Ganesh Master: ప్రభాస్ కజిన్ సినిమాతో డైరెక్షన్, ఒసేయ్ రాములమ్మ సెట్‌లో అవమానం, పవన్ గురించి... గణేష్ మాస్టర్ ఇంటర్వ్యూ
Choreographer Ganesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ తాజాగా బుల్లితెర సెలబ్రిటీ టాక్ షో 'చిట్ చాట్' సిరీస్ లో ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.
టాలీవుడ్ లో ఉన్న పాపులర్ కొరియోగ్రాఫర్లలో గణేష్ మాస్టర్ కూడా ఒకరు. 'ఢీ' షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎంతోమంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇక రీసెంట్ గా ఆయన డైరెక్టర్ గా కూడా మారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సెలబ్రిటీ టాక్ షో 'చిట్ చాట్ సిరీస్'కి పాల్గొన్నారు గణేష్ మాస్టర్. ఈ సందర్భంగా ఆయన తనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
మెదక్ నుంచి వచ్చిన మీరు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఎలా అయ్యారు?
గణేష్ మాస్టర్: ముందుగా నేను దేవుడికి, మెదక్ ప్రజలకు థాంక్స్ చెప్పాలి. నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే... సెవెంత్, ఎయిత్ క్లాస్ నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. కానీ అందరి మధ్య డ్యాన్స్ చేయాలంటే మాత్రం సిగ్గు. అయితే ఇంట్లో డాన్స్ చేద్దామంటే గోడపై ఒక చిన్న అద్దం ఉండేది. అందులో తల ఒక్కటే కనిపించేది. బాడీ కనిపించాలి. కాబట్టి ఎలా అని ఆలోచించి, ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లైట్ కింద డాన్స్ చేశాను. అలా అందరూ లైట్ కింద చదువుకుంటే, నేను లైట్ కింద డాన్స్ చేశాను. ఈ రోజు అదే ప్రొఫెషన్ గా మారింది. 'ఢీ 2' విన్నర్ అయ్యాను, అలాగే 'ఢీ' షోకి జడ్జిగా కూడా చేస్తున్నాను.
మీరు సైడ్ డాన్సర్ గా చేయడానికి దాసరి నారాయణరావు హెల్ప్ చేశారంట. అది నిజమేనా?
గణేష్ మాస్టర్: అవును. ఫస్ట్ నేను ఎఫ్డీసీలో ట్రైన్ అయ్యాను. అక్కడ అప్పుడే తెలుగుఇండస్ట్రీ తమిళ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఆ టైంలో ఇక్కడ డాన్స్ మాస్టర్లను డెవలప్ చేయాలని దాసరి గారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అక్కడ అందరికీ టెస్ట్ పెట్టి, ఎఫ్డీసీలో ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. సార్ బ్లెస్సింగ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసాము. ఆయన బ్లెస్సింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి, ఇకముందు కూడా ఉంటాయని అనుకుంటున్నా.
గణేష్ మాస్టర్ ఎప్పుడైనా ఇన్సల్ట్ అయ్యారా?
గణేష్ మాస్టర్: 'ఒసేయ్ రాములమ్మ' సినిమాలో చిన్న చిన్నవి చాలా జరిగాయి. కానీ దాసరి గారు మా అందరికీ కొండంత బలాన్ని ఇచ్చి, బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను.
మీరు లైఫ్ లో అంతా మనమంచికే అనుకున్న సందర్భాలు ఏంటి?
గణేష్ మాస్టర్: అంటే కొన్నిసార్లు మనకు సాంగ్స్ వస్తాయి. సడన్ గా మీరు కాదు వేరే వాళ్ళు చేస్తారు అని చెప్తారు. అప్పుడు అనిపిస్తది అంతా మనమంచికే అని.
మీ డైరెక్షన్లో ఒక మూవీ చేయబోతున్నారు అని విన్నాము. అది నిజమేనా?
గణేష్ మాస్టర్: అవును నిజమే. సినిమా పేరు 'గౌడ్ సాబ్'. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంత దాకా నన్ను డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎంకరేజ్ చేసిన మీరు దర్శకుడిగా కూడా బ్లెస్సింగ్స్ అందించాలి. ఎక్కడా డిజప్పాయింట్ చేయను. హీరో ప్రభాస్ కజిన్ విరాట్ రాజు.
కొంతమంది హీరోల గురించి మీ మాటల్లో...
గణేష్ మాస్టర్: రామ్ పోతినేని - రెడీ, ప్రభాస్ - బాహుబలి, అల్లు అర్జున్ - నేషనల్ కాదు ఇంటర్నేషనల్, పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్.
ఛాలెంజింగ్ అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా?
గణేష్ మాస్టర్: పవన్ కళ్యాణ్ పాటలు ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. ఆయన పెద్ద స్టార్ కాబట్టి ఒక్కో షాట్ చాలా బాగా తీయాలి కాబట్టి అలాగనిపిస్తుంది. స్పెషల్ థాంక్స్ టు పవన్ కళ్యాణ్.
ఈ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ రాలేదే అని అనుకున్న స్టార్ హీరో ఎవరు?
గణేష్ మాస్టర్: చిరంజీవి సార్ తో ఉండేది. 'వాల్తేరు వీరయ్య'లో ఇంట్రడక్షన్ బిల్డప్ చేశాను. త్వరలోనే ఆయనతో సాంగ్ చేసే అవకాశం రావాలని కోరుతున్నాను.
గణేష్ మాస్టర్ సాంగ్ షూటింగ్ అంటే బాయ్స్ ని ఎక్కువ మందిని పెడతారని అంటారు. ఎందుకు?
గణేష్ మాస్టర్: అది సాంగ్, కాన్సెప్ట్, డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది. సాంగ్ డిమాండ్ చేస్తుంది కాబట్టే పెడతాను. లేదంటే ప్రొడ్యూసర్స్ ఒప్పుకోరు కదా.
కొరియోగ్రాఫర్లను తో మీ సాన్నిహిత్యం...
గణేష్ మాస్టర్ : భాను మాస్టర్ - ఎవ్రీథింగ్, శేఖర్ మాస్టర్ - బ్రదర్, బాబా మాస్టర్ - ఫన్నీయస్ట్ బ్రదర్, జానీ మాస్టర్ - స్మాల్ బ్రదర్, ప్రభుదేవా - గురూజీ.
చివరగా ఎంతమంది హీరోయిన్ల పేర్లు చెప్పినా రష్మిక మందన్న అంటేనే ఇష్టమని చెప్పారు.