Karthika Deepam 2 Serial Today March 13th: కార్తీకదీపం 2 సీరియల్: తమ కంపెనీ డీల్ దక్కించుకున్న దీపపై జ్యో ఈవిల్ ప్లాన్.. పెళ్లి హక్కులన్నీ ఫ్యామిలీవే!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న దీప వంటల్లో తన మనిషితో పాయిజిన్ కలపడం దీప ఆ వంటల్ని వేరే కంపెనీ ఉద్యోగుల కోసం తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప గౌతమ్ మీద కంప్లైంట్ ఇద్దామని అంటే రమ్య తల్లిదండ్రులు దీపని వెళ్లిపోమని చెప్తారు. దాంతో దీప గౌతమ్‌తో ఖర్మ అనుభవిస్తావని అంటుంది. గౌతమ్ సంబంధానికి జ్యోత్స్న ఏమంటుందో అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో జ్యోత్స్న ఇంటికి వస్తుంది. అబ్బాయి ఏమన్నాడు అని అందరూ అడుగుతారు.
సుమిత్ర: అబ్బాయిని కలిశావు కదా.
జ్యోత్స్న: లేదు మమ్మీ. మనసు మార్చుకున్నాను.
పారు: మనసు మార్చుకోవడం ఏంటే.
సుమిత్ర: ఏంటే అందరినీ ఇంత బాధ పెడుతున్నావ్.
జ్యోత్స్న: నేను మనసు మార్చుకున్నా అంటే పెళ్లి వద్దు అని కాదు. మీరు నాకు ఒక సంబంధం చూశారు. మీరు ఏం చేసినా నా మంచి కోసమే కదా ఆలోచిస్తారు మరి నేనేం మాట్లాడాలి. మీ ఇష్టమే నా ఇష్టం. నా విషయంలో మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ముహూర్తం పెట్టించండి తల వంచుకొని తాళి కట్టించుకుంటా.
సుమిత్ర: ఏవండీ జ్యోత్స్న ఏమందో విన్నారా మన ఇష్టమే తన ఇష్టమంట.
దశరథ్: నాకు అదే ఆశ్చర్యంగా ఉంది.
శివన్నారాయణ: ఇందులో ఆశ్చర్యం ఏముందిరా తొందర్లోనే మంచి ముహూర్తం పెట్టి గౌతమ్ వాళ్లని రమ్మంటా.
జ్యోత్స్న: డైరెక్ట్‌గా నిశ్చితార్థం పెట్టుకోండి తాత. డాడీ మీరు మాట్లాడుకోండి ఏదో మంచో అది చేయండి నేను అయితే మీరు ఏం చెప్తే అది చేస్తా.
పారు: అయ్యో దేవుడు కరుణించాడు అండీ వెంటనే జ్యోత్స్నకి దిష్టి తీయాలి.
పారిజాతం జ్యోత్స్నకి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది. దీప గౌతమ్ గురించి ఆలోచిస్తూ కోపంతో కూరగాయల్ని ముక్కలు ముక్కలు నరికేస్తుంది. కార్తీక్ దీపని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నావ్ ఏమైంది అని అడిగితే గౌతమ్ గురించి దీప కార్తీక్‌తో చెప్తుంది. పెళ్లి కోసం కాళ్లు పట్టుకుంటే కడుపు తీయించుకోవడానికి డబ్బులు ఇచ్చాడని అంటుంది. మీరు కూడా డబ్బులోనే పుట్టారు కదా మీకు అలాంటి లక్షణాలు రాలేదు కదా అంటే అందరూ ఒకేలా ఉండరు కదా అని కార్తీక్ అంటుంది. ఇక దీప వాడి పాపాన వాడే పోతాడని అంటుంది. కార్తీక్ ఓ పెద్ద కంపెనీ నుంచి క్యాటరింగ్ కాంట్రాక్ట్ వచ్చిందని గుడ్ న్యూస్ చెప్తాడు. వాళ్లు గతంలో జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్లకి క్యాటరింగ్ చేసిందని అంటాడు. మా తాత ఏమనుకుంటాడో అంటాడు.
క్యాటరింగ్ విషయంలో శివన్నారాయణ జ్యోత్స్న మీద అరుస్తాడు. సీఈవో అయిండి ఏం చేయలేకపోతున్నావ్ షేమ్ ఆన్ యూ జ్యోత్స్న అంటాడు. దీపే ఇదంతా చేసిందని పారు అంటే 5వ తరగతి చదువుకున్న దీప అంత చేస్తే ఫారిన్‌లో చదువుకున్న నువ్వు ఇంకెంత చేయాలి అని అడుగుతారు. 5ఏళ్ల నుంచి మనతోనే ఉన్న విజయ్ కంపెనీ వాడివైపు వెళ్లింది వాళ్లని చూసి మరో రెండు కంపెనీలు పోతాయి.. నా దివాలా నువ్వు చూడాలి అనుకుంటున్నావా అని అంటారు. అందరూ చివాట్లు పెడతారు. ఇక కంపెనీ దశరథ్‌కి తీసుకోమని శివన్నారాయణ అంటే రెండు రోజులు గడువు ఇవ్వమని జ్యోత్స్న అంటుంది. రెండు రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయమని అంటాడు. మన చేతకాని తనం వల్ల కార్తీక్ ఎదుగుతున్నాడని అంటారు.
సుమిత్ర జ్యోత్స్నతో ఇన్నాళ్లు నువ్వు తప్పు చేశావని అనుకున్నా కానీ నువ్వు మంచితనంతో మోసపోతున్నా అని అర్థమైంది. ఇక అన్నీ ఇక్కడితో ఆపేయ్ నా నమ్మకం నీ మీద ఉంది. కొత్త జీవితం మొదలు పెట్టు జ్యోత్స్న అని అంటే జ్యోత్స్న తల్లికి థ్యాంక్స్ చెప్తుంది. ఇక జ్యోత్స్న సత్యరాజ్ కంపెనీకి, విజయ్ కంపెనీకి చెక్ పెడతానని అంటుంది. పారు జ్యోత్స్న ఏం చేయబోతుందో అని టెన్షన్ పడుతుంది. దీప రెస్టారెంట్‌లో వంటలు చేయించి అన్నీ క్యాటరింగ్ కోసం ఏర్పాటు చేస్తుంది. కార్తీక్ సాయం చేయడంతో వర్కర్‌ని కోప్పడుతుంది. మ్యానేజర్ ఎవరూ చూడకుండా ఆ వంటల్లో మందు కలుపుతాడు. జ్యోత్స్న తనకి కాల్ చేయడంతో మీరు చెప్పినట్లు చేశాను అని అంటాడు. ఇక ఆయన మాట్లాడిన తర్వాత దీప వెనకాలే నిల్చొని చూస్తుంది. దాంతో వర్కర్ షాక్ అయిపోతాడు. దీప వంటలు టేస్ట్ చేశావా అని అడుగుతుంది.
దీప తన మాటలు వినలేదు అని రిలాక్స్ అయి వంటలన్నీ విజయ్ కంపెనీ దగ్గరకు తీసుకెళ్తారు. దీప లొకేషన్‌కి వస్తుంది. అందరి పని అయిపోతుందని అనుకుంటుంది. కార్తీక్ సాంబారు బాగుందా అంటే దీప మరోసారి రుచి చూస్తుంది. చాలా బాగుందని అనుకుంటుంది. ఇక కార్తీక్ మనసులో దీప రెండు జడులు వేసుకొని ఎర్ర గౌను వేసుకుంటే అని ఊహించుకొని నవ్వుకుంటాడు. దీప ఎంప్లాయ్‌స్ అందరికీ భోజనం వడ్డిస్తుంది. జ్యోత్స్న అది చూస్తుంటుంది. ఎక్కడా ఏం రియాక్షన్ లేదు ఏంటి అనుకుంటుంది. కాసేపట్లో అందరికీ వాంతులు మొదలవుతాయని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

