Karthika Deepam 2 Serial Today December 21st: కార్తీకదీపం 2 సీరియల్: అమరన్‌ని మించిపోయిన ఎమోషన్స్.. కట్టుబట్టలతో వెళ్తూ కన్నీరు పెట్టించేసిన కార్తీక్ ఫ్యామిలీ..!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ వాళ్లని వెళ్లొద్దని దశరథ్ చెప్పినా వినకుండా కార్తీక్ వాళ్ల ఒంటి మీద బంగారం తీసేసి అన్నీ వదిలేసి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ తాత కండీషన్‌కి ఒప్పుకోనని చెప్పి కట్టు బట్టలతో ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోతానని చెప్తాడు. కాంచన కూడా కొడుకు మాటే తన మాట అని తేల్చి చెప్తుంది. దానికి జ్యోత్స్న అత్తా నీ కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతా అంటున్నాడు అర్థమైందా అని అడుగుతుంది. దానికి కార్తీక్ మా అమ్మకి బాగా అర్థమైంది నీకే అర్థం కాలేదు అంటాడు.
కార్తీక్: దీప వెళ్లి నీ బ్యాగ్ తీసుకొని రా. నీకు సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంట్లో వదలొద్దు. అలాగే ఈ ఇంటికి సంబంధించిన ఏ వస్తువు అందులో ఉంచొద్దు. అనసూయ గారు మీరు వెళ్లి మీ సంచి తీసుకురండి. మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా బయల్దేరుదాం.
జ్యోత్స్న: రా డాడీ బావని అత్తని నువ్వే ఆపాలి.
దశరథ్: ఆపడం ఏంటి.
జ్యోత్స్న: బావ ఇంటి నుంచి వెళ్లిపోతా అంటున్నాడు డాడీ.
దశరథ్: వెళ్లిపోవడం ఏంట్రా అన్నీ నీ ఇష్టాలేనా. ఇంతకు ముందు కంపెనీ నుంచి వెళ్లిపోయావ్ ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోతావా అన్ని నిర్ణయాలు నీకు నచ్చినట్లే తీసుకుంటావా. నువ్వు మాట్లాడవేంటి చెల్లమ్మా. నీ కొడుకు తప్పు చేస్తుంటే నువ్వు అయినా చెప్పాలి కదా.
కాంచన: అలా చెప్పాల్సి వస్తే నేను చాలా మందికి చెప్పాలి అన్నయ్య. కానీ చెప్పలేను.
దశరథ్: ఇళ్లు వదిలేసి వెళ్లిపోవడం ఏంటి అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా.
కాంచన: అది నాన్నని అడుగు.
శివనారాయణ: నీకు అంతా తర్వాత చెప్తా ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ మేనల్లుడు నా మీద సవాలు చేశాడు. నా సంపాదన ఏదీ వద్దంట వాడికి. వాడి సొంత డబ్బుతోనే రెస్టారెంట్ పెట్టి నా మీద గెలుస్తాడంట. అందుకే అన్నీవదిలేసి కుటుంబాన్ని తీసుకొని వెళ్లిపోతున్నాడు.
దశరథ్: రేయ్ కార్తీక్ ఏంట్రా ఇది మతుండే ఈ నిర్ణయం తీసుకున్నావా.
కార్తీక్: నేను నా కాళ్ల మీద బతకాలి అనుకుంటున్నా మామయ్య. నాకేం కావాలో అది నేనే సంపాదించుకుంటా. ఇదంతా మీది అందుకే వదిలేసి వెళ్లిపోతున్నా.
దశరథ్: ఏంటి చెల్లమ్మా ఇది మాది అంటే మీది కాదా.
కాంచన: కాదు అని నాన్నే చెప్పాడు అన్నయ్య.
శివనారాయణ: కోడలు పేరు మీద రెస్టారెంట్ పెట్టడానికి తండ్రి ఆస్తులు కావాల్సి వచ్చాయి నా కూతురికి. కానీ ఈ విషయం చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి మాత్రం తండ్రి గుర్తు రాలేదు. నేను వచ్చి అడ్డు పడ్డాను కాబట్టి ఈ లోను పేపర్లు చిరిగిపోయాయి కానీ లేదంటే బజారులో మన పరువు ఈ దీప చేతిలో ఈ కాగితాల్లాగే చిరిగిపోయేవి.
కార్తీక్ టేబుల్ మీద తన పర్స్‌లోని క్రెడిక్, డెబిట్ కార్డ్స్, వాచ్, రింగులు, చైన్ అన్నీ పెట్టేస్తాడు. ఇలా నువ్వు బయటకు వెళ్తే మన పరువు పోతుందని దశరథ్ అంటాడు ఆగమని చెప్పమని తండ్రితో చెప్తాడు. దానికి శివనారాయణ వాడికి ఈతాత కంటే ఆ దీపే ఎక్కువంట పోనీ అని చెప్తాడు. దశరథ్ ఎంత చెప్పినా ఎవరూ వినరు. కాంచన కూడా వినకుండా తన ఒంటి మీద ఉన్న బంగారం తీసి అక్కడ పెడుతుంది. అమ్మ గాజులు అని అమ్మని నాన్న దగ్గర వదిలేస్తున్నా అని దీప చేతికి వచ్చి టేబుల్ మీద పెట్టిస్తుంది.
కాంచన: మీరు ఇచ్చిన బంగారం అంతా బీరువాలో ఉంది నాన్న నా ఒంటి మీదదంతా అక్కడ పెట్టేశా. నాన్న ఈ తాళి కూడా మీరు ఇచ్చిందే నాన్న ఇది తీసి ఇచ్చేయమంటారా. నాన్న భర్త బతికుండగా తాళి తీయకూడదు కదా. ఈ ఒక్కటి ఉంచుకోనా నాన్న. అన్నయ్య నాన్న మాట్లాడటం లేదు పోనీ నాన్న దీనికి ఎంత రేటు కడతాడో అడుగు అన్నయ్యా. నా కొడుకు డబ్బు సంపాదించగానే పంపేస్తాను.
దశరథ్: చెల్లమ్మా నా వల్ల కావడం లేదు. మీరు ఇంటి నుంచి వెళ్లడానికి వీల్లేదు. వీల్లేదు. నాన్న చెల్లిని ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పు నాన్న. నిన్నే నాన్న అడిగేది. వెళ్లొద్దని చెప్పు నాన్న
శివనారాయణ: ఒక వంట మనిషి కోసం నన్ను కాదని వెళ్లిపోవాలి అనుకున్నారు అంటే వాళ్ల దృష్టిలో నేను చనిపోయినట్లే కదరా. సవాలు చేసింది వాళ్లు మనల్ని వద్దు అనుకున్న వాళ్లు మనకు వద్దు పోనీ దశరథ్.
కార్తీక్: అన్నీ వదిలేశాం తాత మేం కట్టు బట్టలతో మాకు సంబంధించిన వాటినే తీసుకెళ్తాం తాత.
కార్తీక్ శౌర్యని తీసుకురావడానికి వెళ్తాడు. పడుకున్న శౌర్యని లేపి బయటకు వెళ్తున్నాం పద అని స్కూల్ బ్యాగ్ సర్దుతాడు. శౌర్య ఎక్కడికి అని అడుగుతుంది. తర్వాత చెప్తా అని బయట ముద్దులు తాత అందరూ ఉన్నారు భయపడొద్దు అమ్మ కూడా బ్యాగ్ తీసుకొని బయట ఉంది కంగారు పడకు ఏం అడగొద్దు అని అంటాడు. ఇక చిన్నతనంలో దీప తనకు ఇచ్చిన లాకెట్ కూడా తీసుకుంటాడు. నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా దీప మా బావని పెళ్లి చేసుకొని నీ స్థాయికి తీసుకొచ్చావ్. రోడ్డున పడేశావ్.. నువ్వొక దరిద్రం నీతో ఉంటే ఎవరైనా దరిద్రమైపోతారని అంటుంది. శౌర్య ముద్దుల తాత, తాతయ్య, జ్యో అని పలకరిస్తుంది. మాతో పాటు మీరు వస్తారా అని అడుగుతుంది. కార్తీక్ వాళ్లు ఎవరూ రారని చెప్పి దీపని తీసుకొని వెళ్లిపోతాడు. కార్తీక్ నేను పుట్టిన ఇళ్లు అని మనసులో అనుకొని బాధ పడతాడు. కాంచన మనసులో ఈ ఇంటితో రుణం తీరిపోయిందని అంటుంది.. కార్తీక్ ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్లిపోతాడు. జ్యోత్స్న మనసులో నిన్ను వదలనే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటాడుతూనే ఉంటానని అనుకుంటుంది. ఇక శివనారాయణ వాళ్లు ఇంటికి వచ్చి డల్‌గా కూర్చొంటారు. సుమిత్ర, పారిజాతం ఏమైందని అడుగుతారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయారని దశరథ్ చెప్తాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

