అన్వేషించండి

Ennenno Janmalabandham July 10th: 'నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి నా మాజీ మొగుడ్ని' లాగేసుకుంటానంటూ వేదకి ఛాలెంజ్ విసిరిన మాళవిక

మాళవిక గురించి వేదకి అసలు నిజం తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్, మాళవిక పెళ్లి ఫోటోని తీసుకొచ్చి ఆదిత్య హాల్లో తగిలించడంతో అందరూ చాలా డిస్ట్రబ్ గా ఫీల్ అవుతారు. దాని గురించే ఆలోచిస్తూ ఉందేమో అనుకుని యష్ వేదకి కాల్ చేస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వేద మాట్లాడుతుందా లేదంటే ఫేస్ సీరియస్ గా పెట్టె జాంబీ మాట్లాడుతుందా అని అంటాడు. పొద్దున తప్పించుకున్నారు కదా ఇప్పుడు చపాతీ కర్ర కూడా రెడీగా ఉందని కోపంగా చెప్తుంది. ఏమైంది అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు కోపంగా ఉన్నావ్ ఎందుకని అడుగుతాడు. వేద మౌనంగా ఉంటుంది. వాళ్ళ మాటలన్నీ చాటు నుంచి మాళవిక వింటుంది.  పెళ్ళాం అలక తీర్చడం కోసం ఏకంగా బుట్ట మల్లెపూలు కొనేసి ఇంటికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి లోపలికి వెళతాడు. వేద వాటిని చూసి పూలు తీసి పెట్టుకుంటుంది. తను వెళ్లిపోగానే మాళవిక కూడా వచ్చి పూలు తీసి తలలో పెట్టుకుంటుంది. కొన్ని పూలు తెంపి డాబా మీదకి దారిలా పోస్తూ వెళ్తుంది. యష్ వాటిని చూసి మేడమ్ పూలు పెట్టుకున్నారని అనుకుని డాబా మీదకి వెళతాడు.

Also Read: లాస్య ప్లాన్ సక్సెస్- దివ్య తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందా?

డాబా మీద బట్టలు ఉంటే అక్కడ ఉన్న యష్ టీ షర్ట్ పట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వేద బట్టలు తీసేందుకు వెళ్తుంది. వెనుక నుంచి వెళ్ళి వేదని హగ్ చేసుకుంటాడు. వేద సరదాగా అటూ ఇటూ పరిగెడుతూ కిందకి వెళ్ళిపోతుంది. కానీ బట్టల చాటున మల్లెపూలు పెట్టుకుని మాళవిక ఉంటుంది. వెనుక నుంచి పూలు చూసి వేద అనుకుని వెళ్ళి హగ్ చేసుకుంటాడు. కౌగలించుకుంది వేద అనుకుని యష్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. వేద యష్ కోసం మళ్ళీ పైకి వచ్చి చూసేసరికి మాళవికని హగ్ చేసుకుని ఉండటం చూసి షాక్ అవుతుంది. యష్ వేదని చూసి హగ్ చేసుకున్న మాళవికని వదిలేస్తాడు. కోపంగా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని అంటాడు. ఈ మల్లెపూలు ఎందుకు పెట్టుకున్నావని అడుగుతాడు. అత్తయ్యగారు అందరికీ తెచ్చారని పెట్టుకున్నానని అబద్ధం చెప్తుంది. వేద లేదు కావాలని పెట్టుకున్నావని అంటుంది. నేను ఇంత సేపు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడుకుండా ఉన్నావ్ కనీసం నేను పట్టుకున్నప్పుడు అయినా చెప్పాలి కదా? మౌనంగా ఉండటంలో నీ ఉద్దేశం ఏంటని నిలదీస్తాడు. కానీ మాళవిక తెలివిగా సమాధానాలు చెప్తుంది.

నువ్వు ఇది కావాలని చేస్తున్నావని వేద అంటుంది. ఎందుకు చేస్తాను ఎప్పుడు తప్పుగా చూస్తారు? ఈ మల్లెపూలు మీ ఆవిడ కోసం తెచ్చావని తెలియదు. ఇక్కడ ఉన్నది నేనో వేదని చూసుకోకుండా మల్లెపూలు పెట్టుకున్నది మీ ఆవిడ అనుకుని నన్ను పట్టుకుని తప్పు నువ్వు చేసి నన్ను అంటావ్ ఏంటని లాజిక్ గా మాట్లాడుతుంది. దీంతో యష్ వెళ్ళిపోతాడు.

వేద: నువ్వు కావాలని చేస్తున్నావ్. నువ్వు నీ కొడుకుతో మాట్లాడటం నేను విన్నాను. నీ కొడుకుతో కావాలని పెళ్లి ఫోటో పెట్టించావ్. తనని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నావ్. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఈ ఇంటి కోడలి స్థానం కోసం వచ్చావ్. నన్ను బయటకి గెంటేసి ఈ ఇంటి కోడలిగా అవడం కోసం వచ్చావు. అసలు ఇలాంటి పనికిమాలిన ఆలోచన నీకు వచ్చింది

మాళవిక: ఎందుకు వేద ఏదేదో మాట్లాడుతున్నావ్

Also Read: కావ్య మీద బెట్టుతో కూడిన ప్రేమ చూపించిన రాజ్- అప్పుని విడిపించిన కళ్యాణ్

వేద: నీ బుర్రలో ఉన్నదే మాట్లాడుతున్నా ఈ ఇంట్లో నిన్ను ఎవరూ నమ్మరు. నేను నిన్ను తీసుకొస్తే ఈ ఇంటికి వచ్చిన సంగతి మర్చిపోకు. నేను ఇప్పుడు చెప్తే చాలా నిన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారు

మాళవిక: నువ్వు పొరపాటు పడుతున్నావ్ నా గురించి తప్పుగా అనుకుంటున్నావ్. నన్ను నమ్ము అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. కాసేపటికి గట్టిగా నవ్వుతుంది. చెప్పేస్తాను అంటే భయపడతాను అనుకున్నావా? బెదిరిస్తే బెదిరిపోయేది కాదు ఈ మాళవిక. అవును నువ్వు అనుకున్నది నిజం నీ స్థానం కొట్టేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆపగలవా? నీ స్థానం నువ్వు కాపాడుకోగలవా

వేద: ఇప్పుడే వెళ్ళి నీ బండారం బయట పెడతాను

మాళవిక: వెళ్ళి చెప్పు.. నీ స్థానం మీద నీకు నమ్మకం లేనట్టే.. నేను కాంపిటీషన్ గా ఉన్నట్టు నువ్వు ఫీలవుతున్నట్టే. నువ్వు అనుకున్నా చెప్పలేవు. ఎందుకంటే నన్ను ఇంట్లో నుంచి బయటకి పంపించేస్తే నాతో పాటు ఆదిత్య కూడా వచ్చేస్తాడు. యష్ ని ఆదిత్యని విడదీస్తావా?నువ్వు అలా చేయలేవు ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి, మనసున్న దానివి. అవును ఇంతవరకు యష్ తన మనసులో మాట నీకు చెప్పలేదంట కదా.. ఆ మాట చెప్పేలోపు నిన్ను ఇంట్లో లేకుండా చేస్తాను. ఆదిత్య ఇక్కడ ఉండాలంటే నేను కూడా ఇక్కడే ఉండాలి. కాదు కూడదని నన్ను బయటకి పంపిస్తే వాడి ఆరోగ్యం ఏమవుతుందో అని కూడా చూడకుండా తీసుకుని వెళ్లిపోతాను

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Embed widget