IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Karthika Deepam మే 12 ఎపిసోడ్: సౌందర్య కు షాకిచ్చిన హిమ, ఆనందంలో ప్రేమ్, మరి జ్వాల పరిస్థితేంటి

శౌర్యకి నిజం చెబుదాం అనుకున్న హిమ..రెస్టారెంట్ నుంచి చెప్పకుండా వెళ్లిపోతుంది. ఓ వైపు జ్వాల డాక్టర్ సాబ్ ఆలోచనల్లో మునిగితేలుతుంటే... అటు ప్రేమ్ మాత్రం హిమని మిస్సయ్యానని బాధపడుతుంటాడు...

FOLLOW US: 

కార్తీకదీపం మే 12 గురువారం ఎపిసోడ్

 హిమ-జ్వాల: షాపింగ్‌కి వెళ్లిన సౌర్య(జ్వాల), హిమలు.. ఐస్‌క్రీమ్ కార్నర్‌కి వెళ్తారు. అక్కడ కూర్చుని ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇస్తారు. అయితే హిమ మనసులో.. ‘ఇప్పుడు నీకు నేనే హిమని అని చెప్పేస్తాను సౌర్యా..  అని నిర్ణయించుకుంటుంది. నీరో ముఖ్యమైన విషయం చెప్పాలని హిమ అంటే..నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని జ్వాల అంటుంది (. ‘డాక్టర్ సాబ్ గురించి ఈ తింగరికి చెబితే ఎలా ఉంటుంది. మన తింగరే కదా.. చెబుతాను.. నేను డాక్టర్ సాబ్‌ని ప్రేమిస్తున్నానని చెబుతాను.. అప్పుడు ఏదైనా సలహా ఇస్తుందేమో కదా మనసులో అనుకుంటుంది). ఇంతలో ఐస్ క్రీమ్ వస్తుంది. తింటూ తింటూ జ్వాల తన డ్రెస్ మీద చూసుకోకుండా ఐస్‌క్రీమ్ పడేసుకుంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాష్ రూమ్‌కి వెళ్తుంది. తిరిగి వచ్చేసరికి హిమ ఉండదు. ‘హేయ్ బాబు.. మా తింగరి ఎక్కడా?’ అని అడుగుతుంది జ్వాల అక్కడ పనిచేసే వ్యక్తిని. ‘బిల్ కట్టేసి వెళ్లిపోయారు మేడమ్’ అంటాడు అతడు. ‘అదేంటి.. ఏదో చెబుతాను అంది.. నేను చెబుదాం అనుకున్నాను.. సరేలే డాక్టర్ కదా ఏదో అర్జెంట్ కాల్ వచ్చి ఉంటుంది..’ అనుకుంటూ తను షాపింగ్ చేసిన బ్యాగ్స్ తీసుకుని ఇంటికి వెళ్తుంది.

ఇక ప్రేమ్ తన ఫోన్‌లో హిమ ఫొటోస్ డిలీట్ చేస్తూ.. ‘అమ్మమ్మా నా జీవితంలో నిప్పులు పోశావ్ కదా.. నాకు ఫోటోగ్రఫీ కన్నా హిమంటేనే ఎక్కువ ఇష్టం.. కానీ ఇప్పుడు నువ్వు అంతా తారుమారు చేసేశావ్.. ఎందుకు అమ్మమ్మా ఇలా చేశావ్..’ అని బాధపడతాడు.  ఇంతలో సత్య వచ్చి.. ‘రేయ్ ప్రేమ్.. హిమ, నిరుపమ్‌లకు నిశ్చితార్థం ఉంగరాలు తీసుకుందాం రారా’ అంటాడు. ‘మీరు వెళ్లండి డాడీ.. నేను రాలేను’ అని తండ్రిని పంపించేస్తాడు ప్రేమ్.

జ్వాల: తన షాపింగ్ చేసిన బ్యాగ్‌లోంచి ఒక చీర తీసి తన మీద వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోతూ.. ‘ఈ చీర నాకు డాక్టర్ సాబ్ కొనమన్నాడట.. డాక్టర్ సాబ్‌ని నేనంటే ఎంత ప్రేమో.. అయినా తనకు సిగ్గు కూడా ఎక్కువే.. అంత మొహమాటం అయితే ఎలాగోయ్ డాక్టర్ సాబ్..’ అని మురిసిపోతుంది. 
అదే టైమ్‌కి హిమకు సౌందర్య కోను పెడుతూ ఉంటుంది. అప్పుడే హిమ సౌందర్యతో.. ‘నాన్నమ్మా నేనొకటి అడగొచ్చా?’ అంటుంది. 
సౌందర్య: నువ్వు ఏం అడుగుతావో నేను చెప్పనా? సౌర్య వచ్చేదాకా పెళ్లి చేసుకోను అన్నా కదా? మరి ఇప్పుడు ఎందుకు నిశ్చితార్థం చేయిస్తున్నావ్? అనే కదా నీ ప్రశ్న.. మీ స్వప్న అత్తయ్యని లాక్ చేయడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు హిమా.. అందుకే ఇలా చేస్తున్నాను.. నేను నీకు మాటిస్తున్నాను హిమా.. నువ్వు కోరుకున్నట్లే నీ పెళ్లికి సౌర్య ఉంటుంది. సౌర్యని నేను వెతికి తీసుకొస్తాను’ 
ఇంతలో చైత్య(నిరుపమ్‌కి రాఖీ కట్టిన స్వప్న స్నేహితురాలి కూతురు) వస్తుంది. ‘వచ్చావా.. రా అమ్మా.. మీ వదినకి కోను పెట్టు.. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ కోను చైత్రకు ఇచ్చి సౌందర్య వెళ్తుంది.
అప్పుడే చైత్ర.. హిమతో పరిచయం చేసుకుంటుంది. ఆ రోజు స్వప్న ఏర్పాటు చేసిన పెళ్లి చూపులు గురించి,తను నిరుపమ్‌కి రాఖీ కట్టిన విషయం గురించి చెబుతూ కోను పెడుతూ ఉంటుంది 
 సౌందర్య: పరిచయాలు అయిపోయాయా అంటూ రావడంతో అప్పటికే నిజం తెలిసి ఎమోషనల్ అవుతున్న హిమ పరుగున వెళ్లి.. సౌందర్యని హత్తుకుని.. ఏడుస్తుంది. సౌందర్యకు ఏం అర్థం కాదు. ‘పెళ్లి అయ్యాక మాకు దూరంగా వెళ్తాను అని భయపడుతున్నావా..? నిరుపమ్ నువ్వు మాతో ఉంటారు’ అంటూ ధైర్యం చెబుతుంది సౌందర్య.
హిమ మనసులో: . ‘నాన్నమ్మా నన్ను బావని కలపడానికి స్వప్న అత్తయ్యతో ఇంతగా పోరాడావా? మా గురించి ఇంతగా తపన పడ్డావా? నా కోసం ఇంత చేశావా నాన్నమ్మా’ అని అనుకుంటూ ఏడ్చేస్తుంది.

ఇక మరునాడు ఉదయాన్నే ఒకామెని ఆటో ఎక్కించుకుని.. తీసుకుని వెళ్తూ ఉంటుంది జ్వాల. అయితే ఆటోలో వెనుక కూర్చున్న ఆమె.. జ్వాలను ప్రశ్నలతో చంపేస్తుంది. ‘అవును అమ్మాయి.. నువ్వు ఆటో నడుపుతున్నావ్ ఏంటీ..? సాధారణంగా అమ్మాయిలు ఇలా ఆటో నడుపుతూ కనిపించరు కదా? రేపు నీకు పెళ్లి అయ్యాక మీ ఆయన ఒప్పుకుంటాడా? ఒక పని చెయ్యి అమ్మాయి.. నువ్వు కూడా మరో ఆటో డ్రైవర్‌ని పెళ్లి చేసుకో.. అంతా చక్కగా ఉంటుంది..’ అంటుంది. ఎప్పుడైతే ఆమె ఆటో డ్రైవర్‌ని పెళ్లి చేసుకో అందో అప్పుడే జ్వాలకు కాలిపోతుంది. ఆటో ఆపేసి.. దిగవమ్మా దిగు అంటుంది. ఆమె దిగగానే.. తన ఫోన్‌లోని నిరుపమ్ ఫొటో ఆమెకి చూపించి.. ‘చూడు.. ఇతడే నాకు కాబోయే మొగుడు.. ఎంత అందంగా ఉన్నాడో చూడు.. ఈ ఫోన్ ఆయనే కొనిచ్చాడు.. ఇదిగో ఈ ఆటో కూడా ఆయనే కొన్నాడు. కొంచెం ఆలోచనలైనా మార్చుకోరా మీరు? ఆలోచనలు ఫ్రీనే కదా..? ఆటో వాళ్లు ఆటో వాళ్లనే చేసుకోవాలా..?’ అంటూ క్లాస్ పీకుతుంది.

రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
హిమ-నిరుపమ్ నిశ్చితార్థం అవుతుంటుంది....ఇంతలో గుడిలోకి శౌర్య రావడం చూసిన హిమ...నాకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పేసి వెళ్లిపోతుంది. అక్కడున్నవారంతా అవాక్కవుతారు....

Published at : 12 May 2022 09:59 AM (IST) Tags: Manas Nagulapalli karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar keerthi Karthika Deepam 12th May Episode 1350

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

CM KCR Appriciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Appriciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం

MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్