అన్వేషించండి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

టీవీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కాస్మొటిక్ సర్జరీ వికటించడం వల్ల కన్నడ టీవీ నటి చేతనా రాజ్ మృతి చెందినట్టు తెలుస్తోంది.

కన్నడ వినోద పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. టీవీ నటి చేతనా రాజ్  (Chethana Raj) మృతి చెందారు. కాస్మొటిక్ సర్జరీ ఆమె ప్రాణాలు బలి తీసుకుని ప్రాథమిక సమాచారం అందుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...

కన్నడ టీవీ ప్రేక్షకులకు చేతనా రాజ్ సుపరిచితురాలు. ఆమె పలు టీవీ షోస్, సీరియల్స్ చేశారు. బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో సోమవారం (మే 16న) ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ ఫ్రీ కోసం చేతనా రాజ్ కాస్మొటిక్ సర్జరీని అశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే... సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారట. 

డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్ లోని కడే హాస్పిటల్‌కు తరలించారు. తమ ఆస్పత్రికి వచ్చేసరికి చేతనా రాజ్ మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

మరోవైపు... సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేతనా రాజ్ ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది. స్నేహితులతో కలిసి ఆమె ఆస్పత్రికి వెళ్లిందట. తమ కుమార్తె మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని చేతనా రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 21 ఏళ్లకు చేతనా రాజ్ మరణించడం పట్ల పలువురు సంతాపం (RIP Chethana Raj) వ్యక్తం చేస్తున్నారు.

చేతనా రాజ్ మృతి పట్ల ఒక నెటిజన్ భిన్నంగా స్పందించారు. ''భగవంతుడు చేతనా రాజ్ కు అందమైన శరీరం ఇచ్చాడు. గ్లామరస్ గా ఉండటం కోసం ఎందుకు దానిని చేంజ్ చేసుకోవడం! తనను తాను చంపుకోవడం? ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడవద్దు'' అని ఒకరు ట్వీట్ చేశారు.  

Also Read: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget