అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today December 6th: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!

Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న కోసం శివనారాయణ కార్తీక్ ఇంటికి వెళ్లి పిలవడం కార్తీక్ తాత మీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్నకి ఎలా ఉందో ఏంటో అని కాంచన ఫీలైతే కార్తీక్ పారిజాతానికి కాల్ చేస్తాడు. కార్తీక్ ఎందుకు కాల్ చేశాడో అనుకొని ఏంట్రా నాకు కాల్ చేశావ్ అంటుంది. దాంతో కాంచన పిన్ని నేను అని చెప్పి జ్యోత్స్నకి ఎలా ఉందని అడుగుతుంది. నా మేనకోడలు అని అంటే ఇంకా నీకు వరసలు మనుషులు గుర్తున్నారా అని అడుగుతుంది. ఇక కార్తీక్ పారిజాతం మీద అరుస్తుంది. ఇక జ్యోత్స్నకి ఎలా ఉందని అంటే బాగానే ఉంది ఈరోజే డిశ్చార్జీ అయిందని అంటుంది. ఇక కార్తీక్ ఫోన్ తీసుకొని మాట్లాడి అలసిపోయి ఉంటావు కదా ఫోన్ పెట్టేయ్ అంటాడు.

ఇక కార్తీక్ అలాంటి బంధుత్వాలు మనకు వద్దని అంటాడు. దీపని మారమని చెప్తాడు. మరోవైపు జ్యోత్స్నతో శివనారాయణ నీకు నచ్చినట్లు ఉండమ్మా నీకోసమే ఆస్తులు కూడగట్టాం అంటుంది. ముందులా ఉండలేను తాత అని అంటుంది.

శివనారాయణ: నవ్వు హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లావమ్మా.
జ్యోత్స్న: బావ కోసం. 
శివనారాయణ: అసలు కార్తీక్‌తో ఏం మాట్లాడాలి అనుకున్నావ్.
జ్యోత్స్న: చాలా బాధ పడుతూ.. ఏమో తాత నేను డిజైన్ చేసుకున్న లైఫ్ స్పాయిల్ అయిందని అర్థం అయ్యాక నాకేదో ఒంటరైపోయిన ఫీలింగ్ నా చుట్టూ ఎవరూ లేరు నా కోసం ఎవరూ లేరు అనిపిస్తుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలి అనిపిస్తుంది. ఇది వరకు మన ఇళ్లు ఎంతో సంతోషంగా ఉండేది తాత నువ్వు నేను అమ్మానాన్న గ్రానీ మామయ్య అత్త బావ ఇళ్లంతా ఎప్పుడూ ఏదో ఒక సందడి ఉండేది. ఏదో ఒక సెలబ్రేషన్. అందరం కలిసి తినడం.. భలే చక్కగా ఉండేవాళ్లం నాకు నేను చాలా రియల్‌గా కనిపించేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నేను ఫేక్‌లా కనిపిస్తున్నాను. ఆ సందడి సంతోషం మన ఇంటిని వదిలి దూరంగా వెళ్లిపోయింది తాత నువ్వు మళ్లీ తీసుకురాగలవా ఇలా నిన్ను అడగాలి అని ఉంది కానీ అడగను ఎందుకంటే అది మళ్లీ జరగదు. నన్ను నేనే వదులుకుంటాను. నన్ను నేనే మిస్ అయ్యాను మళ్లీ నాకు నేను దొరుకుతానో లేదో. అని చెప్పి వెళ్లిపోతుంది.
పారిజాతం: మనసులో ఇప్పుడు ఇదంతా మనవరాలు ఎందుకు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదు. 

మరోవైపు కాంచన బాధపడుతుంటే అనసూయ ఓదార్చుతుంది. నా మేనకోడలికి చిన్న గాయం అయితే నేను రాత్రంతా నిద్ర లేకుండా దాని కోసమే ఉన్నాను అది అంటే నాకు అంత ప్రేమ ఇప్పుడు నేను కనీసం తనని చూడటానికి వెళ్లలేకపోతున్నాను అని అంటుంది. మా నాన్నకి నేను ప్రాణం ఇప్పుడు ఆయన్ను చూడలేకపోతున్నానని ఏడుస్తుంది. ఇంతలో శివన్నారాయణ ఇంటికి వస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. నాన్న వచ్చాడంటే ఏదో గొడవ జరిగిందని కాంచన అనుకుంటుంది. 

శివనారాయణ: దీపతో. నిన్ను నా ఇంటి గుమ్మం తొక్కొద్దు అన్నాను కానీ నేనే నీ ఇంటి గుమ్మం తొక్కను. బంధాలకు మనిషి ఎప్పుడూ బానిసే వాటికోసం ఎప్పుడూ తెంచుకోవడమే కాదు తల దించుకోవడం కూడా అని ఈ రోజు ఓ సరికొత్త గుణపాఠం నేర్చుకున్నాను. ఇంత వరకు వచ్చాక లోపలికి రాకుండా ఎలా ఉంటాను వస్తాను. 
దీప: తాతయ్య మనసు మారినట్లుంది ఈ కుటుంబంతో కలిసిపోయినట్లున్నారు. 
కార్తీక్: మనసు మార్చుకొని కూతురి కోసం ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా ఇలా బిగించుకొని మాట్లాడుకోవాలా నవ్వుతూ మాట్లాడుకుందాం తాత.
శివనారయణ: వచ్చింది కూతురి కోసమే కానీ మనసు మార్చుకుంది మనవరాలి కోసం. కొడుకులు కూతుళ్ల దగ్గర నా పంతం మనవరాలి దగ్గరకువచ్చినప్పుడు నీరుగారిపోయింది. సుమిత్ర వాళ్లు రావడానికి ఇంకా టైం పడుతుంది. జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా ఉంది. దాన్ని చూస్తే జాలేస్తుంది. దాని మాటలు వింటే ఏడుపొస్తుంది. దాని కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది అందుకే మీ ఇంటికి వచ్చా. 
కాంచన: నా మేనకోడలి కోసం నేం ఏం చేయాలి నాన్న చెప్పండి చేస్తా.
శివనారాయణ: జ్యోత్స్న మీ మీద బెంగ పెట్టుకుంది అమ్మా మీరు వచ్చి కొన్నాళ్లు మా ఇంట్లో ఉండండి.
కార్తీక్: ఆఫర్ అదిరిపోయింది తాత  కొన్నాళ్లు అంటే ఎన్నాళ్లు మళ్లీ మీకు కోపాలు వచ్చే వరకా. ఇప్పుడు తాత అడిగినట్లే నేను ఆ రోజు అడిగా ఆ రోజు నేను అడిగిందే ఈ రోజు తాత అడుగుతున్నాడు మనం ఇప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలి. 

కార్తీక్ చాలా కోప్పడతాడు. దానికి దీప కలవడానికి అవకాశం వచ్చిందని నాన్న నా కూతురికే కాదు మీ అమ్మగారికి కూడా కావాలని అంటుంది. మీ అమ్మగారికి నిర్ణయం తీసుకోమని చెప్పండి దాన్ని మనం గౌరవిద్దామని అంటుంది. ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భార్య మాట వింటారు వీడు అది నిరూపిస్తున్నాడని అంటుంది. ఇక కార్తీక్ శౌర్యని తీసుకొని వస్తాను అంటే శివనారాయణ నేను వాళ్లని రమ్మని చెప్పలేదు కేవలం నిన్ను మీ అమ్మని మాత్రమే రమ్మన్నాను అని అంటాడు. దాంతో కార్తీక్ ఏ మెలికా లేకుండా మాట్లాడుతున్నారని అనుకున్నా అని అందరూ అంటే మేం ఇద్దరమే అని నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదని అంటాడు. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదని అంటే దానికి కార్తీక్ నేను ఎక్కడికి వెళ్లినా నా భార్య నా కూతురు నాతోనే వస్తారని అంటాడు. దీప నచ్చచెప్పబోతే నిన్ను ఎవరైనా నీ భర్త వద్దు నువ్వు మాత్రమే రావాలి అంటే వెళ్తావా అంటే దీప వెళ్లను అంటుంది. దానికి కార్తీక్ ఇప్పుడు నేను అదే చెప్పానని అంటాడు. నేను ఎక్కడితో వచ్చినా నా కూతురు భార్యతోనే వస్తానని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజుకి గాయం.. అందరికీ షాకిచ్చిన ముత్యాలు ప్రవర్తన.. హారతి, జీవన్‌లను చూసేస్తారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget