అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, దీపలను రెస్టారెంట్‌కి తీసుకొచ్చిన కార్తీక్.. స్వప్న శ్రీధర్‌ను కాంచన, కార్తీక్‌లతో చూసేస్తుందా..!

Karthika Deepam 2 Serial Episode కార్తీక్ తన ఫ్యామిలీని రెస్టారెంట్‌కి తీసుకెళ్లగా స్వప్న, కాంచనలు కూడా అదే రెస్టారెంట్‌కి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు. దీప శౌర్యని వారం రోజులు స్కూల్‌కి వెళ్లొద్దన్న మాట విని ఎందుకని అడుగుతాడు. దానికి దీప మనసులో.. నర్శింహ గురించి చెప్పకూడదు అనుకుంటుంది. తన సమస్యను తానే పరిష్కరించుకోవాలి అని కార్తీక్‌కి నర్శింహ గురించి చెప్పకుండా ఊరు వెళ్లాలని అంటుంది. 

కార్తీక్: మనకంటూ ఏమీ లేని చోటుకి మనిషి వెళ్లినా ఉపయోగం లేదు అండీ. ఏంటి రౌడీ నువ్వేమంటావ్. 
శౌర్య: నేను నీతో మాట్లాడను పో. నేను ఫోన్ చేసి రమ్మని చెప్పినా రాలేదు. నీ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా. కావాలనే నువ్వు నా దగ్గరకు రాలేదు కదూ. నువ్వు ఫంక్షన్‌కి వచ్చావ్ కానీ నా దగ్గరకి రాలేదు. పిలిచాను కదా వినిపించలేదా. పిలిస్తే వస్తాను అన్నావ్ కదా. 
దీప: కార్తీక్ బాబుకి వేరే పనులు ఉండవా ఎందుకు అలా అడుగుతున్నావ్.
శౌర్య: ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న గొడవ మధ్యలో నువ్వేంటి. 
కార్తీక్: మీరు కాసేపు సైలెంట్‌గా ఉండండి. తను పిలిచింది నేను రాలేదు అని ఇలా అంటుంది. 
శౌర్య: ఇంకెప్పుడూ నన్ను వదిలేయను అని నేను పిలిస్తే వస్తాను అని మాట ఇవ్వు కార్తీక్.
దీప: శౌర్య కార్తీక్ బాబుకి చాలా దగ్గర అయిపోయింది. 
శౌర్య: కార్తీక్ ప్రామిస్ చేయడంతో.. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నువ్వు లేకపోయినా అలానే ఉంటుంది. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. 

కార్తీక్ శౌర్యకి చాక్లెట్ ఇస్తాడు. ఇక కార్తీక్ దీపని, శౌర్యని తీసుకొని హోటల్‌కి వెళ్దామని అంటాడు. దీప వద్దు అంటే తన తల్లిదండ్రులు కూడా వస్తున్నారు అని చెప్తాడు. ఇక దీప ఇంటికి వచ్చి వంట చేసినందుకు కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు. వారం రోజులు శౌర్యని స్కూల్‌కి పంపకపోవడానికి కారణం చెప్పమని కార్తీక్ అంటాడు. దీప చెప్పకపోతే ఎలా అయినా తెలుసుకుంటాను అని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న ఇంటిలో అందరూ నిశ్చితార్థం, పెళ్లి ఎక్కడ చేయాలా అని ఆలోచిస్తుంటారు. దానికి పారిజాతం మనసులో కార్తీక్ నిర్ణయం చెప్పకుండానే వీళ్లు ఓవర్ చేస్తున్నారు అని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. 

కార్తీక్: మనసులో.. నువ్వు ఏంటో తెలిశాక నీతో జాగ్రత్తగా ఉంటాను పారు. నువ్వు అనుకున్నది అయితే జరగదు. 
పారిజాతం: మనసులో.. ఎంత మందిని చంపి అయినా సరే నీ చేతితో నా మనవరాలి మెడలో తాళి కట్టిస్తా. 
కార్తీక్: జ్యోత్స్న కాసేపటిలో మనం డేట్‌కి వెళ్తున్నాం రెడీగా ఉండు. మన రెస్టారెంట్‌లోనే అమ్మానాన్న, నువ్వు నేను, శౌర్య దీప.
పారిజాతం: నీతో పాటు వాళ్లు ఎందుకు.
కార్తీక్: శౌర్యని సరదాగా తీసుకెళ్దామని అనుకున్నా. మా అమ్మ దీపని తీసుకురమ్మని చెప్పింది. మనసులో.. సారీ అమ్మ వీళ్ల మనసు తెలిసి నీ పేరు అడ్డు పెట్టుకున్నా.. 
పారిజాతం: కాంచన అలా అనదే.
కార్తీక్: ఫోన్ చేయమంటావా. ఓకే జ్యోత్స్న నువ్వు అయితే రెడీగా ఉండు నేను వచ్చి పిక్ చేసుకుంటా.
జ్యోత్న్స: వద్దులే బావ. నేను నా కారులో వస్తాను. 
కార్తీక్: ఓకే జ్యోత్స్న..

మరోవైపు స్వప్న, కావేరి కూడా రెస్టారెంట్‌కి బయల్దేరుతారు. స్వప్న కార్తీక్‌కి కాల్ చేసి మంచి రెస్టారెంట్ ఏదని అడుగుతుంది. దానికి కార్తీక్ జ్యోత్స్న రెస్టారెంట్‌కి రమ్మని తాను కూడా అక్కడే ఉన్నాను అని చెప్తాడు. ఇక కార్తీక్ వాళ్లు రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. శౌర్య దీపతో మా కార్తీక్ రెస్టారెంట్ చాలా పెద్దది అని నీ టిఫెన్ సెంటర్ ఇంత ఉంటుందా అంటే జ్యోత్స్న చిన్నదని అంటుంది. దానికి కార్తీక్ దీపకు సపోర్ట్‌గా మాట్లాడి భవిష్యత్‌లో ఆ టిఫెన్ సెంటర్ పెద్ద హోటల్ అయితే ఆశ్చర్యం లేదు అంటాడు. దానికి జ్యోత్స్న మనసులో బాగానే సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఇక శ్రీధర్‌ కూడా దీపని ఇంత సపోర్ట్ చేస్తున్నాడు ఏంటా అని అనుకుంటాడు. ఇక గణేష్ అని హోటల్ మ్యానేజర్ వచ్చి పెళ్లి ఎప్పుడు అంటే జ్యోత్స్న రెండు నెలల్లో చేసుకుంటాను అని అంటుంది. కాంచన కూడా జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తుంది. అందరూ జ్యోత్స్నని దండం పెట్టడం చూసిన శౌర్య ఎందుకలా అని అడిగితే జ్యోత్స్న ఈ రెస్టారెంట్‌కి ఓనర్ అని చెప్తుంది. 

శ్రీధర్: దీపని ఎందుకు తీసుకొచ్చాడు. కాస్త ముందే తెలిసుంటే వద్దు అనేవాడిని. ఏదో ఒక రోజు దీప నా రెండు పెళ్లిల గురించి బయట పెట్టడం ఖాయం.
జ్యోత్స్న: పెళ్లి విషయం మాట్లాడటానికి దీప రావడం ఎందుకు కావాలనే శౌర్యని అడ్డుపెట్టుకొని దీప వచ్చిందా ఏంటి. 

ఇక స్వప్న, కాంచనలు అదే రెస్టారెంట్‌కి రావడం దీప చూస్తుంది. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తుంది. శ్రీధర్ వాళ్లు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. దీప వైపు చూసిన శ్రీధర్‌కి దీప సైగ చేస్తుంది. దాంతో శ్రీధర్ కాంచన, స్వప్నలను చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు సంపాదించి తిరిగి వస్తానని మహాకి ఛాలెంజ్ చేసిన కిరణ్.. రేవతికి అండగా సీత, విద్యాదేవి!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 12th:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
నువ్వులేక నేను లేను:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget