Nikhil and Kavya Relationship: రియల్ లైఫ్‌లో అతి పెద్ద విలన్... కావ్య మాస్ కౌంటర్ బ్రేకప్ చెప్పిన నిఖిల్‌కేనా?
Kavya and Nikhil : తాజాగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ప్రోమోలో వేసిన పంచ్ వైరల్ గా మారింది. అది నిఖిల్ ను ఉద్దేశించి కావ్య వేసిన కౌంటర్ అని ప్రచారం జరుగుతోంది.
బుల్లితెర కపుల్ నిఖిల్, కావ్యలు విడిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కావ్య "జీవితంలో అంతకంటే పెద్ద విలన్ నే చూసాను" అంటూ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రెండేళ్లల్లో పెళ్లి
నిఖిల్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత తనకు బ్రేకప్ అయ్యిందన్న విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అతను బిగ్ బాస్ విన్నర్ కావాలని మాత్రమే కాదు కావ్యతో కలవాలని కూడా ఎంతోమంది కోరుకున్నారు. అయితే ఎట్టకేలకు శ్రీముఖి అలా కోరుకున్న వారి కోరికను నెరవేర్చింది. ఈ జంట 'స్టార్ మా'లో ప్రసారమవుతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే షోకి హాజరైంది. బిగ్ బాస్ పరివారం వర్సెస్ మా పరివారం అనే ఎపిసోడ్ లో కావ్య, నిఖిల్ ఒకరికొకరు ఎదురు పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎపిసోడ్ లోనే మరో రెండళ్లలో పెళ్లి చేసుకోబోతున్నాను అని నిఖిల్ ప్రకటించియా షాక్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగిందే తప్ప తగ్గలేదని టాక్ నడిచింది. తాజాగా మరోసారి ఇదే షోలో కావ్య 'రియల్ లైఫ్ లోనే పెద్ద విలన్లను చూస్తున్నాను" అంటూ చేసిన కామెంట్స్ నిఖిల్ ను ఉద్దేశించే అనే ప్రచారం జరుగుతోంది.
ఆ సెటైల్ నిఖిల్ పైనేనా?
తాజాగా రిలీజ్ చేసిన ' ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఎపిసోడ్ లో కావ్య మెరిసింది. 'విలన్స్ వర్సెస్ హీరోయిన్స్' అనే ఎపిసోడ్ లో శ్రీముఖి కావ్యను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసింది. "సీరియల్స్ లో లేడీ విలన్లను చూసినప్పుడు... ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తున్నారు? చంపేద్దాం అన్నంత కోపం వచ్చిందా ఎప్పుడైనా ?" అని కావ్యని అడిగింది. దీనికి కావ్య స్పందిస్తూ "రియల్ లైఫ్ లోనే చాలామంది విలన్లని చూస్తున్నాను. వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళు పెద్ద లెక్క కాదు" అంటూ మాస్ రిప్లై ఇచ్చింది. ఇటీవల కాలంలో కావ్య ఏం మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.
ఇదిలా ఉండగా నిఖిల్, కావ్య ఇద్దరి మధ్య ఏడేళ్లుగా నడుస్తున్న ప్రేమాయణం కొన్నాళ్ల క్రితం బ్రేకప్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నిఖిల్ బ్రేకప్ అయ్యిందని, ఇప్పుడు సింగిల్ అని చెప్పేసి వెళ్ళాడు. ముందుగా అతను సోనియాతో, ఆ తర్వాత యష్మితో లవ్ ట్రాక్ లను నడిపాడు అనే ట్రోలింగ్ నడిచింది. కానీ గేమ్ చివరికి వచ్చేసరికి మాత్రం జన్మజన్మలకు కావ్య తన భార్య అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో అవ్వగానే కావ్య దగ్గరకు వెళ్తానని అన్న నిఖిల్... విన్నర్ అయ్యాక అదే ప్రశ్న అడిగితే.. "ఆమెను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రిలేషన్ నిలబడాలంటే అవతలి వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. ఆమె హర్ట్ అవ్వడానికి కారణం ఏంటో... ఆట మొత్తం చూస్తే తెలిసి ఉండేది. ప్రోమోలో హైలెట్స్ చూస్తే ఇలాగే ఉంటుంది" అంటూ ప్లేట్ తిప్పేసాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి గురించి ఎలాంటి వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.