Karthika Deepam 2 Serial Today November 23rd: కార్తీకదీపం 2 సీరియల్: ఊరు వదిలివెళ్లిపోదామన్న కార్తీక్.. భర్త కాళ్లు మొక్కిన దీప.. వెక్కి వెక్కి ఏడుస్తున్న జ్యో!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న ఇబ్బంది పెడుతుందని కార్తీక్ దీపతో చెప్పి ఊరు వదిలి వెళ్లిపోదామని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ గుడిలో ఉన్నాడని తెలిసి జ్యోత్స్న కూడా అక్కడికి వెళ్తుంది. శౌర్య జ్యోత్స్నతో నేను గతేడాది దీపం వదిలి మంచి నాన్న కావాలని కోరుకున్నాను కార్తీక్ లాంటి మంచి నాన్న నాకు దొరికాడని శౌర్య అంటుంది. ఇక దీప, కార్తీక్, జ్యోత్స్న అందరూ నీటిలో దీపాలు వదలడానికి వెళ్తారు. శౌర్య ఆరోగ్యం బాగుండాలని కార్తీక్ కోరుకుంటారు. దీప రెండు కుటుంబాలు కలవాలి, శౌర్య బాగుండాలి అని కోరుకుంటుంది. ఇక జ్యోత్స్న బావ జీవితం నుంచి దీప పోవాలి నేను బావతో కలిసి ఉండాలని కోరుకుంటుంది. అమ్మానాన్నలతో నేను ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటుంది.
దీప దీపం ముందు వెళ్లడంతో శౌర్య నానమ్మకి అమ్మ దీపం ముందు వెళ్తుందని చెప్తుంది. దాంతో కార్తీక్ మీ అమ్మ ఏదో బలంగా కోరుకుంది అని అంటాడు. ఆ మాటలకు జ్యోత్స్న రగిలిపోతుంది. ఇక టైం అయింది వెళ్లిపోదాం అని కాంచన అందరిని పిలుస్తుంది. జ్యోత్స్న కోపంతో రాయి తీసుకొని దీప దీపం మీద విసరబోతే కార్తీక్ చూసి జ్యోత్స్నని నెట్టేస్తాడు దాంతో రాయి జ్యోత్స్న దీపం మీద పడి తన దీపం ఆగిపోతుంది. నిజాయితీతో ఉన్న కోరికలు బలంగా ఉండి దేవుడి దగ్గరకు వెళ్తాయని అది దీప పెట్టిన దీపం లాంటిదని కార్తీక్ అంటాడు. నిజాయితీ లేని కోరికలు కోరే నీలాంటి వాళ్ల దీపాలు ఇలాగే అవుతాయని అంటాడు. ఇక కార్తీక్ వాళ్లు వెళ్లిపోతారు.
కార్తీక్: దీప మనం ఈ ఊరు వదిలి పాపని తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోదామా.
దీప: ఎందుకు ఇలా అంటున్నారు.
కార్తీక్: కొన్ని సార్లు మనసు మర్చిపోదాం అనుకున్న గాయాన్ని కూడా మనుషులు గుర్తు చేస్తుంటారు. వాళ్లకి వ్రతం అని ఉండదు, రిసెప్షన్ అని ఉండదు, రెస్టారెంట్ అని ఉండదు చివరకు దేవుడి గుడి దగ్గర కూడా దీపాన్ని ముందుకు వెళ్లనివ్వరు. అంతా బాగుందనే ప్రతీ సారి మళ్లీ కథ మొదటికి తీసుకొస్తారు. మనం ఇక్కడే ఉంటే జ్యోత్స్న లాంటి వాళ్లు ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇక్కడుంటే నువ్వు జ్యోత్స్న వల్ల ఇబ్బంది పడతావు.
దీప: నాలాగే మీరు ఎవరూ లేకుండా ఉంటారా. ఇప్పుడు మీరంతా ఉన్నారు కానీ ఇంతకు ముందు నేను ఎవరూ లేని అనాథని. వీళ్లంతా మీకు భగవంతుడు ఇచ్చిన బంధాలు. దేవుడి ఇచ్చినవి ఒకసారి దూరం చేస్తే మళ్లీ తిరిగి రావు. కష్టాలు నాకు అలవాటే బాబు.
కార్తీక్: నేను కట్టిన దాన్ని తాళిని గౌరవిస్తున్నావ్ కానీ నన్ను భర్తగా చూడట్లేదు అందుకే నేను నీకు ఓ మాట చెప్పాలని అనుకుంటున్నా. కోనేటిలో వదిలిన కార్తీక్ దీపం సాక్షిగా చెప్తున్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేను నీకు శ్రేయాభిలాషినే. నీ సంతోషం, సుఖం అన్నీ నేను ఓ భర్తగా కోరుకోవడంలో తప్పు లేదు. అలా అని నువ్వు ఇవ్వని చనువు నేను తీసుకోను. నువ్వు నాతో ప్రతీక్షణం భార్యలా ఉండాల్సిన అవసరం లేదు నా స్నేహితురాలిగా ఉండొచ్చు. ఇంతకు ముందు మీ గురించి బెంగ ఉండేది కానీ ఇప్పుడు మీరు నా ముందే ఉన్నారు. తింటున్నారా లేదా అనే బెంగలేదు. నేను నీకు దేవుడు అంటావ్ కదా దీప నాకు రక్తం ఇచ్చిన నువ్వు కూడా నాకు దేవతవే.
కార్తీక్ మాట్లాడుతుంటే దీప ఎమోషనల్ అయిన కార్తీక్ చూడకుండా తన కాళ్లకి దండం పెడుతుంది. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి భర్త దొరుకుతాడని అనుకుంటుంది. మీలాంటి మంచి మనిషి తోడు ఉంటే బాధలు పెట్టేవారు ఎంత మంది ఉన్నా ఎదుర్కొని నిలబడతానని అనుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఏడుస్తుంది. భార్యగా కాదు కానీ కనీసం మరదలిగా కూడా నేను బావకి ఇష్టం లేదని అంటుంది. కాంచన కూడా దూరం పెడుతుందని అంటుంది. ఆస్తి తీసుకొని కార్తీక్‌ని దీపకి వదిలేయ్ అని పారిజాతం అంటే జ్యోత్స్న కోపంతో పారిజాతం గొంతు నులిపేస్తుంది. బావ దక్కడు అంటే నేను చనిపోయి నిన్ను చంపేస్తా అంటుంది. మరోవైపు దాసు కుబేర ఇంటి అడ్రస్ పట్టుకుంటాడు. ఇంతలో దాసుకి ఓ వ్యక్తి కాల్ చేస్తాడు. ముత్యాలమ్మ గూడెం వెళ్లామని కుబేర చనిపోయాడని ఆయన దాసుతో చెప్తారు. ఇక దాసుకి ఆయన పేరు కుబేర్ అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.