Karthika Deepam 2 Serial Today November 28th: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర, దశరథ్‌ల కూతురే దీప అని తెలుసుకున్న దాసు.. తన గోతిని తానే తవ్వుకున్న జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Today Episode కుభేర్ తీసుకొచ్చిన వారసురాలు దీపనే అని జ్యోత్స్న గుర్తు పట్టిన ఫొటో ద్వారా దాసు తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీప కొంగు పట్టుకున్నందుకు కార్తీక్ సంజాయిషీ ఇస్తాడు. మనం ఏం చేసినా పాప కోసమే ఏం అనుకోవద్దు అంటాడు. మన మధ్య బంధం ఉంది కానీ అనుబంధం లేకపోయినా నేను తీసుకొనే చొరవ చాలా మందికి సమాధానం అని గది బయట లోపల మనం భార్యాభర్తలమే అని అంటాడు. మన బంధం అనుబంధంగా ఎప్పుడు మారుతుందో తెలీదు కానీ మిమల్ని అందరూ గౌరవించాలి అని దీప అనుకుంటుంది. అందరూ కలిసిపోయిన తర్వాత మీ పక్కన నాకు చోటు ఉంటే చాలు అనుకుంటుంది.
మరోవైపు జ్యోత్స్న రౌడీని కలవడానికి ఓ ప్రాంతానికి వస్తుంది. ఎవరైనా గుర్తు పడతారా ఏమో అని భయపడుతుంది. ఇక కుభేర్ గురించి ఆరా తీస్తూ దాసు అదే బస్తీకి వస్తాడు. అక్కడ జ్యోత్స్నని చూసి షాక్ అయిపోతాడు. రౌడీ వచ్చి జ్యోత్స్నతో మాట్లాడి వాళ్లతో వెళ్లడంతో తన కూతురు ఏదో ప్రమాదంలో ఉందని దాసు ఫాలో అవుతాడు. మరోవైపు కార్తీక్ డాక్టర్‌తో మాట్లాడుతాడు. రిపోర్ట్ ఎప్పుడొస్తాయని అడుగుతాడు. కార్తీక్ డాక్టర్‌తో మాట్లాడుతుంటే దీప కాఫీ తీసుకొని వస్తుంది. కార్తీక్ దీపని చూసి షాక్ అయిపోతాడు. తన మాటలు దీప వినిందేమో అని అనుకుంటాడు.
దీప: శౌర్యకి ఏమైంది బాబు శౌర్యకి మందుల వాడాలా అని అడుగుతున్నారు.
కార్తీక్: వేరే పని మీద డాక్టర్‌కి కాల్ చేశా అలాగే మందులు వాడమన్నారు.
దీప: కార్తీక్ బాబు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది డాక్టర్ నెంబరు ఈ ఫోన్‌లో ఉంటుంది కాదా నేను మాట్లాడితే ఇందులో నెంబరు ఎలా చూడాలి.
కార్తీక్: ఎవరికైనా ఫోన్ చేయాలా దీప.
దీప: లేదు బాబు ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి.
కార్తీక్: ఫోన్ చేయాలా దీప.
దీప: చేయండి బాబు
కార్తీక్: ఇలా ఇరుక్కుపోయానేంటి వద్దు అంటుంది అని చేయాలా అన్నాను పోనీలే దీప నా మీద నమ్మకం లేదు అంటే మాట్లాడు అని అంటే దీప కాల్ చేయొద్దు అనేస్తుంది.
దాసు జ్యోత్స్నని ఫాలో అయి జ్యోత్స్న ప్రమాదంలో ఉందనుకొని జ్యోత్స్నని తీసుకొని వేరే దగ్గరకు వస్తాడు. ఈ ఏరియా ప్రమాదం అని చెప్తే జ్యోత్స్న నన్ను వదిలేయ్ అంటే నువ్వు నా కూతురివి అంటాడు. నేను నీ కూతురిని కాదు నువ్వు నా తండ్రివి కాదు నేను సుమిత్రా, దశరథ్‌ల కూతురిని అని అంటుంది. జ్యోని దాసు బలవంతంగా తీసుకెళ్లబోతే జ్యో తోసేస్తుంది. మరోవైపు దీప తన తండ్రి కుభేర ఫుటో తుడుస్తుంటే చేయి జారిపోతుంది. జ్యోత్స్న కుభేర ఫొటో తీసుకొని ఈయన డ్రాయింగ్ నీ దగ్గర ఎందుకు ఉందని అడుగుతుంది. ఈయన నీకు తెలుసా అని దాసు అంటే తెలుసు అని జ్యోత్స్న చెప్తుంది. దాసు షాక్ అవుతాడు.
దీప తన తండ్రి ఫొటోతో మాట్లాడుతుంటే అనసూయ వస్తుంది. ఎవరో కని నిన్ను వదిలేశారని అలా వదిలేసిన వాళ్లు గొప్పింటి పిల్లలు అవుతారని మీ నాన్న బతికి ఉంటే నిన్ను నీ ఇంటికి పంపేవాడని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న ఆయన దీప తండ్రి అని చెప్తుంది. అనసూయ తమ్ముడని చెప్తుంది. దాసు షాక్ అయిపోతాడు. దీప వారసురాలా అసలు దీప తన అన్న కూతురా కాదా తెలుసుకోవాలి అంటే అనసూయకి అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. జ్యోత్స్నకి నిజం చెప్పకూడదని అనుకొని మాట దాటేస్తాడు. ఇక జ్యోత్స్న రాను అంటే మీ తాతకి కాల్ చేస్తానని చెప్తాడు. దాంతో జ్యో భయంతో వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ రెడీ అవుతుంటాడు. షర్ట్ బటన్ ఊడిపోయిందని కార్తీక్ చెప్పి కుట్టమని కార్తీక్‌ని పిలిస్తే అది ఊడిపోలేదు మేమే చేశామని అనుకుంటారు. ఇక దీపని అందరూ కుట్టమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.