Krishna Mukunda Murari Serial Today April 13th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఈసారి శోభనానికి ముహూర్తాలు లేవ్, డే అండ్ నైట్ మీ ఇష్టం.. భవాని మాటలకు ముకుంద మైండ్ బ్లాంక్!
Krishna Mukunda Murari Serial Today Episode కృష్ణ, మురారిలు శారీరకంగా కలవకుండా ఉండటానికి ముకుంద రజినితో చేతులు కలిపి మాస్టార్ ప్లాన్ వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode తనకు చుడీదార్‌లు చాలా బాగుంటాయని కృష్ణ అంటే అస్సలు సెట్ కావని మురారి అంటాడు. దీంతో కృష్ణ భవానికి కంప్లైంట్ ఇస్తుంది. భవాని మురారితో నాన్న తింగరికి చుడీదార్‌లు చాలా బాగుంటాయి నీకే టేస్ట్ లేదు అంటుంది. దీంతో మురారి అవును పెద్దమ్మ నాకే టేస్టే లేదు లేదంటే ఈ తింగరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటాడు. దీంతో కృష్ణ మురారి వెంట పడుతుంది. మురారి దొరకకుండా పరుగు అందుకుంటాడు.
ముకుంద: మనసులో.. మాట వరసకు అన్నా మంచి మాట అన్నావ్ మురారి. ఈ కృష్ణ నీకు అస్సలు సెట్ కాదు ఆవిషయం నీకు తొందర్లోనే తెలుస్తుంది. అప్పుడు నువ్వు కృష్ణని వదిలేస్తావ్.
భవాని: ఇక చాలు ఆపండి.. ఆగు కృష్ణ. మురారి, కృష్ణ ఇద్దరూ పక్కపక్కన నిల్చొండి.. సరే ఇప్పుడు మీ ఇద్దరికీ ఓ మాట చెప్తున్నా ఎందుకు ఏమిటి అని అడగకుండా..నోరు మూసుకొని నేను చెప్పింది పాటించాలి.
ముకుంద: ఏం బాంబ్ పేల్చబోతుందో ఈవిడ.
భవాని: ఏంటి మాటిస్తారా లేదా..
కృష్ణ: అలా అడుగుతారు ఏంటి మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్తే కాదు అన్నామా. ఎప్పుడైనా మా స్వార్థం గురించి ఆలోచించుకున్నామా..
భవాని: ఏయ్ తింగరి నా బాధ కూడా అదే. ఏ స్వార్థం లేకుండా పిచ్చి దానిలా అందరి గురించి ఆలోచిస్తావ్. ఎప్పుడైనా నీ స్వార్థం గురించి ఆలోచించి ఉంటే ఈ పాటికి మీ అత్తయ్యని నానమ్మని చేసుండేదానివి..
ముకుంద: అర్థమైంది వీళ్లు మళ్లీ శోభనం గురించి ప్లాన్లు చేస్తున్నారు. మళ్లీ దాన్ని ఎలా చెడగొట్టాలా అని ఇప్పుడు ఆలోచించాలి.
రేవతి: అక్క ఇక ఆలోచించడానికి ఏం లేదు. ఇంతకు ముందు అంటే ముకుంద, ఆదర్శ్‌ల గురించి ఆలోచించాం. ఇప్పుడు ఇక ఆలోచించడానికి ఏం లేదు. పైగా కృష్ణ అడిగింది కాబట్టి తన వైపు నుంచి ఏ ప్రాబ్లమ్ లేదు. కాబట్టి పంతులు గారికి పిలిపించి శోభనానికి ముహూర్తం పెట్టించేద్దాం.
భవాని: అవసరం లేదు. ఈ శోభనాలు ముహూర్తాలు ఏవీ అవసరం లేదు. ముహూర్తం పెట్టిన ప్రతీ సారి ఏదో ఒక సమస్య. ఈసారి ఈ ముహూర్తాలు అవేమీ వద్దు. ఎప్పుడో భార్య భర్తలు అయిన మీరు ఈ రోజు నుంచి నిజమైన భార్యభర్తల్లా మలచుకోండి.
ముకుంద: ఈవిడ ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటి. శోభనానికి ముహూర్తం పెడతారు ఏమో చెడగొట్టొచ్చు అంటే ముహూర్తాలే వద్దు అనేసింది. ఇప్పుడు ప్రతీ రాత్రి నేను ఎలా కాపలా ఉండగలను.
భవాని: ఏయ్ తింగరి చెప్పింది అర్థమైంది కదా..
రజిని: ఎందుకు అర్థంకాదు వదినా నీ కోడలు అంత తెలివి తక్కువది కాదులే. ఏడాది తిరిగేలో నీ చేతిలో మనవడిని పెట్టేస్తుంది. అలాగే ఇంకో మనవడు కూడా వచ్చేస్తే బాగుంటుంది. అందరూ షాక్ అవుతారు. అదే వదిన నువ్వు ఆలోచిస్తా అన్నావ్ కదా అదే.
కృష్ణ: ఏ విషయం పెద్దత్తయ్య.
భవాని: ఏం లేదు. ఇన్నాళ్లు నువ్వు పక్క విషయాలు ఆలోచించింది చాలు. ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే ఆలోచించు చాలు.
మురారి: తనలోతాను.. ఇంత కాలానికి కుదిరింది. పెద్దమ్మ మమల్ని అర్ధం చేసుకొని చెప్పాల్సింది చెప్పేసింది. ఇంతలో ముకుంద వస్తుంది. ముకుంద నువ్వా..
ముకుంద: ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా.. మేడం ముహూర్తాలే అవసరం లేదు అన్నారు కదా మీరు హ్యాపీకదా.. కంగ్రాట్స్.. అని తానే మురారి చేయి పట్టుకొని మాట్లాడుతుంది. కృష్ణ చెల్లెలిలా శోభనం ఏర్పాట్లు చేద్దామని అనుకున్నాను. కానీ ఛాన్స్ లేదు.. ఇక కృష్ణ రావడం చూసి వెళ్లిపోతుంది. ఇక కృష్ణ తన అనుమానాలు మురారిని అడుగుతుంది.
ముకుంద: ఈవిడ ఏంటి ముహూర్తాలు వద్దు అని రాత్రి పగలు అని కూడా చూడొద్దు అని అల్టిమేటం జారీ చేసింది. తలచు కుంటేనే తల పగిలిపోతుంది. ఛా.. అవును ఈవిడను పిలిచాను ఇంకా రాలేదు ఏంటి. ప్లాన్ ఏ ఆమె చేస్తే ప్లాన్ బీ నేను చేస్తా.. రజిని, సంగీత రావడంతో సంగీతని బయటకు పంపేస్తుంది. మీ కూతుర్ని వెళ్లమంది తనకి తెలీకూడదు అని అంతే కానీ నేను మీకు చెప్తే మీరు తర్వాత తనకి చెప్తారు అని కాదు. చెప్పారు అనుకోండి మీరు అనుకున్నది ఏదీ జరగదు. మీరేం చేస్తారో నాకు తెలీదు కానీ చెప్పింది చెప్పినట్లు చేయాలి. అని ప్లాన్ చెప్తుంది. ఇప్పుడు అర్థమైందా ఆదర్శ్, సంగీతలకు పెళ్లి చేయాలి అని నేను ఎందుకు తొందరపడుతున్నానో.
రజిని: అర్థమైంది అర్థమైంది.
ముకుంద: సరే వెళ్లి ఆపనిలో ఉండండి..
మురారి శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయిపోతాడు. కృష్ణ పాల గ్లాస్‌తో వస్తుంది. ఫామ్ హౌస్‌కు మూడు రోజులు వెళ్దామని మురారి అంటే కృష్ణ వద్దు అనేస్తుంది. ఇక ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.