Krishna Mukunda Murari August 31st: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!
మురారీ ప్రేమ తెలిసి కృష్ణ తిరిగి ఇంటికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
భవానీ కొడుకుతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణ ఇక నుంచి ఇది నా ఇల్లు అంతా పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంట్లో ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్కపెట్టాలని తింగరిదానిలా లెక్కపెట్టుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది. ముకుంద తనకి ఏం చూపిస్తుందోనని మురారీ కంగారు పడతాడు. గదిలో ముకుంద పెట్టిన ఫోటోస్ ఎలా తీసేయాలా అని ఆలోచిస్తాడు. కృష్ణ ఆ ఫోటోస్ చూస్తే ముకుందతో ప్రేమ విషయం తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ వెళ్లబోతాడు. సరిగ్గా అప్పుడే ముకుంద తనని వెళ్లనివ్వకుండా అడ్డం పడుతుంది. నీకోసం నేను పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటే నువ్వు కృష్ణ ప్రేమలో పడతావా అనుకుని నేరుగా కృష్ణ దగ్గరకి వెళ్తుంది. శ్రీనివాస్ ముకుందకి సంబంధించి అన్నీ విషయాలు తెలిసి కూడా ఏం చెప్పడం లేదు నువ్వే తన గురించి కనుక్కోమని భవానీ మురారీకి చెప్తుంది.
Also Read: ఇంద్రాదేవి ఆన్ ఫైర్, తలవంచిన కోడలు - కావ్య వ్రతం చేసుకోవడానికి అపర్ణ ఒప్పుకుంటుందా?
ముకుంద కృష్ణ దగ్గరకి వెళ్ళి ఎప్పటి నుంచో నీకోక ఫోటో చూపించాలని అనుకుంటున్నా సీక్రెట్ అంటూ కాసేపు ఊరిస్తుంది. లఢఖ్ లో దిగినవి చూపిస్తుందేమోనని మురారీ టెన్షన్ పడతాడు. నా మనసులో కృష్ణకి తప్ప ఎవరికీ స్థానం లేదు. నువ్వు ఇది మోసం అనుకున్నా నమ్మకద్రోహం అనుకున్నా సహిస్తాను అని మనసులో అనుకుంటాడు. కృష్ణ గదిలోకి వెళ్దామని మురారీతో అంటే ఇప్పుడెందుకని తిక్క తిక్కగా మాట్లాడతాడు. కృష్ణ మాత్రం గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని అనేసరికి గట్టిగా అరుస్తాడు. తనని గదికి వెళ్ళకుండా చేసేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముకుంద చూస్తుంది. లాభం లేదనుకుని కృష్ణ దగ్గరకి వెళ్ళి ఇంకొక సర్ ప్రైజ్ చూపిస్తానని ముకుంద అంటుంది. తన కళ్ళు మూసి మురారీ వాళ్ళ గదికి తీసుకుని వెళ్తుంది. మురారీ అడ్డుపడి ఆపేందుకు చూసినా కూడా ముకుంద ఆగకుండా తనని తీసుకుని వెళ్తుంది. గదిలోకి వెళ్ళి చూసి ముకుంద షాక్ అవుతుంది. మురారీ, ముకుంద లవ్ లైట్స్ ఫోటోస్ కాకుండా వెల్ కమ్ కృష్ణ అని బెలూన్స్ ఉంటాయి. ముకుంద రియాక్షన్ మారిపోయింది ఏంటని మురారీ కూడా వెళ్ళి చూసి ఊపిరి పీల్చుకుంటాడు. అది చూసి కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మురారీ: ముకుంద ఇందాక ఫోటో చూపించింది కదా ఎవరు ఆ అమ్మాయి
కృష్ణ: ఒకఅమ్మాయి అచ్చం నాకులాగే ఉంది. నేపాల్ లో ఉంటుందట
Also Read: సైకోలా మారుతున్న ముకుంద - కృష్ణతో యుద్ధం మొదలు, మురారీ పరిస్థితి ఏంటి?
వెల్ కమ్ కృష్ణ అని ఎవరు రాశారని మురారీ ఆలోచిస్తాడు. తన కోరిక నెరవేరిందని కృష్ణ వెనక్కి వచ్చినందుకు రేవతి దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటుంది. ఆదర్శ్ కూడా తిరిగి వచ్చి ముకుంద మనసు మారేలా చేయమని వేడుకుంటుంది. కృష్ణ మురారీకి ఇంజెక్షన్ చేసేందుకు తీసుకొస్తుంది. అది చూసి మురారీ భయంతో వెళ్లిపోబోతుంటే కృష్ణ ఆపుతుంది. తనకి ఇంజెక్షన్ అంటే భయమని వద్దని అంటాడు. ఎలాగైనా ఇంజెక్షన్ చేసి తీరుతానని కృష్ణ మురారీ వెంట పరుగులు పెడుతుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ ఎందుకు తిరిగి వచ్చింది. కృష్ణకి మురారీ ప్రేమ గురించి తెలిసిపోయిందా అని ముకుంద బాధపడుతుంది. అటు గదిలో మురారీ తను ఏబీసీడీ అబ్బాయి కాదని అంటాడు. తను కూడా తింగరి పిల్ల కాదని కృష్ణ అంటుంది. కాసేపు ఇద్దరి చూపులు కలుస్తాయి.