Karthika Deepam 2 Serial Today June 22nd: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు నిజం చెప్పేసిన కార్తీక్.. నర్శింహ మాటలకు కుప్పకూలిపోయిన దీప శౌర్యని ఇచ్చేస్తుందా!
Karthika Deepam 2 Serial Today Episode దీప తండ్రికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో దానికి కార్తీక్ ఎలా కారణం అయ్యాడో దీపకు కార్తీక్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode నర్శింహ దీపతో తన బిడ్డను తనకు ఇచ్చేయ్‌మని అంటాడు. బలవంతం ఏమీ లేదు అని శౌర్య తన కూతురు అయితేనే ఇవ్వమని లేదంటే వద్దని అంటాడు. పాపని తనకు ఇచ్చేస్తే ఇక జీవితంలో నీ జోలికి రాను అని నువ్వు ఎవరితో తిరిగినా నాకు నష్టం లేదు అని దీపతో అంటాడు.
నర్శింహ: నిన్ను ఇలా నిలబెట్టి సమాధానం చెప్పమంటే పాపం కదా దీప. అంత పాపం నేను చేయలేను. నువ్వు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్పు. మన ఇద్దరి జీవితాలకు నువ్వు చెప్పే సమాధానమే ముగింపు. నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయ్. నాకు పుట్టలేదు అంటే నీతోనే ఉంచుకో. బాగా ఆలోచించి చెప్పు దీప. నర్శింహ మాటలకు దీప చాలా ఏడుస్తుంది.
జ్యోత్స్న ఫోన్‌లో బిజీగా ఉంటే సుమిత్ర ఫోన్ తీసుకొని బలవంతంగా జ్యూస్ తాగిస్తుంది. సుమిత్ర కార్తీక్‌కి కాల్ చేసి ఇంటికి రావడం లేదు అని ఏరా అని అడిగితే నేను జ్యోత్స్న తరచుగా కలుస్తున్నాం అని నీ గురించి అడుగుతున్నానని చెప్పాడని చెప్తుంది సుమిత్ర. ఇక సుమిత్ర పారిజాతంతో పిల్లలకు కాస్త దూరంగా ఉండండని.. వాళ్ల మధ్య గొడవలు పెట్టొద్దని అంటుంది. దాంతో పారిజాతం వాళ్లిద్దరికీ పెళ్లి అవ్వాలి అని మీ అందరి కంటే ఎక్కువ కోరుకునేది నేను అని చెప్తుంది. జ్యోత్స్న పెద్దగా నవ్వుతుంది. శ్రీధర్ కావేరి ఇంటికి బయల్దేరుతాడు. ఇక కాంచనకు ఫీవర్ వచ్చిందని కార్తీక్ చెప్తాడు. శ్రీధర్ అతి జాగ్రత్త ప్రదర్శిస్తాడు. ఇంతలో కావేరి కాల్ చేస్తుంటుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్దామని కార్తీక్ అంటే శ్రీధర్ వద్దు అనేస్తాడు.
కార్తీక్: నాన్న నువ్వేంటి బ్రీఫ్‌కేస్ పట్టుకొని ఎక్కడికో బయల్దేరావు.
శ్రీధర్: ఆఫీస్ పని మీద క్యాంప్‌కి వెళ్తున్నా. అమ్మకి బాలేదు కదా మానేస్తాను.
కార్తీక్: మంచి నిర్ణయం నాన్న.
కాంచన: ఏంటిరా నాకు బాగానే ఉంది కదా ఏవండీ మీరు వెళ్లండి.
శ్రీధర్: మనసులో.. నువ్వు ఇలా అంటావ్ అని తెలిసే రివర్స్ గేమ్ ఆడాను. వెళ్లకపోతే కావేరి చంపేయదు.
కాంచన: ఏంటి అలాగే చూస్తున్నారు మీరు క్యాంప్‌నకు వెళ్లండి.
నర్శింహ మాటలు తలచుకొని దీప రోడ్డు మీద నడుస్తుంటుంది. ఇంతలో దీప ఓ కారుకి ఎదురెళ్తుంది. కారు ఆయన వచ్చి దీపని తిడతాడు. ఇంతలో కార్తీక్ వెనకాలే వచ్చి ఆ కారు డ్రైవర్‌ని తిడతాడు.
కార్తీక్: ఒకప్పుడు మనం ఎదుర్కొన్న సమస్య మన కళ్ల ముందు ఇంకొకరికి జరిగినప్పుడు వాళ్లకి అర్థమయ్యేలా చెప్పడం చాలా తేలికవుతుంది.
దీప: ఎవరి గురించి మీరు చెప్తున్నది.
కార్తీక్: మీ నాన్న గురించి. ఏం జరిగిందో చెప్పడానికి నాకు ఇంత కంటే మంచి సమయం లేదు. నువ్వు నిజం తెలుసుకోవాలి.
దీప: నాకు వినాల్సిన అవసరం లేదు.
కార్తీక్: మీ నాన్న గారి చావుకి కారణం నేను కాదు. ఈ రోజు నీ స్థానంలో మీ నాన్న గారు ఉన్నారు. ఆ కారు స్థానంలో నేను ఉన్నాను. కానీ జరిగింది చెప్పడానికి ఇక్కడ నేను ఉన్నట్లు ఆ రోజు ఎవరూ లేరు. అందరూ నువ్వు అపార్థం చేసుకున్నట్లు చేశారు. నాకు రెండు రోజుల్లో లండన్ వెళ్లాల్సి ఉండే నా ఫ్రెండ్స్‌తో కలిసి మేం ఎంజాయ్ చేస్తున్నాం.
దీప తండ్రి బండిలో వచ్చి కార్తీక్ వాళ్ల కారుకి ఢీ కొట్టేస్తాడు. డైవింగ్ ప్లేస్‌లో కార్తీక్ ఫ్రెండ్ ఉంటారు. కార్తీక్ దీప తండ్రి దగ్గరకు వెళ్లి పట్టుకుంటాడు. ఆయన తప్పు అయిపోయింది నేనే చూసుకోలేదు అని కార్తీక్‌తో చెప్తాడు. దీపమ్మ అంటూనే చనిపోతాడు. ఇక దీప అక్కడికి వస్తుంది. అందరూ కార్తీక్‌నే గుద్దేసి చంపేశాడు అని అంటారు. దీప కార్తీక్ తప్పు చేశాడని అనుకుంటుంది.
కార్తీక్: నాన్న అన్న మీ అరుపులు నాకు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మీ గురించి ఎంక్వైరీ చేశాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూసి మీ తప్పు లేదు మీరు వెళ్లండి అని అన్నారు. తర్వాత నా లండన్ ప్రయాణం. ఓ ప్రాణం పోవడానికి నేను కారణం కాదు కానీ నింద బాధ నాకు వచ్చింది. మీరు అక్కడికి కాస్త ముందు వచ్చి ఉంటే నా తప్పు లేదు అని మీ నాన్న చెప్పిన మాటలు మీకు వినిఉండేవారు. నేను చేయని తప్పునకు ఓ మనిషి దృష్టిలో దోషిలా మిగిలిపోయాను. ఓ మనిషి చావుని అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ నాది కాదు. శిక్షించడం కంటే క్షమించకపోవడం పెద్ద శిక్ష దీప. ఇప్పటికైనా క్షమిస్తారు అని ఆశిస్తున్నాను. అవును శౌర్య అని గట్టిగా అరిచారు ఏమైంది.
దీప: నేను ఇంటికి వెళ్లాలి బాబు.
కార్తీక్: నేను అటే వెళ్తున్నా పదండి. దింపేస్తా.
దీప కార్తీక్‌లు కారులో ఇంటికి బయల్దేరుతారు. దీప కారులో ఏడుస్తుంటుంది. మరోవైపు జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటారు. నీ కోసం మాటలు పడుతున్నాను అని పారిజాతం అంటుంది. ఇంట్లో రెండు వర్గాలు ఉన్నాయని ఒకటి తనకి సపోర్ట్ చేస్తే ఇంకొక వర్గం దీపకు సపోర్ట్ చేస్తుందని అంటుంది. ఇక జ్యోత్స్న కార్తీక్ ఎవరికి సపోర్ట్ చేస్తాడని పారిజాతానికి జ్యో అడుతుంది. దానికి పారిజాతం దీపకే సపోర్ట్ చేస్తాడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ కుడి చేతి నుంచి విపరీతమైన మసి.. నయనికి నిజం చెప్పిన హర్ష!