Krishna Mukunda Murari July 10th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్ - రంగంలోకి దిగిన భవానీ దేవి, ముకుంద ప్రేమ గురించి తెలుసుకుంటుందా?
కృష్ణ కూడా మురారీని ప్రేమిస్తుందని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మురారీ తన ప్రేమ విషయం కృష్ణకి చెప్పాలని అనుకున్న ప్రతీసారి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంటుంది. ఎలా చెప్పాలి కృష్ణ నా ప్రేమని కాదంటావని భయంగా ఉందని అనుకుంటాడు. ఇన్నాళ్ళూ ఆ డైరీ అమ్మాయి గురించి చెప్తానంటే భయమేసింది కానీ నా మనసులో ఇప్పుడు ఏదో ఒక మూలన నా ప్రేమ మీద నమ్మకం ఉంది మీ గతానికి నా భవిష్యత్ కి ఏ సంబంధం లేదని అర్థం అయ్యింది. ఇప్పుడే మీరు నామీద ఇష్టం చెప్తే గట్టిగా హత్తుకుంటానని అనుకుంటుంది. మురారీ చెప్పేలోపు అలేఖ్య వచ్చి పెద్దత్తయ్య రమ్మంటున్నారని పిలుస్తుంది. ఏసీపీ సర్ ని ప్రేమించిన అమ్మాయి గురించి గీతిక ముకుందకి చెప్పిందేమో కనుక్కుందామనుకుంటుంది. అటు గదిలో ముకుంద మురారీ ఫోటో చూసుకుంటూ నీ ప్రేమ కృష్ణకి ఎలా దక్కనిస్తాను. ఇన్నాళ్ళూ నువ్వు మారతావాని ఎదురుచూశాను. కానీ ఇప్పుడు కృష్ణ నిన్ను ప్రేమిస్తుందని తెలిసి ఎలా ఊరుకుంటాను. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని పెద్దత్తయ్యకి చెప్పేస్తాను. నా చేతికి మట్టి అంటకుండా నిన్ను సొంతం చేసుకుంటానని అనుకుంటుంది.
Also Read: పెళ్ళాం చేతికి డబ్బులివ్వలేక రాజ్ అగచాట్లు- అప్పు ప్రేమలో పడిపోయిన కళ్యాణ్!
ముకుంద ఫోటో చూస్తూ ఉండగా కృష్ణ గదిలోకి వస్తుంది. తనని చూసి కంగారుగా ఫోటో వదిలేయడంతో కింద పడిపోతుంది. ఫోటో చూస్తే అని కంగారుపడి చూస్తే చూడనివ్వు మొత్తం తెలిసిపోతుందని హ్యాపీగా ఫీలవుతుంది. కృష్ణ ఆ ఫోటో తీసి చూడకుండానే ముకుందకి ఇచ్చేస్తుంది. గీతిక ఏమైనా వచ్చిందా, కాల్ చేసిందా అని అడుగుతుంది. మురారీ విషయం తనతో చెప్తే అసలు నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతుంది. కృష్ణ అసలు విషయం చెప్పకుండా వేరే ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంది. ముకుంద మాటలు నమ్మబుద్ధి కావడం లేదని కృష్ణ డౌట్ పడుతుంది. భవానీ మురారీతో మాట్లాడుతుంది.
భవానీ: ఆశ్రమానికి వెళ్ళే రోజు ముకుంద తండ్రి వచ్చి విడాకులు ఇప్పించమని గొడవ చేశాడు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఇక్కడికి రావడానికి ముందు శ్రీనివాసరావు దగ్గరకి వెళ్ళి మాట్లాడి వచ్చాను. కానీ ఆయన ఇక మాట అన్నారు అందులో తప్పు లేదని అనిపించింది. ఏదైనా జరగరానిది జరిగితే మొత్తం తెలిసిపోతుంది కదా అలా తెలియలేదంటే అసలు ఆదర్శ్ కి ఇంటికి రావడం ఇష్టం లేదేమో కనుక్కోమని చెప్పారు. అసలు ఎందుకు అలా అన్నారు. ఆదర్శ్ ఇంటికి రాకూడదని ఎందుకు అనుకుంటాడు.
మురారీ: రీజన్ తెలిస్తే మీరు ఇలా బాధపడతారు. ముకుందని ఒప్పించి పెళ్లి జరిపించాను కానీ ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని మనసులో బాధపడతాడు
భవానీ: ఆదర్శ్ కాలేజ్ డేస్ లో ఎవరినైనా లవ్ చేశాడా?
మురారీ: లేదు పెద్దమ్మ
Also Read: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర
భవానీ: నా దగ్గర వాడు ఏదీ దాచడు. ముకుందని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ ముకుంద వాళ్ళ నాన్న చెప్పింది నిజమైతే ఇన్నాళ్ళూ ఎక్కడ ఉన్నాడు. ఒక్కసారి వాడిని చూడాలని ఉంది. పెళ్లికి ముందు ఆదర్శ్ ఎవరినీ లవ్ చేయలేదు ముకుంద ఎవరినైనా లవ్ చేసి ఉండవచ్చు కదా. ఆ విషయం వాడికి పెళ్ళయిన రోజు తెలిసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు ఏమో. మనకి తెలియనిది ఇంకేదో ఉంది. అదేంటో కనుక్కుని నువ్వే నాకు చెప్పాలి మురారీ. చెప్తానని మాట ఇవ్వు అనేసరికి మాట ఇస్తాడు. నందిని విషయంలో మాట ఇచ్చి తప్పావు మరోసారి మాట తప్పితే జీవితాంతం నిన్ను క్షమించలేను
మురారీ గదిలోకి వెళ్ళి ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలా అని మథనపడతాడు. కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏం లేదని అంటాడు. చెప్పడాలు ఏమి లేవు నిజాలు తేల్చుకోవాలని అంటుంది. మురారీ లవ్ మ్యాటర్ ని ఇన్ డైరెక్ట్ గా వేరే వాళ్ళ దానిలా చేసి కృష్ణ చెప్తుంది. మీరు చెప్పండి ప్రేమించిన అమ్మాయి వైపు ఉంటారా? పెళ్లి చేసుకున్న అమ్మాయి వైపు ఉంటారా? అని అడుగుతుంది. కొన్నింటికి సమాధానాలు దొరకవు అందుకే ఎస్కేప్ అవుతున్నాడేమో అనుకుని వెళ్ళిపోతాడు.