Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం
నటి లక్ష్మీ మంచు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా పేరేంటి? ఇతర వివరాలు ఏమిటి? అనేది తెలుసుకోండి.
Lakshmi Manchu New Movie Update: నటిగా సినిమాల ఎంపికలో లక్ష్మీ మంచుది విభిన్నమైన పంథా. ఆమె ఓ తరహా పాత్రలకు మాత్రమే పరిమితం కావడం లేదు. సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తారు. ప్రతినాయిక ఛాయలున్న క్యారెక్టర్లలో కనిపిస్తారు. కామెడీ రోల్స్ కూడా చేస్తారు. లేటెస్టుగా ఆమె ఒక సినిమా స్టార్ట్ చేశారు. కథ ఏమిటి? దర్శకుడు ఎవరు? ఇతర తారాగణంతో ఎవరెవరు ఉన్నారు? వంటి వివరాలు వెల్లడించలేదు. కానీ, కొత్త సినిమా టైటిల్ వెల్లడించారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Nidra Lechindi Mahila Lokam Telugu Movie: లక్ష్మీ మంచు నటిస్తున్న కొత్త సినిమా 'నిద్ర లేచింది మహిళా లోకం'. సోమవారం సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఇదొక కామెడీ సినిమా.
''ఈ రోజు నేను కొత్త సినిమా 'నిద్ర లేచింది మహిళా లోకం' షూటింగ్ స్టార్ట్ చేశా. మిగతా మహిళా ఆర్టిస్టులతో కలిసి జాయిన్ అవ్వడానికి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది. చాలా అంటే చాలా రోజుల నుంచి ఒక కామెడీ (క్యారెక్టర్ / సినిమా) చేయాలని వెయిట్ చేస్తున్నాను'' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో లక్ష్మీ మంచు పేర్కొన్నారు.
Also Read: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కూడా లక్ష్మీ మంచు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'పిట్ట కథలు'తో లక్ష్మీ మంచు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది మినిమమ్ నాలుగు ఐదు సినిమాలతో లక్ష్మీ మంచు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
View this post on Instagram