(Source: ECI/ABP News/ABP Majha)
Karthika Deepam 2 Serial July 27th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని వదిలేసి శౌర్య, దీపలతో వెళ్లిపోయిన కార్తీక్.. సొంతకూతురినేనా అన్న జ్యో.. శౌర్యకేమైంది!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ జ్యోత్స్నని వదిలేసి శౌర్యని తీసుకొని వెళ్లిపోవడంతో ఇంట్లో జ్యోత్స్న అందరినీ ప్రశ్నించి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode అందరూ దీపని సమాధానం చెప్పమని ఒత్తిడి చేయడంతో దీప నర్శింహనే మీ నాన్న అని అరుస్తుంది. దాంతో శౌర్య చాలా భయపడిపోతుంది. షాకై శౌర్య కళ్లు తిరిగి పడిపోతుంది. తానే తండ్రి అని చెప్పావు కాబట్టి నా కూతుర్ని నేను తీసుకుపోతా అని కళ్లు తిరిగి పడిపోయిన పాపని ఎత్తుకుంటాడు. దీపని తోసేసి పాపని ఎత్తుకెళ్తుంటాడు. దీప వెనకాలే వద్దు నర్శింహ అని పరుగులు తీస్తుంది. ఇక కార్తీక్ వెళ్లబోతే జ్యోత్స్న చేయి పట్టుకొని ఆపేస్తుంది. కార్తీక్ జ్యోత్స్నని తోసేసి పరుగున వెళ్లి నర్శింహ దగ్గర పాపని తీసుకుంటాడు. అందరూ షాకై కార్తీక్ వెంట పరుగులు తీస్తారు.
కార్తీక్: ఆ రోజు ఇలాగే హాస్పిటల్‌లో పాపని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తే నేనే పాప నా కూతురే అని అబద్ధం చెప్పాను. అయినా నువ్వు మారలేదు. నీ నుంచి పాపని కాపాడటానికి దీప ఎన్ని నిందలు మోసిందో నేను ఎన్ని అవమానాలు పడ్డానో నాకు తెలుసురా. రౌడీకి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తా నీ సంగతి. అని కార్తీక్ కారులో పాపని ఎక్కించుకొని దీప, పాప, కార్తీక్ వెళ్లిపోతారు.
నర్శింహ: దీప నా పెళ్లాం, శౌర్య నా కూతురు ఈ సీన్ చూసే ఎవరైనా అలా అనుకుంటారా. నేను తింగరోడిని కాబట్టే నా పెళ్లాం వాడితో పోతుంది. ఈ పద్ధతి ఏం బాలేదు.
కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం ఆగిపోతుంది. పంతులు వెళ్లిపోతాడు. నిశ్చితార్థం ఉంగరాలు పట్టుకొని జ్యోత్స్న ఏడుస్తుంది. అందరూ జ్యోత్స్నని చూసి బాధపడతారు. ఎదురుగా ఉన్న నిశ్చితార్థం సామాగ్రి అంతా జ్యోత్స్న విసిరేస్తుంది. పారిజాతం కూడా ఏడుస్తుంది.
జ్యోత్స్న: ఇక్కడేం జరగాలి ఏం జరిగింది. మీ అందరికి అర్థమవుతుందా. మన ఇంటితో ఏ మాత్రం సంబంధం లేని మనిషి కోసం దాని భర్త వచ్చి గొడవ చేయడం ఏంటి. దాని కూతురి కోసం బావ వెళ్లిపోవడం ఏంటి. నన్ను వదిలేసి అలా వెళ్లిపోతుంటే నువ్వేం చేశావ్ మమ్మీ ఆపాలి కదా నువ్వేం చేశావ్ డాడీ. మీకు నా కంటే దీప, దాని కూతురే ఎక్కువ అయిపోయారా. అవునా.
దశరథ్: అలా కాదమ్మా.
జ్యోత్స్న: చాలు డాడీ ఇక నేను ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధ నాకు గ్రానీ ముఖంలో తప్ప ఎవరి ముఖంలోనూ కనిపించడం లేదు. మీరంతా నా మీద కంటే దీప మీదే ఎక్కువ సానుభూతి చూపిస్తున్నారు. దీప ఇంటి నుంచి వెళ్లిపోతే మీరందరూ ఒకటే భజన దీప ఎక్కడా దీప ఎక్కడా అని. ఓ వైపు బావ వెతుకుతాడు. నువ్వు ఎదురు చూస్తావు. దీప రాగానే మీ అందరి ముఖాలు దీపావళిలా వెలిగిపోయారు. నర్శింహ వస్తే చాలు దీప ఏమైపోతుందా, శౌర్య ఏమైపోతుందో అని ఆరాటం, నా చేయి వదిలేసి వెళ్లిపోతున్నాడు దీప కూడా వెళ్లిపోయింది. కార్తీక్ సొంత కూతురిలా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఇంత మంది ఉండగా దీప మీద బావకే ఎందుకు అంత జాలి. మిమల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. అసలు నేను మీ సొంత కూతురినేనా.
దశరథ్: జ్యోత్స్న..
జ్యోత్స్న: అత్తా మీరు బాధ పడకండి బావ వెళ్లిపోయినంత మాత్రానా నిశ్చితార్థం ఆగిపోదు. ఈ సారి ముహూర్తం పెట్టండి ఎవరు ఆపినా ఈ సారి నా నిశ్చితార్థం జరుగుతుంది. రాసి పెట్టుకోండి బావే నా భర్త.
కాంచనకు కళ్లు తిరుగుతాయి. బాగా టెన్షన్ అయితే ఇలా అవుతుందని ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని శ్రీధర్ సుమిత్రతో చెప్తాడు. కాంచన ఏడుస్తుంది. ఇక కోలుకోలేని దెబ్బ కొట్టావని పారు అనుకుంటుంది. దీపని వదిలి పెట్టనని అంటుంది. కార్తీక్, దీపలు హాస్పిటల్‌లో చేర్పిస్తారు. నాకు బూచోడు నాన్నగా వద్దు కార్తీక్ అని శౌర్య కలవరిస్తుంది. శౌర్యకి స్కానింగ్ చేస్తానని డాక్టర్లు తీసుకెళ్తారు. ఇంతకు ముందు ఇలా జరిగినప్పుడు రిపోర్ట్ తీసుకురమ్మని చెప్తే కార్తీక్ వెళ్తాడు. ఇక సుమిత్ర హాస్పిటల్‌కి వస్తుంది. ఇక కార్తీక్ రావడంతో నువ్వు రావనుకున్నానని శౌర్య అంటుంది. ఇన్ని రకాల టెస్టులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని దీప సుమిత్రతో చెప్తుంది. ఇక శౌర్య సుమిత్రతో నేను ఇంటికి రాను మళ్లీ బూచోడు వస్తాడని అంటుంది. సుమిత్ర ఎవరూ రారని అంటుంది. ఇక కార్తీక్ ఒక్కడే డాక్టర్‌తో మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.