Karthika Deepam 2 Serial July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: తన తండ్రి రెండో ఫ్యామిలీ విషయంలో దీపని ప్రశ్నించిన కార్తీక్.. స్వప్నని దత్తత తీసుకుంటాడంట!
Karthika Deepam 2 Serial Episode తన తండ్రి రెండో పెళ్లి గురించి ఎందుకు తనతో చెప్పలేదని కార్తీక్ దీపని ప్రశ్నించి స్వప్నని దత్తత తీసుకుంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode తండ్రికి రెండో పెళ్లి జరిగిందని స్వప్న తన తండ్రికి పుట్టిన కూతురని కార్తీక్ తెలుసుకుంటాడు. ఈ విషయం దీపకు కూడా ముందే తెలుసని అనుమానపడ్డ కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు. దీపతో కొంచెం ముందు మాట్లాడాలి అని అంటాడు. స్వప్న నాకు చాలా బాగా నచ్చిందని తన లాంటి చెల్లి ఉంటే బాగున్ననని గతంలో అన్నాను గుర్తుందా అని అడుగుతాడు. ఇక నువ్వు కూడా స్వప్న విషయంలో నాకు బాధ్యత అప్పగించావ్ గుర్తుందా అని అడుగుతాడు. దీప గుర్తింది కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తుంది.
కార్తీక్: నేను స్వప్నని చెల్లిగా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ సలహా అడుగుదాం అని వచ్చా. ఈ విషయంలో నేను వాళ్ల అమ్మానాన్నలతో కూడా మాట్లాడాను. నమ్మరా నమ్మాలి అండీ. వాళ్ల ఫ్యామిలీ ఫొటో చూశాకైనా నమ్మండి. అని శ్రీధర్, కావేరి, స్వప్నల ఫొటో చూపిస్తాడు. చూశారా వాళ్లది కూడా మాలా చిన్న ఫ్యామిలీ. ఫొటో బాగుంది కదా దీప. స్వప్న వాళ్ల నాన్న కూడా అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు. కానీ స్వప్న వాళ్ల అమ్మ మా అమ్మలా లేదు. ఎందుకంటే మా ఇద్దరికీ తండ్రి ఒకరైనా తల్లిలు వేరు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకో విషయం ఏంటి అంటే ఈ విషయం నీకు ఎప్పుడో తెలుసు. ఈ విషయం తెలుసు కాబట్టే స్వప్న బాధ్యతలు నాకు అప్పగించారు. ఈ విషయం తెలుసు కాబట్టే మా నాన్నని రెస్టారెంట్లో మా దగ్గరకు రాకుండా ఆపారు. నేను మీకు అన్నీ చెప్తాను కదా ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచారు దీప.
దీప: మీ అమ్మగారి ప్రాణాలు కాపాడటానికి. మీ రెండు కుటుంబాలలో ఉన్న ఆనందం కాపాడటానికి. ఒక రోజు కాంచన గారికి నిజం చెప్పాలి అనుకున్నాను. ఆ నిజం తెలిస్తే ఆవిడ బతకరు కార్తిక్ బాబు. అలాంటిది జరిగితే ఆవిడ విషం తాగి చనిపోతారు. మీ అమ్మగారికి మీ నాన్న గారు అంటే చాలా నమ్మకం, ప్రేమ. మీ నాన్న సర్వస్వం అని బతుకుతున్న మీ అమ్మగారికి మీ నాన్నకి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందని మీ అమ్మకి తెలిస్తే ఆవిడ బతుకుతుందా. దీనికి పరిష్కారం ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ మీ అమ్మగారికి చెప్పకండి. నాకు తెలిసి మీరు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే అది ఇప్పుడు మీ అమ్మగారిని సంతోషంగా ఉంచాలి. మీరు మీ అమ్మగారి కోరికల్ని ఆశల్ని నెరవేర్చండి. నడవ డానికి కాళ్లు లేకపోయినా మీరు ఉన్నారు అన్న ధైర్యంతో బతుకుతున్నారు. మీరు కూడా మీ నాన్న గారిలా ఈ పెళ్లి విషయంలో మోసం చేస్తే మీ అమ్మగారు నిజంగానే కుంటివారు అయిపోతారు.
దీప, కార్తీక్‌లు మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది. నిశ్చితార్థం ఆపడానికి ప్రయత్నిస్తున్నారేమో అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్రీధర్, కాంచన చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అది చూసి కార్తీక్ తండ్రి బాగోతం గుర్తు చేసుకుంటాడు. క్యాంప్ అయిపోయిందా అని అడుగుతాడు. కాంచన నీ నిశ్చితార్థం అయిన వరకు ఎక్కడికి వెళ్లనని చెప్పాడని అంటుంది. ఇక కార్తీక్ శ్రీధర్‌కి అడిగిన ప్రశ్నలకు శ్రీధర్‌కి అనుమానం వస్తుంది. ఇక కార్తిక్ తన సమస్య పరిష్కారం అయిన తర్వాత నీ పని చెప్తా అనుకుంటాడు. సరదాగా బయటకు వెళ్తాం అని శ్రీధర్ అంటే షాపింగ్‌కు వెళ్దామా అని అంటాడు. కార్తీక్ మాటలకు శ్రీధర్ షాక్ అయిపోతాడు. నాకు మీరు తప్ప ఎవరూ లేరని నా లోకం మీరే అని అంటాడు. కార్తీక్ ఇన్‌డైరెక్ట్‌గా దెప్పిపొడుస్తాడు.
దీప దగ్గరకు జ్యోత్స్న వస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావ్ అని మళ్లీ రావడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. మా అమ్మ పిలిస్తే వచ్చావా మా బావ కోసం వచ్చావా అని అడుగుతుంది. దాంతో దీప నిశ్చితార్థం ఉందని సుమిత్రమ్మ పిలిస్తే వచ్చానని దీప అంటుంది. ఇక నిశ్చితార్థం నిజంగా జరుగుతుందా అని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read; 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి అండతో మాంత్రికుడిని చంపేసిన నయని.. గెటప్ మార్చేసిన గంటలమ్మ!