Guppedanta Manasu July 10th: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర
Guppedantha Manasu July 10th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
వసుధార పవర్ ఆఫ్ స్టడీస్ మీద సెమినార్ అన్ లైన్ లో పెడదామని కాలేజ్ వాళ్ళని ఒప్పిస్తాడు. అది చూసి ఏంజెల్ రిషిని ఆకాశానికెత్తేసి పొగుడుతుంది. అవును నాకొక డౌట్ నువ్వు చాలా అందంగా ఉంటావ్ కదా ఇప్పటి వరకు నిన్ను ఎవరూ లవ్ చేయలేదా అని ఏంజెల్ అడుగుతుంది. వసు తనకి ప్రపోజ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. నువ్వు ఎవరినీ లవ్ చేయలేదా అంటుంది. వసుకి తను ప్రపోజ్ చేసింది గుర్తు చేసుకుని ఇప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా అని టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తాడు. నువ్వు చెప్పు వసుధార రిషి బాగుంటాడా లేదా అంటే సిగ్గుపడుతూ బాగుంటాడని చెప్తుంది. ఐలవ్యూ రిషి అని ఏంజెల్ చెప్పేసరికి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మళ్ళీ ఐలవ్యూ రిషి అని ఎవరూ చెప్పలేదా అనేసరికి ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అంటే నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని ఏంజెల్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ బోరింగ్ పర్సన్ కి లవ్ తెలియదని ఏంజెల్ అంటే రిషి సర్ కి ప్రేమ తెలియకపోవడం ఏంటి తను వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అనుకుంటుంది.
Also Read: 'నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి నా మాజీ మొగుడ్ని' లాగేసుకుంటానంటూ వేదకి ఛాలెంజ్ విసిరిన మాళవిక
జగతి, మహేంద్రని శైలేంద్ర ఫాలో అవుతూ ఉంటాడు. అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు. కాలేజ్ బాధ్యతలు అప్పగించకుండా పిన్నీ ఏదైనా పల్నా చేస్తుందా అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. హోటల్ లో దిగిన మహేంద్ర, జగతి రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషి మళ్ళీ నన్ను అమ్మలాగా చూస్తూ ఉంటాడో లేదో. నేను చేసిన తప్పుకి వసు ప్రేమని పోగొట్టుకుంది తల్లికి దూరమైందని బాధపడుతుంది. రిషి ఏదో ఒకరోజు తప్పకుండా అర్థం చేసుకుంటాడని మహేంద్ర ధైర్యం చెప్తాడు. శైలేంద్ర జగతికి కాల్ చేసి ఎక్కడున్నారని అడుగుతాడు. ఒకవేళ హోటల్ రూమ్ లో స్టే చేస్తే జాగ్రత్తగా ఉండండి. బాబాయ్ కి కూడా జాగ్రత్త చెప్పండి అసలే కారు స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు కదా అంటూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు.
రిషి వర్క్ చేస్తూనే సోఫాలో కూర్చుని నిద్రపోతాడు. వసు పిలిచినా కూడా పలకడు. అలిసిపోయినట్టు ఉన్నారు నిద్రపట్టేసిందని అనుకుని వసు బెడ్ షీట్ తీసుకొచ్చి తనని పడుకోబెట్టి కప్పుతుంది. వసు మేల్కొని వర్క్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి రిషికి మెలుకువ వచ్చి ల్యాప్ టాప్ లేదేంటి ఏంజెల్ తీసిందేమో అనుకుంటాడు. వసు గదిలో లైట్ ఆన్ లో ఉండటం చూసి ఇంకా ఏం చేస్తుందని తన గది దగ్గరకి వెళతాడు. ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నారా అంటాడు. మీరు అలిసిపోయి నిద్రపోయారు అందుకే వర్క్ పూర్తి చేశానని చెప్తుంది. ఇదంతా నన్ను ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నారా అని అడుగుతాడు. లేదు సర్ పవర్ ఆఫ్ స్టడీస్ కాన్సెప్ట్ బాగా నచ్చిందని అందుకే వర్క్ చేశానని చెప్తుంది. ఎలాగైనా కాలేజ్ కి వెళ్ళి సెమినార్ లో పాత రిషి సర్ ని చూడాలి. నా ఎండీ మొహంలో చిరునవ్వు చూడాలని వసు కాలేజ్ కి రెడీ అవుతుంది.
Also Read: లాస్య ప్లాన్ సక్సెస్- దివ్య తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందా?
విశ్వనాథం, రిషి కాలేజ్ కి బయల్దేరుతుంటే వసు వచ్చి తను కూడా వస్తానని అడుగుతుంది. సెమినార్ దగ్గర ఉండాలని ఇక్కడే ఉంటే అందరినీ మిస్ అవుతానని చెప్తుంది. నాకు తెలుసు నువ్వు నా కోసమే నువ్వు కాలేజ్ కి వస్తున్నావని రిషి మనసులో అనుకుంటాడు. కాలేజ్ కి రాకపోతే తన మనసు చాలా భారంగా ఉంటుందని వస్తానని వసు అడుగుతుంది.