Trinayani Serial Today July 23rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి అండతో మాంత్రికుడిని చంపేసిన నయని.. గెటప్ మార్చేసిన గంటలమ్మ!
Trinayani Serial Today Episode పుర్రెలదిబ్బలో నయని గాయత్రీ దేవి ఆత్మ సాయంతో రక్త పుంజి మాంత్రికుడిని బలిచ్చి పాపని కాపాడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode గాయత్రీ పాప, నయని మంచం మీద ఎగురుకుంటూ పుర్రెల దీవికి వెళ్తారు. అక్కడ రక్తపింజరి మాంత్రికుడు నయనిని అగ్నితో బంధిస్తాడు. గాయత్రీ పాపని బలి పీటం దగ్గర పడుకోపెడతాడు. ఇక గాయత్రీ దేవి ఆత్మ వచ్చి నయనికి ధైర్యం చెప్తుంది. నయని గాయత్రీదేవి ఆత్మతో తన బిడ్డని కాపాడమని వేడుకుంటుంది.
విక్రాంత్: బ్రో నయని వదిన తొలిబిడ్డకు గండం వచ్చిందే అనుకుందాం.. వదిన ఎందుకు గాయత్రీ పాపని వెంట పెట్టుకొని వెళ్తుంది.
విశాల్: నయని అయితే నాకు చెప్పకుండా వెళ్లదు.
తిలోత్తమ: చెప్పలేం విశాల్ నయని అయితే నీకు చెప్తే మీ నలుగురికి అపాయం తలెత్తొచ్చని నీకు ఏ విషయం చెప్పకుండా వెళ్లొండొచ్చు.
సుమన: ఇంకో విషయం తెలుసా పిన్ని గాయత్రీ దేవి అత్తయ్య ఆత్మ కూడా ఈ రోజు ఈ ఇంటిని వదిలి వెళ్లిపోతుందని గంటలమ్మ చెప్పింది.
తిలోత్తమ: నిజమే ఆ విషయం మనం మర్చిపోయాం.
వల్లభ: అయితే ఈ లెక్కన నయని, గాయత్రీ, పెద్దమ్మ ఆత్మ ముగ్గురు ఇంటి నుంచి వెళ్లిపోయారన్నమాట.
విశాల్: మనసులో.. నయని ఎక్కడికి వెళ్లుంటుంది. నయనికి ఈ పాటికి గాయత్రీ పాపే మా అమ్మ అని తెలిసిపోయి ఉంటుందా.. పాపకి ఆపద వస్తే నయనికి తెలీదు కదా..
రక్తపుంజి మాంత్రికుడు గాయత్రీపాపని బలి తీసుకో అని రక్త చాముండి అమ్మవారిని బలి ఇవ్వడానికి మంత్రాలు చదువుతాడు. నయని అమ్మగారు నా బిడ్డను కాపాడమని కోరుతుంది. ఆత్మగా ఉన్న మీరు నా బిడ్డని కాపాడమని చెప్తుంది. దాంతో గాయత్రీ దేవి ఆత్మ నయని కొంగులోని మంత్ర పుష్పం తీయమని దాన్ని అక్కడ బలి ఇవ్వడానికి ఉంచిన పెద్ద కత్తి మీద పెట్టమని చెప్తుంది. నయని అలాగే చేస్తుంది. ఆ కత్తి నుంచి అగ్ని వస్తుంటుంది. ఆ కత్తిని తీసుకోమని నయనికి గాయత్రీదేవి ఆత్మ చెప్తుంది. నయని కత్తి తీయలేకపోతుంది. చాలా బరువుగా ఉన్న ఆ కత్తిని నయని పెకిలిస్తుంది. ఇక గాయత్రీ దేవి ఆత్మ నయనిని తనలోకి రమ్మని చెప్తుంది. నయనిలోకి గాయత్రీ దేవి ఆత్మ ప్రవేశిస్తుంది. నయని కత్తి పట్టుకొని మాంత్రికుడి దగ్గరకు వెళ్లి గండరఖడ్గం తన చేతిలో ఉందని గాయత్రీదేవి ఆత్మ, నయని మంత్రాలు చెప్పి మాంత్రికుడి తల నరికేస్తుంది. ఇక ఆత్మ నయని నుంచి వేరైతే నయని పాపని ఎత్తుకొని గాయత్రీ దేవి ఆత్మని శాంతించమని అంటుంది.
ఇంట్లో అందరూ నయని, పాప గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే బాగున్నని పావనా అంటాడు. వాళ్ల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని తిలోత్తమ అంటుంది. నయని వెంట గాయత్రీ పాప వెళ్లింది కాబట్టి ధైర్యంగా ఉండమని హాసిని అంటుంది. ఇక గంటలమ్మ గెటప్ మార్చి కళ్లజోడు, చేతిలో హ్యాండ్ బ్యాగ్, సాలువా కప్పుకొని స్టైల్‌గా వస్తుంది. ఇంట్లోకి వచ్చి అందరితో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. ఎవరూ అని అందరూ షాక్ అయిపోయి అడుగుతారు. దాంతో గంటలమ్మ బెంగాల్ బంగార్ సోనాలి అని అంటుంది. తిలోత్తమ తన బిజినెస్‌లో పార్టనర్ అని చెప్తుంది. ఇక వల్లభ దగ్గరకు వెళ్లగానే తాను గంటలమ్మని అని చెప్తుంది. ఇక సోనాలిగా వచ్చిన గంటలమ్మ అందరి ముందే కూర్చొంటుంది.
ఇంతలో నయని గాయత్రీ పాపని ఎత్తుకొని చేతిలో గండర ఖడ్గం పట్టుకొని రక్తం చిందిన ముఖంతో ఇంటికి వస్తుంది. అందరూ నయనిని చూసి షాక్ అయిపోతారు. నయని పాపని విశాల్‌కి ఇస్తుంది. నయని కత్తిని తీసుకొని గాయత్రీ దేవి ఫొటో దగ్గరకు వెళ్తుంది. తిలోత్తమ, సోనాలిలా ఉన్న గంటలమ్మలు కూడా షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.