Krishna Mukunda Murari Serial Today April 29th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : సరోగసీకి వెళ్దామని మురారికి చెప్పిన కృష్ణ.. ఇక మురారి తన కొంగు పట్టుకొని తిరగడం ఖాయమన్న ముకుంద!
Krishna Mukunda Murari Serial Today Episode : సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కందామని కృష్ణ మురారికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode హాస్పిటల్‌లో కృష్ణకు నిజం తెలిసి కుమిలిపోతుంది. ముకుంద మురారికి సరోగసి ఐడియా ఇస్తుంది. దాని గురించి మురారి.. కృష్ణకు చెప్పాలి అనుకొని మళ్లీ ఏమనుకుంటుందా అని ఆగిపోతాడు.
కృష్ణ: ఇప్పుడు పిల్లల్ని కనలేనందుకు మీకు బాధగా లేదా..
మురారి: చెప్పాను కదా కృష్ణ నీ సంతోషమే నాకు ముఖ్యం అని. ఎప్పుడైతే నేను నిన్ను సంతోషంగా ఉంచలేనో అప్పుడు బాధ పడతాను. అయినా ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మనకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. బయటకు వెళ్దాం అన్నావు కదా వెళ్దామా..
ముకుంద వైదేహి డాక్టర్ దగ్గరకు వెళ్లి డాక్టర్ నోరు తీపి చేస్తుంది. త్వరలోనే తనకు పాప పుడుతుందని డాక్టర్‌తో చెప్తుంది. కృష్ణ కడుపులో బిడ్డ పుట్టకపోతే తన కడుపులో పుట్టినట్లే అని అంటుంది. తన ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తాను అని అంటుంది.
ముకుంద: అవును వైదేహి నువ్వు సరోగసి స్పెషలిస్ట్‌వి కదా..
వైదేహి: అవును..
ముకుంద: అయితే నీతో నాకు చాలా పని ఉంది.
మురారి, కృష్ణలు ఏకాంతంగా కూర్చొంటారు. కృష్ణ తన పెద్దత్తయ్యకు ఇచ్చిన మాట గుర్తుచేసుకొని బాధ పడుతుంది. పిల్లల గురించి ఆలోచించొద్దు అని మురారి అంటాడు. దాంతో కృష్ణ మీరు బాధ పడకూడదు అని నేను నేను బాధ పడకూడదు అని మీరు నటిస్తున్నాం కానీ మనకు బాధ లేదా అని ప్రశ్నించడంతో మురారి సైలెంట్ అయిపోతాడు. ఇక ముకుంద అక్కడికి వచ్చి చాటుగా వాళ్ల మాటలు వింటుంది.
కృష్ణ: ఇప్పుడు ఇంటికి వెళ్లాలి అంటే భయంగా ఉంది ఏసీపీ సార్. పెద్దత్తయ్యను చూడగానే ఎక్కడ భోరున ఏడుస్తూ నిజం చెప్పేస్తానా అని గుండెల్లో వణుకు పుడుతుంది ఏసీపీ సార్. పెద్దత్తయ్యకి ఈ విషయం ఎప్పటికీ తెలీకూడదు. చెప్పను అని మాట ఇవ్వండి ఏసీపీ సార్.
మురారి: చెప్పకుండా ఎలా దాచగలం. ఎన్నాళ్లని పిల్లలు పడతారని మభ్యపెట్టి ఉంచగలం.
ముకుంద: మనసులో.. సరోగసి గురించి చెప్పమంటే చెప్పకుండా ఏదేదో సోది చెప్పున్నాడేంటి. తొందరగా చెప్పరా మగడా.. కృష్ణ ఒప్పుకోవాలి కదా. అప్పుడే కదా నా ప్లాన్ వర్క్‌అవుట్ అవుతుంది.
మురారి: విన్నప్పుడే బాధ పడతారు. తర్వాత అర్థం చేసుకుంటారు.
ముకుంద: మురారికి ఏమైంది మొత్తం ప్లాన్ చెడగొట్టేలా ఉన్నాడే.
కృష్ణ: ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అన్నారు కదా ఏసీపీ సార్. ఈ సమస్యకు ఏ పరిష్కారం ఉందా అని ఆలోచించా దొరికింది. పెద్దత్తయ్యకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నా.. మన రక్తం పంచుకుపుట్టిన బిడ్డే మనకు కావాలి అన్నా ఒకే ఒక మార్గం ఉంది ఏసీపీ సార్.
మురారి: ఏంటి అది..
కృష్ణ: సరోగసీ. మీరు వినే ఉంటారు. సరోగసీ అంటే గర్భాన్ని అద్దెకు తీసుకోవడం.
ముకుంద: నువ్వు సూపర్ కృష్ణ.. పిచ్చి పిచ్చిగా నచ్చేశావ్..
కృష్ణ: ఏసీపీ సార్ ఏం ఆలోచిస్తున్నారు. నాకు ఒకే ఇప్పుడు దీనికి మించి వేరే దారి ఏముంది. అయినా ఇందులో తప్పేముంది నా గర్భంలో బిడ్డను మోసే పరిస్థితి లేదు. అందుకే వేరు గర్భాన్ని అద్దెకు తీసుకుంటాం. లీగల్‌గా జెనిటిక్‌గా అది మన బిడ్డే అవుతుంది. చాలా మంది ఈ ప్రాసెస్‌ను ఫాలో అవుతున్నారు కదా. కాకపోతే తొమ్మిది నెలలు మోశామన్న అనుభూతికి దూరం అవుతుంటాం అంతే. అసలు ఈ ఆలోచన రాగానే ఎంత రిలీఫ్‌గా ఉందో తెలుసా. గుండెలో బాధ అంతా తీసేసినట్లుంది. ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసికి వెళ్లిపోదాం ఏసీసీ సార్.
మురారి: అలాగే నీ మాట నేను ఎప్పుడు కాదు అన్నాను. నువ్వు కోరుకున్నట్లే చేద్దాం.
కృష్ణ: పదండి ఏసీపీ సార్ డాక్టర్ మహేశ్వరి గారితో ఈ విషయం గురించి మాట్లాడుదాం.
ముకుంద: ఎస్.. ఇక మురారి నా వాడు కాకుండా ఎవరూ ఆపలేరు కృష్ణ.
రేవతి: ఓరేయ్ మధు కృష్ణ గుడికి వెళ్లింది ఇంకా రాలేదురా.
మధు: కృష్ణనే కాదు పెద్దమ్మ మురారి కూడా లేదు. అయినా మీరా కూడా కనిపించడం లేదు. వీళ్లిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారోఏమో..
ఆదర్శ్: రేయ్.. ఏమన్నావ్‌రా..
మధు: మురారి, మీరా కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అన్నాను. అందులో తప్పేముంది.
ఆదర్శ్: ఫస్ట్ తన పేరు మీరా కాదు ముకుంద.
మధు: అసలు పేరు మీరానే బ్రో ముకుంద అని నువ్వు పెట్టావ్.
ఆదర్శ్: పెట్టాను కదా నువ్వు కూడా అలాగే పిలువు. అండ్ ముకుంద మురారితో కలిసి వెళ్లలేదు. అసలు తను ఎందుకు మురారితో కలిసి వెళ్తుంది.
మధు: ఇద్దరూ ఇంట్లో లేరు బ్రో. అందుకే కలిసి వెళ్లారేమో అన్నాను. కలిసి వెళ్తే ఏమవుతుంది. అయినా నువ్వు ఎందుకు బ్రో అంత ఫీలవుతున్నావ్.
ఆదర్శ్: నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు ఎవరిని ఏమనాలో నువ్వు నేర్చుకో.
మరోవైపు మురారి, కృష్ణలు డాక్టర్‌ని కలుస్తారు. సరోగసి ప్లాన్ గురించి చెప్తారు. అయితే మహేశ్వరి డాక్టర్ తాను సరోగసి చూడటం లేదు అని వైదేహి డాక్టర్ సరోగసీ స్పెషలిస్ట్ అని ఆవిడని కలవమని సూచిస్తుంది. ముకుంద ఈ విషయాలు అన్నీ తెలుసుకొని సంతోష పడుతుంది. ఇక కృష్ణ మురారిలు వైదేహి డాక్టర్ దగ్గరకు వస్తుంది. ఇంతలో ముకుంద వైదేహికి కాల్ చేసి తన ప్లాన్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.