుకేనా?
Chiranjeevi: చిరు తన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ కలుస్తా అంటూ తన యూఎస్ వెకేషన్‌పై చిరు అప్‌డేట్ ఇచ్చారు. ఇది అంతా వాలంటైన్స్ డే వెకేషన్ అనుకున్నారు. కానీ
Felicitating to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని 'పద్మ విభూషణ్'తో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించడంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. గతంలో అంటే 2006లో చిరంజీవికి ఆయనకు అప్పటి భారత ప్రభుత్వం పద్మ భూషణ్ ఇచ్చి సత్కరిస్తే, ఇప్పుడు 18 సంవత్సరాల తరువాత 'పద్మ విభూషణ్' వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర్ తర్వాత 'పద్మ విభూషణ్' అందుకు రెండు తెలుగు నటుడిగా చిరంజీవి నిలిచారు.
అవార్డుల అధికారిక ప్రకటన అనంతరం సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, నిర్మాతలు, సాంకేంతిక నిపుణులు ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డు గెలిచిన వారందరిని సన్మానించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల చిరు తన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ కలుస్తా అంటూ తన యూఎస్ వెకేషన్‌పై చిరు అప్‌డేట్ ఇచ్చారు. ఇది అంతా వాలంటైన్స్ డే వెకేషన్ అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియాలో ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ చేసిన పోస్ట్‌తో అసలు విషయం బయటకు వచ్చింది. అమెరికాలో చిరంజీవిని కలిసిన ఆయన ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చిరుతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పారు. చిరుకు 'పద్మ విభూషణ్' అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు అమెరికాలో సన్మానం జరిపించబోతున్నట్టు తెలిపారు. చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇప్పుడు అమెరికాలో చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా విశ్వప్రసాద్ ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. కాగా ఇప్పటికే చిరంజీవి అవార్డుల రారాజుగా పెరుపొందారు. సినీ రంగానికి చిరంజీవికి చేసిన సేవలకు గానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక ఆయన నటించిన స్వయం కృషి, అపద్భాంధవుడు, ఇంద్ర, సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.
Happy to have met @KChiruTweets Garu in LA and to get his consent for organizing the felicitation event. pic.twitter.com/Xr3C2jDgPs
— Vishwa Prasad (@vishwaprasadtg) February 16, 2024
శుభలేఖ, విజేత, స్నేహం కోసం, ముఠామేసస్త్రీ, శంకర్ దాదాతో పాటు పలు చిత్రాలకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవికి 2006 స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. ఇక 2010లో ఫిలంఫేర్ లైఫ్ టై అచీవ్‌మెంట్ అవార్డు, తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందిచంఇన సేవలకు గానూ 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. తెలుగు ఆంధ్రా యూనివర్సిటీ 2006లో చిరంజీవికి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇలా చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో అవార్డుల రారాజుగా నిలిచారు. ఇక ఆయన తరంలో 'పద్మ విభూషణ్'వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా చిరంజీవి నిలిచారు.