Satyabhama Serial Today November 28th: సత్యభామ సీరియల్: గంగ వెనకున్న కర్త, కర్మ నేనే అని మామ కాని మామకి షాకిచ్చిన సత్య.. భైరవి యాక్టింగ్ సూపర్!
Satyabhama Today Episode గంగతో పాటు మహదేవయ్య కూడా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని భైరవి భర్తకి ఆర్డర్ వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode డీఎన్ఏ టెస్ట్‌కి గంగ, క్రిష్‌లతో పాటు మహదేవయ్య కూడా టెస్ట్ చేయించుకోవాలని లేదంటే ధర్మా చేస్తానని గంగ అంటుంది. దాంతో మహదేవయ్య ఏం మాట్లాడకుండా ఉండిపోతే భైరవి మహదేవయ్య డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటున్నారని అంటుంది. దాంతో గతిలేక మహదేవయ్య ఒప్పుకుంటాడు. ఇక రిపోర్ట్స్ వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉంటానని గంగ అంటుంది.
మహిళాసంఘాలు ఒప్పుకోకపోవడంతో అందరూ సరే అంటారు. ఇక ఇంటి లోపలికి వెళ్లాక బంటీ అందరి కోసం చేసిన టిఫెన్ తినేస్తాడు. మహదేవయ్య వచ్చి భైరవిని పిలిచి నేను తినక ముందు ఈ ముష్టిముఖాలు తింటున్నాయేంటి అని అంటాడు. ఇద్దరు సవతిలు తిట్టుకుంటారు.
గంగ: ఓ పెనిమిటి నీ కంటిని మేం ముష్టోళ్లా కనిపిస్తున్నామా.. నా కొడుకు నీ చేతిలో ముష్టిగా పడేసింది ఎవరు నేను కాదా. నేను ముష్టి వేయడం బట్టే కదా నువ్వు నా కొడుకుని అడ్డు పెట్టుకొని మీసం తిప్పుతున్నావ్. వాడు తినేది వాడి సొమ్మే వాడి కన్న తండ్రి సొమ్మే ఈ ఆస్తిలో వాడికి వాటా ఉంది.
భైరవి: నాలుగు ఇడ్లీల గురించి అడిగితే ఆస్తిలో వాటా అడుగుతుంది కాస్త కోపం తగ్గించుకో అయ్యా.
క్రిష్: అది కాదమ్మా డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ రాకుండా తన పెత్తనం ఏంటి. మూడు రోజులు తల దాచుకోవడానికి చోటు ఇస్తే ఏంటి ఇదంతా.
గంగ: నీ కొడుకు కాని కొడుకుని గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటున్నావ్ కదూ ఏడిపిస్తున్నావ్ కదూ నా ఊసురు నీకు తగులుతుంది.
గదిలోకి వెళ్దామని గంగ మహదేవయ్య చేయి పట్టుకుంటే భైరవి బుంగమూతి పెట్టికొని గంగ చేయి విడిపించేస్తుంది. ఇక సత్యతో గంగ మీ మామకి నా మీద అరొద్దని చెప్పు కోడలా అంటుంది. ఇక భైరవి తల పట్టుకుంటే పంకజం వచ్చి రెచ్చగొడుతుంది. మరోవైపు సత్య మహదేవయ్య దగ్గరకు వెళ్లి టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా మామయ్య అని అడుగుతుంది. గంగ ఓ చీమ అని దాన్ని చంపేయడం చిటికెలో పని అని మహదేవయ్య అంటాడు.
మహదేవయ్య: గంగ నా టార్గెట్ కాదు దాన్ని నా మీదకు వదిలిన వ్యక్తిని టార్గెట్ గంగని పట్టుకొని నలిపితే అసలు మనిషి తెర మీదకు వస్తారు.
సత్య: అసలు మనిషి వస్తే ఏం చేస్తారు మామయ్య.
మహదేవయ్య: ఆ మనిషి ముందుకు రావడం లేదు అంటే నేను అంటే భయం అనే అర్థం కదా
సత్య: అది భయం కాదేమో ప్లానేమో
మహదేవయ్య: అంతా నీకు తెలిసినట్లు మాట్లాడుతున్నావ్ ఆ మనిషికి సలహాలు ఇస్తున్నావా.
సత్య: లేదు లేదు ఆ మనిషిని నేనే. షాక్ అయ్యారా
మహదేవయ్య: చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ ఫలితం దారుణంగా ఉంటుంది.
సత్య: ప్రాణాలకు తెగించే చేశాను మామయ్య గంగకి ఏమైనా అయితే మీ పని అంతే మామయ్య మూడు రోజుల్లో మీ పని అయిపోతుంది. మీరు డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్లకపోతే మీడియా ఊరుకోదు. అన్నింటి కంటే ముందు అత్తయ్య ఊరుకోదు. మీదగ్గర ఉన్నవి రెండే దారులు ఒకటి గంగతో డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్లి క్రిష్‌ని వదులు కోవాలి. రెండు క్రిష్ కోసం గంగని రెండో భార్యగా ఒప్పుకోవాలి. అప్పుడు మీ భార్య మీకు బతకనివ్వదు. ఇక పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా రాదు. క్రిష్ కావాలా ఎమ్మెల్యే టికెట్ కావాలా మీరే నిర్ణయించుకోండి మామయ్య కాని మామయ్య. ఆల్ ది బెస్ట్.
హాల్లో మహదేవయ్య టెన్షన్‌గా ఆలోచిస్తుంటే గంగా అని భైరవి పాటలు పెడుతుంది. దాంతో మహదేవయ్య కోపంతో భైరవి మీద అరుస్తాడు. ఇక రాగి జావ తీసుకురమ్మని మహదేవయ్య చెప్తే భైరవి నేను అలిసి పోయాను దానికి చెప్పు అని అంటుంది. ఇక భైరవి గంగకి కాల్ మాట్లాడుతున్నట్లు ఫోన్ తీసి చెల్లె మన మొగుడికి రాగి జావ తీసుకురా అని చెప్పి మాట్లాడుతుంది. ఇంతలో మహదేవయ్య భైరవికి కాల్ చేస్తే ఫోన్ చేయకుండా ఈ నాటకాలు ఏంటే అని అడుగుతాడు. ఇక భైరవి గంగ గురించి నా దగ్గర ఎందుకు దాచావని అడుగుతుంది. అబద్ధాలు చెప్తుందే అని అంటాడు అయినా భైరవి ఒప్పుకోదు. మీ ముగ్గురు డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయాల్సిందే అని భైరవి అంటుంది. ఇక గంగ బ్యాగ్ సర్దుకుంటుంటే సత్య అక్కడికి వెళ్తుంది. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోనని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఊరుని ఇంటిని చూసి గతం గుర్తుచేసుకొని ఎమోషనలైన లక్ష్మీ.. తగలబెట్టేస్తానంటోన్న మనీషా!