అన్వేషించండి

Karthika Deepam 2 August 10th: కార్తీకదీపం 2 సీరియల్: నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని విడాకులు అడిగిన దీప.. కార్తీక్ ఎమోషనల్ స్పీచ్!

Karthika Deepam 2 Serial Episode నర్శింహకు రెండో పెళ్లి అయిందని చెప్పి దీప విడాకులు అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కోర్టు దగ్గర పారిజాతం, జ్యోత్స్నలు దీపతో మాట్లాడుతారు. మా ఇంటి పరువు తీశావు కదే అని పారిజాతం దీపని అంటుంది. తన మనవరాలిని పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కించావని, మనవడిని కోర్టు చుట్టూ తిప్పిస్తున్నావని నీ స్థాయి ఇదే మమల్ని కూడా నీ స్థాయికి లాగుతున్నావని సీరియస్ అవుతుంది. నీ ఆటలకు ముగింపు వచ్చిందని కార్తీక్‌ని చూసి వాళ్లు వెళ్లిపోతారు. ఇక దీప లాయర్‌తో మాట్లాడుతుంది.  విడాకులు తీసుకుంటే నా కూతుర్ని నాకు ఇచ్చేస్తారా అని అడుగుతుంది. అందరూ లోపలకి వెళ్తారు. సుమిత్ర, కాంచన, శ్రీధర్‌లు కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు.

కాంచన: నిన్ను ఒకటి అడుగుతా చెప్పు వదినా. కూతురి నిశ్చితార్థం ఆగిపోయింది. కాబోయే అల్లుడు తనకి సంబంధం లేని విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మాకు అయితే భోజనం కూడా చేయాలి అనిపించడం లేదు వదిన మరి నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావ్. 
సుమిత్ర: సరే నేను నిన్ను ఓ మాట అడుగుతా సమాధానం చెప్పు వదిన. కార్తీక్ మీద నీకు ఏమైనా అనుమానం ఉందా.
కాంచన: నా కొడుకు గురించి నాకు తెలుసు అనుమానం ఎందుకు.
శ్రీధర్: నీ కొడుకు గురించి నీకు తెలుసు కానీ జనాలకు తెలీదు కదా. ఆ నర్శింహ ఇంటికి వచ్చి ఎంత గొడవ చేశాడో తెలుసుకదా. కార్తీక్ దీపకి సపోర్ట్ చేయడం వల్ల అందరూ ఇంటికి వచ్చి నానా మాటలు అంటున్నారు. ఇప్పటికే ఇంటి పరువు బజారున పడింది. దీప అయినా చెప్పాలి కదా అతనికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని. కోర్టు బోనులో ముద్దాయిగా నా కొడుకు నిలబడుతున్నాడు.
సుమిత్ర: ఇంట్లో ఉన్న మనమే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. దీపకు నాకు ఎంత అభిమానం ఉందో వాడికి అంతే ఉంది. నేను ఆడదాన్ని కాబట్టి నాకు ఎవరూ ఏమీ అనడం లేదు వాడిని అంటున్నారు. మన పిల్లల్ని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. వదినా నేను కోర్టుకి వెళ్తా మీరు వస్తారా.
కాంచన: వస్తా వదిన.
  
వీవీ: దీప లాంటి వ్యక్తి దగ్గర నా క్లైంట్ ఆరేళ్ల కూతురు శౌర్య ఉండటం ఏమాత్రం మంచిది కాదని పాపని తన తండ్రికి అప్పగించాలని కోర్టు వారిని కోరుతున్నా.
జ్యోతి: ఎవరితో అయితే నా క్లైంట్‌కి సంబంధం ఉందని కొన్ని ఆధారాలు చూపించి అదే నిజం అని నమ్మిస్తున్నారు అది నిజం కాదు అని నా కచ్చితమైన నమ్మకం. 
వీవీ: అలా అయితే కార్తీక్‌క్ గారిని క్రాజ్ ఎగ్జామిన్ చేయడానికి మీ అనుమతి కోరుతున్నా. దీప మీకు ఎన్నాళ్లుగా తెలుసు. 
కార్తీక్: కొన్ని నెలలుగా తెలుసు మా అత్తయ్య అవుట్ హౌస్లోలోనే దీప పాపతో ఉంటుంది. ఇంతలో సుమిత్ర, కాంచన వస్తారు. 
కాంచన: కార్తీక్‌ని బోనులో నిల్చొపెట్టారు.
సుమిత్ర: కొడుకుని బోనులో నిల్చొపెట్టారని బాధ పడకు దీపకు న్యాయం చేయడానికి వాడు అక్కడ నిల్చొన్నాడు.
వీవీ: దీపతో మీరు ఎందుకు ఈ విధం అయిన సంబంధం పెట్టుకున్నారు. దీప సంసారాన్ని ఎందుకు నాశనం చేశారు. దీప తండ్రికి మీరు ఎందుకు తండ్రి అని చెప్పారు. నా క్లైంట్‌కి ఎందుకు పాపని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
కార్తీక్: మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది. వాళ్లు విడిపోయింది నా వల్ల కాదు వాళ్లు విడిపోయి ఆరేళ్లు అవుతుంది. తన కూతుర్ని పెద్ద స్కూల్‌లో చదివించే స్తోమత దీపకు లేదు కాబట్టి నేను చేర్పించాను. గార్డియన్‌గా మాత్రమే నేను సంతకం పెట్టాను. కానీ అక్కడ చిన్న మిస్టేక్‌ని ఇంత పెద్దదిగా చేశారు. హాస్పిటల్‌లో నర్శింహ ఏం కండీషన్ పెట్టాడో తెలుసా. శౌర్య నా కూతురు అయితే నాకు ఇచ్చేయ్ లేదంటే వదిలేస్తా అన్నాడు. ఏం చేయాలో తెలీక పాపని కాపాడాలి అని నా కూతురని చెప్పాను. నాకు మా అత్త కూతురితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. మా నిశ్చితార్థం కూడా చెడగొట్టాడు. శౌర్యకి తండ్రి అంటే భయం కళ్లు తిరిగి పడిపోయిన పాపని పట్టుకెళ్లిపోవాలని చూశాడు. ఓ ఆడపిల్లకి సాయం చేయాలని ఇవన్నీ అనుకున్నా కానీ సంబంధం ఉండి కాదు. సాయానికి కూడా ఆడ మగ అని ఎందుకు. నడిరోడ్డు మీద అప్పుల వాళ్లు ఆడపిల్లని ఇబ్బంది పెడితే అక్కడ నేను ఉన్నాను కాబట్టి సాయం చేశా. దీప ఆత్మాభిమానం కల మనిషి తను నా దగ్గరే కాదు ఎవరి దగ్గర ఏదో ఫ్రీగా తీసుకోదు. నిందల్ని నిజం చేయకండి. తల్లీకూతుళ్లను వేరు చేయకండి.. ఎవరికీ ఏం అన్యాయం చేయని తన బతుకు బతుకుతున్న సాధారణ మనిషి దీప తనకి న్యాయం చేయండి. 
దీప: ఇక వాదించే ఓపిక నాకు లేదండి. నాకు నా భర్తతో విడాకులు ఇప్పించండి. 
వీవీ: నీ తెలివిని అభినందించకుండా ఉండలేకపోతున్నా. భర్త పేరు చెప్పడానికే ఇష్టపడని ఈ అమ్మయి విడాకులు అడుగుతుంది అంటే కూతుర్ని దక్కించుకోవడానికి ఈ ఎత్తుగడ. ఏ కారణంతో విడాకులు అడుగుతున్నారు.
దీప: కారణం ఉంది లాయర్‌ గారు భార్య ఉండగా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే విడాకులు వస్తాయా.
వీవీ: వస్తాయి ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా పడుతుంది. 
దీప: నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నా భర్త పక్కన కూర్చొన్న శోభ మా ఆయన రెండో భార్య. 
జ్యోతి: నర్శింహ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకమహాలక్ష్మి, విహారిల ఫస్ట్ మీటింగ్ అదుర్స్.. ఆదికేశవ్‌ మీద అవినాష్, ఆశ్రితలు ఫైర్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
Embed widget