Karthika Deepam 2 Serial Today April 4th: కార్తీకదీపం 2 సీరియల్: చంపేస్తావా అని కార్తీక్‌ను ప్రశ్నించిన దీప.. సౌర్యకు తాను అమ్మమ్మ అని చెప్పిన సుమిత్ర, నిజం తెలిసిపోయిందా..!
Karthika Deepam 2 Serial Today April 4th Episode నరసింహ చేసిన మోసం తలచుకుంటూ వస్తున్న దీపని కార్తీక్ కారుతో ఎదురు రావడంతో దీప చీవాట్లు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపతో నరసింహ దారుణంగా మాట్లాడుతాడు. అప్పులోళ్లతో ఏం సంబంధం లేదు అని చెప్పమంటాడు. తనకు దీప మీద మోజు పుట్టినప్పుడు ఒక రాత్రి వచ్చి పోతాను అంటాడు. నరసింహ మాటలకు అతడి రెండో భార్య శోభ షాక్ అయిపోతుంది. నరసింహ దీపని ఉంచుకున్నదానివి అని అంటాడు.
దీప: ఈ మాట అన్నందుకు నువ్వు నా మొగుడివి కాబట్టి వదిలేశాను. అదే ఇంకొకడు అయింటే చెప్పు తీసి కట్టేదాన్ని. నువ్వు నన్ను వదులుకున్నా నేను నిన్ను వదులుకోలేనురా. బతిమాలో బామాలో నిన్ను ఇంటికి తీసుకుపోయి మళ్లీ నా సంసారాన్ని చక్కదిద్దుకోవాలి అనుకున్నాను. అంతా నాశనం చేసేశావు. బయల్దేరేటప్పుడు ఎన్ని భయాలు ఉన్నాయో అన్నే ఆశలతో వచ్చానురా. అన్నీ చంపేశావు. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఏడమ్మ అని నా బిడ్డ అడుగుతుంటే వస్తాడమ్మా అనే చెప్తున్నే. పొద్దున్నుంటి ఎండల పడి తిరుగుతున్నా అది అన్నమో నీరో అడగలేదు నాన్న ఏడమ్మా అని అడుగుతుంది. దానికి నాన్న అంటే అంత పిచ్చి. నాన్న ఏదో చాలా గొప్పగా ఉంటావని ఊహించుకుంది ఇంత నీచుడివని దానికి తెలీదు. మనిషి విలువ తెలిసిన నీ లాంటి వాడి కోసం కన్నీళ్లు కార్చడం వేస్ట్. ఇన్నాళ్లు నా కూతురు తండ్రి లేకుండా బతికింది. ఇకపై కూడా అలాగే బతుకుతుంది. ఇక నుంచి నా కూతురికి తల్లి, తండ్రి అన్నీ నేనే. నిన్ను నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావ్ ఇక సెలవు.
సౌర్య: అమ్మా నాన్న ఎక్కడ..
దీప: లేడు..
సౌర్య: అంటే..
దీప: అదే అమ్మా ఇక్కడ లేడు.
దీపతో ఆ తప్పు చేసింది నేను కాదు అని కార్తీక్ చెప్పినప్పుడు ఓ యాక్సిడెంట్ చూపించారు. ఆ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి మెడలో కండువా వేసి ఉంటారు. దీని బట్ట కార్తీక్ దీప తండ్రిని యాక్సిడెంట్ చేసి ఉంటాడు. కార్తీక్ కారులో బయటకు వెళ్తూ ఆ యాక్సిడెంట్ తలచుకొని అతనికి ఇన్సూరెన్స్ ఉందో లేదో అని అనుకుంటాడు.
కార్తీక్: దీపని చూస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు దీప నాకు మళ్లీ కనిపించకపోయి ఉంటే ఇదంతా నాకు గుర్తొచ్చేదే కాదేమో. నేను ముత్యాలమ్మ ఊరు వెళ్లగానే ముందు దీపని కలవాలి. జరిగింది తనకు చెప్పి ఆ కుటుంబానికి సాయం చేయాలి.
దీప నరసింహ అతని రెండో భార్య అనసూయ అన్నమాటలు తలచుకొని బాధ పడుతుంది. తండ్రి గురించి అడుగుతున్న సౌర్యకు ఏం సమాధానం చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ కారు వచ్చి దీప, సౌర్యను గుద్దేయబోతుంది. దీప తిట్టబోయి కార్తీక్‌ను చూసి ఆగిపోతుంది. కార్తీక్ కూడా షాక్ అవుతాడు.
దీప: ఎవర్నీ బతకనివ్వవా.. జనాల్ని చంపుకుంటూ పోతావా. మమల్ని ఇలా అయినా బతకనివ్వండి. అని బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది.
కార్తీక్: నేను కారులో తిరుగుతుంటే శని నా నెత్తిమీద తిరుగుతుంది. ఏ మనిషి కోసం అయితే తిరుగుతున్నానో ఆ మనిషిని మరోసారి బాధపెట్టాను. ఇంతకు ముందు అయితే నేరం చేసినట్లు చూసింది. ఇప్పుడు అసలు మనిషిగానే చూడదు. అసలు దీప సీటీకి ఎందుకు వచ్చింది. ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా. చూస్తే బతకలేక వచ్చినట్లు ఉంది. ఇప్పుడు తన జీవితాన్ని ఎలా బాగుచేయాలి.
మరోవైపు జ్యోత్స్న తల్లి సుమిత్ర 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కుతీర్చుకుంటుంది. ఇక సౌర్య కార్తీక్‌ను గుర్తుపడుతుంది. జాతరలో సైకిల్ ఇచ్చారని అంటుంది. మనం తెలిసి కూడా తను మాట్లాడటం లేదు బ్యాడ్ అని అంటుంది. ఇక దీప సౌర్యని పొద్దున్నుంచి తిరుగుతున్నావ్ ఆకలి వేయడం లేదా అని అడుతుంది. దానికి సౌర్య ఆకలి వేస్తుంది కానీ నాన్నతో కలిసి తింటాను అంటుంది. మరోవైపు సుమిత్ర గుడిలో అన్నదానం చేయిస్తుంది. తన చేతితో అన్నం వడ్డిస్తుంది. ఇక దీప కూడా అదే గుడి దగ్గరకు వచ్చి అన్నదానం అని రాసి ఉండటం చూసి హొటల్‌లో అయితే ఎక్కువ బిల్ అవుతుంది అని అన్నదానం దగ్గరకు వస్తుంది.
దీప సుమిత్రను చూసి ఈ మనిషిని ఎక్కడో చూసినట్లు ఉందని అనుకుంటుంది. సుమిత్ర కూడా దీపను చూసి దీప దగ్గరకు వెళ్తుంది. భోజనానికి పిలుస్తుంది. కన్నతల్లి అని తెలియకపోయిన దీప మిమల్ని ఎక్కడో చూసినట్లు ఉందని అంటుంది. ఇక అక్కడ కూర్చొవడానికి ప్లేస్ లేకపోవడంతో తమ కోసం ప్రత్యేకంగా వేసిన స్థానంలో సుమిత్ర కన్నకూతురు దీపని కూర్చపెడుతుంది. దీపని కూర్చొవడానికి చేయి పట్టుకొని సుమిత్ర ఎమోషనల్‌గా ఫీలవుతుంది. దగ్గరుండి ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. సౌర్యతో తాను అమ్మమ్మ అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: తాప్సి: ఎట్టకేలకు బయటకొచ్చిన తాప్సి పెళ్లి వీడియో - సోషల్ మీడియాలో వైరల్