Karthika Deepam 2 Serial Today January 31st: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అమ్మడానికి సిద్ధపడ్డ దీప చివరి నిమిషంలో అదుర్స్.. దాసు రాతలకు అర్థమేంటి?
Karthika Deepam 2 Serial Today Episode దీప బాండ్ పేపర్‌ని చింపేసి కార్తీక్‌ని ఇవ్వనని జ్యోత్స్నతో చెప్పడం కార్తీక్, దీప ఇద్దరూ జ్యోత్స్నని తిట్టి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపకి జ్యోత్స్న కోటి రూపాయల చెక్ ఇచ్చి కార్తీక్‌ని తనకి వదిలేయమని చెప్తుంది. సరిపోకపోతే ఇంకో కోటి కూడా ఇస్తానని అంటుంది. నీ బిడ్డ చావు బతుకులలో ఉంది నీ కూతుర్ని నువ్వే కాపాడుకోవాలి. కాబట్టి సంతకం పెట్టి కూతుర్ని కాపాడుకో అని అంటుంది. జ్యోత్స్న ఎమోషనల్ అయిపోయి దీప నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో నా ప్రాణాన్ని నాకు ఇచ్చేయ్ అని అంటుంది. దీపని తీసుకెళ్లి సంతకం పెట్టమని బాండ్ చూపిస్తుంది. దీప ఏం మాట్లాడకుండా పాపని గుర్తు చేసుకొని ఏడుస్తూ సంతకం పెట్టడానికి రెడీ అయిపోతుంది. కార్తీక్ వెనకాలే నిల్చొని ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. దీప చాలా ఆలోచించి ఏడుస్తూ బాండ్ పేపర్ చింపేస్తుంది. జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దీప ఏం చేస్తున్నావ్ నీకు పిచ్చా అని అరుస్తుంది. దీప ఆ పేపర్లు చింపేసి జ్యోత్స్న మీద విసురుతుంది.
దీప: ఏంటే నువ్వు డబ్బులిస్తావా నేను కార్తీక్ బాబుని అమ్మేయాలా. కార్తీక్ బాబు మనిషి అనుకున్నావా వస్తువు అనుకున్నావా. ఎక్కువ చేస్తే చెప్పు తీసి కొడతా. నా కార్తీక్ బాబుకి నువ్వు వెల కట్టావ్. నేను గుడి కట్టాను. నువ్వు ఆయన్ని కాల దగ్గరకు తెచ్చుకోవాలి అనుకుంటున్నావ్. నేను ఆయన కాళ్ల దగ్గర ఉంటే చాలు అనుకుంటున్నా. కోటలో ఆయన నీ కాళ్ల దగ్గర ఉండే కంటే నా గుడిసెలా రాజులా ఉండటమే నాకు ఇష్టం. నువ్వు అడిగిన ప్రశ్నలకు కార్తీక్ బాబుతో సమాధానం చెప్పిస్తా. కార్తీక్ బాబు చూశారా.
కార్తీక్: అంతా చూశాను దీప. జ్యోత్స్న చేసే పనికి మామూలుగా అయితే తిట్టేవాడిని. కానీ ఇక్కడ సమాధానం నీ మీద ఆధారపడింది. నువ్వు పేపర్ చింపేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి అనిపించింది. ఇది కదా దీప అని అరవాలి అనిపించింది. కానీ మాటలు రాలేదు దీప. ఎందుకు తెలుసా నువ్వు అడిగిన ప్రశ్నలకు కార్తీక్ బాబుతో సమాధానం చెప్పిస్తా అని చివర్లో అన్నావు చూశావా అందుకే ఆగిపోయాను. ఇప్పుడు నేను ఎవరికి ఏం సమాధానం చెప్పాలి.
దీప: రండి. జ్యోత్స్నకి మీరు ప్రాణం అంట. అందుకే మీకు వెల కట్టి నా దగ్గర నుంచి తీసుకోవాలని వచ్చింది. కొనడానికి తను ఎవరు? అమ్మడానికి నేను ఎవర్ని. మీ బావ నీ ఎదురుగా ఉన్నారు. నువ్వు అడుగు తనకి నీ మీద ప్రేమ ఉంటే వెళ్లొద్దు అని నేను ఆపను. చెప్పండి కార్తీక్ బాబు మీకు జ్యోత్స్న అంటే ఇష్టమా.
కార్తీక్: నా మనసు నీకు తెలీదా దీప. నిన్ను కొట్టముందే వెళ్లిపో జ్యోత్స్న.
జ్యోత్స్న: ఇలా అయితే దీప కూతుర్ని కాపాడలేవు బావ. దీప నువ్వు ఇలా అయితే పాపని కాపాడుకోలేవు.
దీప: వెళ్లిపో జ్యోత్స్న తన మాటే నా మాట.
జ్యోత్స్న 24 గంటల టైం ఇస్తాను ఆలోచించుకో దీప అని చెప్పి నువ్వు మా బావతో ఎన్నాళ్లు ఉన్నా వంట మనిషివే ఇది బాగా గుర్తు పెట్టుకో అని అంటుంది. దీప ఏడుస్తూ జ్యోత్స్నతో తాను విసిగిపోయానని కార్తీక్‌తో చెప్తుంది. కాశీ ఇంటికి వస్తాడు. దాసు లేచి బయటకు వెళ్లడం చూస్తాడు. పట్టుకొని నువ్వు ఎప్పుడు స్ఫ్రుహాలోకి వచ్చావ్ నాన్న అని అడుగుతాడు. దాసు ఏం మాట్లాడడు. మళ్లీ దాసుని పడుకోపెడతాడు. స్వప్నని పిలిచి దగ్గరే ఉండి చూసుకోమన్నాను కదా జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఇక కాళ్ల దగ్గర ఓ పేపర్ పడి ఉండటం కాశీ చూస్తాడు. అందులో మోసం.. వదలను.. కూతురు.. కొట్టారు.. అన్యాయం..వస్తాను.. అని ఇలా పదాలు రాసి ఉంటాయి. నాన్న ఏంటి ఇలా అర్థం కాకుండా రాశారని ఆ పదాలు చదువుతాడు. సంబంధం లేకుండా ఈ పదాలు రాశారేంటి అని అనుకుంటాడు. కూతురు అంటే ఎవరు నేను కొడుకుని కదా అని అడుగుతాడు. ఆరోగ్యం బాలేదు కదా అలా రాసుంటారులే అంటుంది స్వప్న. కాశీ తండ్రి దగ్గర కూర్చొని నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ నాన్న అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

