Karthika Deepam 2 Serial Today April 13th: కార్తీకదీపం 2 సీరియల్: ఉగాది పచ్చడి పోటీల్లో వంటలక్కే ఫస్ట్, సౌర్యకు గోల్డ్ చైన్.. జీవితంలో క్షమించనని కార్తీక్‌కు చెప్పిన దీప!
Karthika Deepam 2 Serial Today Episode ఉగాది పచ్చడి పోటీల్లో దీప గెలవడంతో శివనారాయణ బంగారం చైన్ గిఫ్ట్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివనారాయణం ఇంట్లో అందరూ ఉగాది పచ్చడి పోటీలో పాల్గొంటారు. సౌర్య అమ్మమ్మ సుమిత్రకు సపోర్ట్ చేస్తుంది. జ్యోత్స్న తాతయ్య ఇవ్వబోయే గోల్డ్ చైన్ నా మెడలోనే పడాలి అంటుంది. వేరే టీమ్‌లో ఉన్న పారిజాతం నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే ఆ చైన్ నాకే అంటుంది.
కార్తీక్: అమ్మ మనం ఇది అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్దాం.
కాంచన: మీనాన్న సాయంత్రం ఏదో పని ఉంది అన్నారు.
కార్తీక్: అయితే మీరు ఒకసారి నేను ఒకసారి ఎందుకు పని అయిపోతే అందరం సాయంత్రం వెళ్లిపోదాం. రెస్టారెంట్‌కి సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి.
కాంచన: అవి జరుగుతాయి కానీ నువ్వు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోరా. నా కోడలు మాత్రం నీ కోసం ఎన్నాళ్లు ఎదురు చూస్తుంది.
కార్తీక్: ఉగాది పచ్చడిలో చింతపండు బదులు నిమ్మకాయ పడితే ఎలా ఉంటుంది.
కాంచన: నేను ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావ్.
కార్తీక్: మరి నువ్వు ఏంటి ఉగాది పచ్చడి చేయకుండా నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావ్. అటు చూడు పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయో తెలియని పారు కూడా తాతయ్య ఇచ్చే గొలుసు కోసం తంటాలు పడుతుంది.
అందరూ ఉగాది పచ్చడి చేసి తీసుకొస్తారు. ఇక శివనారాయణ తాను కోడలు పక్షపాతి కాబట్టి తన తీర్పు ఎవరికీ నచ్చదని నువ్వే రుచి చూసి చెప్పాలి అంటాడు. దీప అందరి పచ్చడి రుచి చూడటం మొదలు పెడుతుంది. జ్యోత్స్న చేసిన పచ్చడి రుచి చూసి కారం ఎక్కువ అయింది అంటుంది. ఇక కార్తీక్ వాళ్లు చేసిన పచ్చడి రుచి చూసి కొంచెం చేదు ఎక్కువ అయింది అంటుంది. దానికి కార్తీక్ దీపకు అర్థమయ్యేలా తొందర పడ్డాను క్షమించండి అంటాడు. తర్వాత దీప పారు చేసిన పచ్చడి రుచి చూసి ఏదోలా ఉందో అని అంటుంది. దానికి పారు రుచి కోసం కొంచెం ఇంగువ వేశాను అంటుంది. అందరూ నవ్వుకుంటారు. ఇక సుమిత్ర చేసిన పచ్చడి రుచి చూసిన దీప ఉప్పు బాగా ఎక్కువ అయిపోయింది అంటుంది.
శివనారాయణ: అమ్మా దీప ఇవి ఎవరూ తినలేరు అని అర్థమైపోయింది కాబట్టి అచ్చమైన ఉగాది పచ్చడి నీ చేతులతో నువ్వు చేసి తీసుకురామ్మా.
దీప: నేను చేస్తే మీకు నచ్చుతుందో లేదో తాతయ్యగారు.
శివనారాయణ: ఇంగువ, కొత్తిమీర అయితే వేయవు కదా..
పంతులు పూజ చేసి అందరికీ హారతి ఇస్తాడు. పంచాంగ శ్రవణం ప్రారంభిస్తారు. ఇక దీప ఉగాది పచ్చడి చేస్తానని లోపలికి వెళ్తుంది. కార్తీక్ దీపని చూస్తూ ఉంటాడు. ఇక దీప అందరి కోసం ఉగాది పచ్చడి తీసుకొని వస్తుంది. అందరికీ ఇస్తుంది. కార్తీక్ దగ్గరకు లాస్ట్‌కి వెళ్లి ఇస్తుంది.
కార్తీక్: క్షమించారు అనుకోవచ్చా..
దీప: అది ఈ జన్మలో జరగదు.
శివనారాయణ: చాలా బాగా చేశావ్ దీప..
సుమిత్ర: అవును మామయ్య గారు చాలా బాగుంది.
దశరథ: సుమిత్ర ఇక ప్రతి ఉగాదికి దీపని మన ఇంటికి తీసుకెళ్లాల్సిందే.
శ్రీథర్: అవును బావ తను రాకపోతే మనం తన ఇంటికి వెళ్లిపోవాల్సిందే.
శివనారాయణ: ఏకగ్రీవంగా అందరూ దీప చేసిన పచ్చడిని మెచ్చుకున్నారు కాబట్టి ఏకగ్రీవంగా దీపని విజేతగా ప్రకటిస్తున్నాను. అన్న మాట ప్రకారం ఈ బంగారు చైన్ నీదే అమ్మ.
దీప: నాకు ఇలాంటివేమీ వద్దు తాతయ్య గారు నేను మీ అందరి కోసం చేశాను.
శివనారాయణ: సరే నీకు ఇవ్వనులే ఈ చిట్టితల్లికి వేస్తాను. రావే మనవరాలా..
దీప: అదేం వద్దు తాతయ్య గారు..
శివనారాయణ: ఇది నేను ప్రేమతో ఇచ్చిన కానుక నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మ దీప నీ రాశి ఏంటి అమ్మ.
దీప: ఈ రాశులు అవి నాకు తెలీదు తాతగారు. మా నాన్న నాకు చెప్పలేదు.
పారిజాతం: పోని ఎప్పుడు పుట్టాడో చెప్పాడా..
సుమిత్ర: అత్తయ్య దీపకు అమ్మానాన్నలు లేరు.
శివనారాయణ: నేనే అనవసరంగా నిన్ను అడిగినట్లు ఉన్నాను అమ్మా ఏమీ అనుకోవద్దు.
ఇక పంతులు జ్యోత్స్న జాతకం ఈ ఏడాది ఏం బాలేదు అని చెప్తారు. పారు పెళ్లి గురించి చూడమని అంటే.. ఈ ఏడాది పెళ్లి కష్టమే అంటారు పంతులు. అందరూ డల్ అయిపోతారు. ఇక కాంచన కార్తీక్‌కు ఎలా ఉందో చూడమని అంటుంది. ఇక పంతులు కార్తీక్ చేతులు మీదగా ఈ ఏడాది చాలా మంచి పనులు జరుగుతాయి అని మంచి చేసినా అవమానాలు ఎదురవుతాయి అని చెప్తాడు. శత్రువులను జయిస్తారు అని చెప్తారు. ఇక కార్తీక్, జ్యోత్స్నలను ఎలా కలపాలా అని పారు ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అంజనంలో కనిపించిన గాయత్రీ దేవి ప్రతిబింబం.. కళ్లుతిరిగి పడిపోయిన గాయత్రీ పాప!