Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కొత్త ట్విస్ట్... కావ్య శ్రీ డబుల్ ధమాకా - తెల్ల చీరలో కాదు... తాట తీసే మోడ్రన్ పోరిలా
Kavya Shree Role In Chinni: 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'గువ్వ గోరింక' వంటి సీరియళ్లతో తెలుగులో పాపులరైన కావ్యశ్రీ నటిస్తున్న తాజా సీరియళ్లలో 'చిన్ని' ఒకటి. అందులో ఆవిడ డబుల్ ధమాకా ఇవ్వనుంది.
'స్టార్ మా'లో ప్రసారమవుతున్న డైలీ సీరియళ్లలో 'చిన్ని' (Chinni Serial) ఒకటి. సోమ నుంచి శని వారం వరకు ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఇప్పటికీ 165 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. సీరియల్ మేకర్స్ లేటెస్టుగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు రివీల్ చేశారు.
కావ్య డబుల్ ధమాకా... మోడ్రన్ పోరిలా!
Kavya Shree Role In Chinni Serail: చిన్ని సీరియల్ చూసే వీక్షకులు ఎవరికైనా సరే కథ మీద ఒక ఐడియా ఉంటుంది. ప్రోమోలు చూసినా సరే... ఎవరి క్యారెక్టర్లు ఏమిటి? అనేది కాస్త అర్థం అవుతుంది. ఈ సీరియల్ మెయిన్ హీరోయిన్ కావ్య శ్రీ. జైలుకు పరిమితమైన మహిళగా ఆమె స్క్రీన్ కనిపిస్తుంది. 'చిన్ని'కి తల్లిగా, ఎప్పుడూ తెల్ల చీరలో కనబడుతుంది. 'స్టార్ మా' చేసే ఈవెంట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ చూస్తే కావ్య శ్రీ మోడ్రన్ మహిళ అనేది తెలుస్తుంది. అయితే, ఇన్నాళ్లూ ఆవిడ కథానుగుణంగా జైలుకు పరిమితమైన రోల్ చేశారు. ఇప్పుడు ఆవిడకు మరొక రోల్ కూడా ఇచ్చారు.
'చిన్ని'లో కావ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. కావేరితో పాటు ఉష పాత్రలో కావ్య శ్రీ నటిస్తోంది. జనవరి 8న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో రెండో రోల్ గురించి రివీల్ చేస్తారా? లేదంటే మరొక రోజు వెయిట్ చేయిస్తారా? అనేది చూడాలి. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో కావ్య శ్రీ రెండో లుక్ రివీల్ చేశారు. ఆవిడ మోడ్రన్ పోరి రోల్ చేసినట్టు ఆ లుక్ చూస్తే ఈజీగా అర్థం అవుతోంది.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
కావేరి, ఉష క్యారెక్టర్స్ మధ్య సంబంధం ఏమిటి? జైల్లో ఉన్న తల్లికి బయట ఉన్న మోడ్రన్ పోరి ఎలా సపోర్ట్ చేస్తుంది? లేదంటే చిక్కుల్లో నెడుతుందా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
తెలుగులో పాపులరైన బెంగళూరు బ్యూటీ
కావ్య శ్రీ కన్నడిగ. ఆమెది బెంగళూరు. అయితే, సీరియల్స్ ద్వారా తెలుగులో కూడా పాపులర్ అయ్యింది. తెలుగులో 'గోరింటాకు' ఆమెకు తొలి సీరియల్. ఆ తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'గువ్వ గోరింక' వంటి సీరియల్స్ చేశారు. నటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య శ్రీ... పర్సనల్ లైఫ్ కూడా అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటోంది. అందుకు కారణం సీరియల్ నటుడు, 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్. అతనితో కావ్య శ్రీ ప్రేమలో ఉందని తొలుత వినిపించేది. ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నట్టు ఇద్దరూ చెప్పలేదు. కానీ, నిఖిల్ 'బిగ్ బాస్'కు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అర్థమైంది.
ఇటీవల స్టార్ మా షోస్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లోనూ నిఖిల్, కావ్య శ్రీ ప్రవర్తన చూస్తే ఇద్దరి మధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవని అనిపిస్తుంది. కావ్య శ్రీ తాజాగా నిజ జీవితంలో విలన్‌ను చూస్తున్నానని చెప్పడం కూడా వైరల్ అయ్యింది.