Karthika Deepam 2 Serial Today April 29th: కార్తీకదీపం 2 సీరియల్: నేను బావ అనుకున్న భర్త అనుకున్నా అది నువ్వే.. నా స్థానం ఏంటి కార్తీక్‌ను నిలదీసిన జ్యోత్స్న.. రెచ్చగొట్టిన పారిజాతం!
Karthika Deepam 2 Serial Today Episode : జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన పారిజాతం దీప మీద లేని పోనివి చెప్పి మనవరాలి మనసు విరిచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న కోపంగా గదిలోకి వెళ్తుంది. కార్తీక్ జ్యోత్స్నతో మాట్లాడాలి అని వెళ్తాడు. డ్రైవింగ్ చేసే కండీషన్‌లో లేనప్పుడు నాకు కాల్ చేయొచ్చు కదా అని కార్తీక్ జ్యోత్స్నని అడుగుతాడు. దాంతో జ్యోత్స్న కాల్ వచ్చింది అనే కదా నన్ను వదిలేసి వెళ్లిపోయావ్ అంటుంది.
కార్తీక్: వెళ్లిపోతే మళ్లీ రాను అనుకున్నావా. ఇది మన ఫ్యామిలీ. ఈ జనరేషన్‌లో మన ఫ్యామిలీ పరువు కాపాడాల్సిన బాధ్యత మనది.
జ్యోత్స్న: బాధ్యత గురించి నువ్వు మాట్లాడకు బావ నన్ను వదిలేసి వెళ్లిపోయావ్. నా ఫ్రెండ్స్ ముందు అది నాకు ఎంత అవమానమో తెలుసా.. కేవలం నీ మీద ప్రేమతోనే తాగాను బావ.
కార్తీక్: నా మీద ప్రేమతో మనుషుల్ని చంపేస్తావా..
జ్యోత్స్న: ప్రేమ విలువ తెలుసా నీకు.
కార్తీక్: ప్రాణం విలువ తెలుసా నీకు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతుందని తెలుసా. డబ్బుతో కూడా కొన్ని సార్లు చేసిన తప్పు సరిదిద్దుకోలేం జ్యోత్స్న. ఆ బాధ మనతో కలిసి నడుస్తున్న నీడ లాంటిది.
జ్యోత్స్న: రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే వదిలేసి వెళ్లిపోతావా. నీకు పార్టీలు అంటే ఇష్టం లేదా లేక నేనంటే ఇష్టం లేదా.. చెప్పు బావ. వాళ్లు వీళ్లు అనడం కాదు నువ్వేంటే నాకు తెలియాలి. చిన్నప్పుడు నుంచి నేను బావ అనుకున్నా భర్త అనుకున్నా అది నువ్వే. అంత ప్రేమ నీ నుంచి కూడా నేను కోరుకుంటాను కదా బావ. మరి నేను కోరుకుంటున్న ప్రేమను నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావ్. నా అంతగా నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావ్.
కార్తీక్: మనసులో.. పరిస్థితి ఇంత దూరం వచ్చిన తర్వాత జ్యోత్స్నతో నిజం చెప్పేస్తేనే మంచిది. నువ్వు నాకు మరదలివి మాత్రమే భార్యవి కావు అని చెప్పేస్తా. తను కూడా అర్థం చేసుకుంటుంది.
జ్యోత్స్న: ఇప్పుడు కూడా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా బావ.
కార్తీక్: లేదు జ్యోత్స్న నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనుకుంటున్నా.
జ్యోత్స్న: చెప్పు బావ నేను ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తున్నా.
కార్తీక్ జ్యోత్స్నను ప్రేమించడం లేదు అని నిజం చెప్పబోయే టైంకి దీప పాలు తీసుకొని వస్తుంది. దీంతో కార్తీక్ నిజం చెప్పకుండా ఆగిపోతాడు. దీప నిజం చెప్పకుండా ఉండాల్సింది అంటే జ్యోత్స్న పాలు అక్కడ పెట్టి వెళ్లు అని అంటుంది. దీప పాలు పెట్టి వెళ్లగానే మీడియా చేసిన అవమానం తలచుకొని జ్యోత్స్న పాల గ్లాస్ విసిరి కొడుతుంది. కార్తీక్ ఏంటని ప్రశ్నించడంతో తనని ఒంటరిగా వదిలేయ్ మని చెప్తుంది. ఇక పాల గ్లాస్‌ని జ్యోత్స్న.. దీప విసిరేయడంతో ఫీలవుతుంది. కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు. దీప చీపురు తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది.
పారిజాతం జ్యోత్స్నకు నిజం చెప్పకుండా ఏం చేస్తుందా అని కార్తీక్ అనుకొని పారిజాతం దగ్గరకు వెళ్తాడు. ఇక పారిజాతం ఇదే ఛాన్స్ అనుకొని ఎలా అయినా దీపని ఇంట్లో నుంచి తరిమేయాలి అనుకుంటుంది. జ్యోత్స్న తనకు మరదలు మాత్రమే భార్య కాదు అని చెప్పమని చెప్తే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న తనని తప్పు చేసిన వాడిలా చూస్తుందని.. గిల్టీగా ఉందని కార్తీక్ అంటాడు. అనవసరంగా జ్యోత్స్న భర్త్‌డేకి ఇక్కడికి వచ్చాను. ఎటైనా వెళ్లిపోయి ఉంటే బాగుండేదని అంటాడు. జ్యోత్స్నతో నువ్వు నిజం చెప్పలేవు అని నేనే చెప్తాను అని వినాలి అనుకుంటే హాల్‌లోకి రా అని అంటాడు.
పారిజాతం: నీ మరదల్ని నువ్వే చంపాలి అని చూస్తున్నావా. నువ్వు పార్టీలో లేవని మందు తాగింది. జీవితంలో లేవు అంటే విషం తాగదా. అది అసలే బాధలో ఉంది ఈ టైంలో ఇది తెలిస్తే జ్యోత్స్న బతకదురా.. దాని బలం నువ్వే దాని బలహీనత నువ్వే. ఈ ఇంటికి ఉన్న ఏకైక వారసురాలురా అది. అందరం దాని మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. ఈ కుటుంబాలు మీ ఇద్దరి పెళ్లి మీద పెట్టుకున్న ఆశలు వద్దునుకున్నంత తేలికగా వదిలిపోవురా. ముందు ఈ సమస్యలు అన్నీ తీరిపోని అందరి మనసులు కుదిట పడిన తర్వాత నేనే చెప్తాను.
సుమిత్ర: దీప దగ్గరకు వచ్చి బాధపడుతుంది. జ్యోత్స్న మంచిదే కానీ మొండిది. ఒక్కదాయే అవ్వడం అందులోనూ ఆడపిల్ల అవ్వడంతో అందరూ గారాభం చేశారు. మా కంటే మా ఆడపడుచు ఆమె కంటే మా అత్తయ్య ఎక్కువ గారాభం చేశారు. అందుకే చివరకు అది ఎలా తయారైంది అంటే చిన్నపాటి అవమానాన్ని కూడా తట్టుకోలేదు. ఎవరైనా ఒక మాట అంటే భరించలేదు. అనుకున్నది దక్కకపోతే సహించలేదు. దానికి ప్రేమ కలిగితే అవతల వాళ్లు ఇవ్వకపోతే చనువు తీసుకుంటుంది. ఒక్క సారి ద్వేషం వచ్చింది అంటే చాలా దూరం పెట్టేస్తుంది. మనసు బాధ పడేలా మాట్లాడుతుంది. దాన్ని మేం చిన్నపిల్లలాగే అనుకుంటాం. దాని మాటలు నువ్వు మనసుకి తీసుకోకు దీప.
దీప: నేను నిజం చెప్పడం వల్ల తను అందరిలో తల దించుకుంది. అవమానం ఎదుర్కొంది. తనని నేను అర్థం చేసుకున్నాను. అందుకే క్షమాపణ చెప్పాను. తను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు తనని ఏం అనొద్దు అమ్మ.
పారిజాతం జ్యోత్స్నకు అన్నం తినిపిస్తూ దీప మీద లేనిపోనివి చెప్పి జ్యోత్స్నను రెచ్చగొడుతుంది. జ్యోత్స్న దీప తప్పు చేయలేదు అని అంటుంది. కానీ పారిజాతం జ్యోత్స్న మనసు విరగ్గొట్టాలి అని నిర్ణయించుకొని మీడియా చేసిన అవమానం గురించి మాట్లాడుతుంది. అన్నింటికి దీప వల్ల తప్పు జరిగిందని అంటుంది. దీప నిజం చెప్పడం వల్లే నీ పరువు పోయిందని.. కార్తీక్‌కి కూడా నీ మీద మంచి అభిప్రాయం మారిపోయి పెళ్లి చేసుకోను అంటే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. దీంతో జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది. దీంతో జ్యోత్స్న దీప మీద ద్వేషం పెంచుకుంటుంది.
మరోవైపు కార్తీక్ తన తల్లిదండ్రులతో జరిగినదంతా చెప్తాడు. దీప నిజం చెప్పకుండా ఉండాల్సిందని కాంచన అంటుంది. జ్యోత్స్న దగ్గరే కార్తీక్‌ని ఉండమని అంటే కార్తీక్ వెళ్లనంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ : గాయత్రీ దేవి జాడ చూపిస్తానన్న విశాలాక్షి.. గుర్రం రహస్యం బయట పడుతుందా!