![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
ఏపీ మంత్రి రోజాను జబర్దస్త్ టీం సన్మానించింది. మంత్రి అయ్యాక టీం మొత్తం ఆవిడను కలవడం ఇదే తొలిసారి.
![Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి! Jabardasth Team Felicitated AP Minister RK Roja Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/28455974304f144dc57711b55d5f338b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ సినీనటి, ఎమ్మెల్యే రోజాను ఇటీవలే మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖలకు రోజా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రోజా మంత్రి అయ్యాక జబర్దస్త్ టీం మొత్తం రోజాను కలిసి సన్మానం చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నారు.
జబర్దస్త్ టీంలోని పాత, కొత్త ఆర్టిస్టులు అందరూ రోజాను కలిసిన వారిలో ఉన్నారు. చమ్మక్ చంద్ర, అదిరే అభి, వేణు, ధనరాజ్... ఇలా జబర్దస్త్ మానేసి వేరే షోలు చేస్తున్న వారు కూడా రోజాను కలిశారు. మంత్రి పదవి వరించిన అనంతరం రోజా జబర్దస్త్ జడ్జి పదవికి కూడా గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం ఇంద్రజ-పూర్ణ, ఇంద్రజ-మనో కాంబినేషన్లతో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లను నడిపిస్తున్నారు. మరి ఫైనల్‌గా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.
గతంలో నాగబాబు, రోజా ఇద్దరూ ఎన్నో సంవత్సరాల పాటు జబర్దస్త్‌కు జడ్జిలుగా వ్యవహరించారు. మల్లెమాల టీంతో విభేదాల కారణంగా నాగబాబు వెళ్లిపోయాక ఆయన స్థానంలో మనోను తీసుకువచ్చారు. మనో, రోజా కొంతకాలం జడ్జిలుగా ఉన్నారు. ఇప్పుడు రోజా కూడా వెళ్లిపోవడంతో మళ్లీ కొత్త జడ్జి కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)