Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విడాకుల కోసం విహారితో లక్ష్మీ పోరాటం.. కార్మికుల చావు విహారి, లక్ష్మీలపై నింద!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 4th విహారి కడుతున్న బిల్డింగ్స్ కూలిపోయి కార్మికుల ప్రాణాలు పోవడం ఆ నింద లక్ష్మీ మీదకి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తనకు కచ్చితంగా విడాకులు కావాలని విహారితో చెప్పేస్తుంది. ఈ సమస్యలతో నేను విసిగిపోయాను.. ఇక నా వల్ల కాదు.. దయచేసి నాకు విడాకులు ఇవ్వండి అని చెప్తుంది. మన సమస్యకి పరిష్కారం మన పెళ్లి సంగతి అందరికీ చెప్పేయడమే అని విహారి అంటాడు. మీ బంధం సహస్రమ్మతోనే ముడి పడి ఉందని అదే కొనసాగాలి అని లక్ష్మీ అంటుంది.
విహారి కోపంగా తన మీద నాకు ప్రేమ లేదు మరి మా బంధం ఎలా నిలబడుతుంది. నీపై ప్రేమ చెప్పాను అయినా నువ్వు ఎలా నాకు విడాకులు ఇస్తావు అని విహారి అంటాడు. దానికి లక్ష్మీ ఒక బంధం కలవాలి అంటే రెండు మనసులు కలవాలి.. రెండు మనసులు కలవాలి అంటే ఇద్దరి గుండెల నిండా ప్రేమ ఉండాలి అలాంటి ప్రేమ నాకు లేదు అని లక్ష్మీ అంటుంది. నా మీద నీకు ప్రేమ లేదా అని విహారి విస్తుపోతాడు. నీ కళ్లలో నాకు ప్రేమ కనిపిస్తుందని అంటాడు. దానికి లక్ష్మీ అదంతా ప్రేమ కాదు దయచేసి కోర్టుకి వచ్చి విడాకులు ఇవ్వండి అని చెప్తుంది. విడాకుల నిర్ణయం నీది నేను ఆ కోర్టుకి వచ్చి తేల్చుకుంటా.. నువ్వే కాదు ఆ దేవుడు వచ్చి అడిగినా ఇవ్వను అంటాడు.
లక్ష్మీ ఏడుస్తూ మీకు ఎప్పుడూ ఏం అడగలేదు ఇదే మొదటి చివరి కోరిక నాకు విడాకులు ఇచ్చేయండి అని అంటుంది. కోపంతో విహారి గోడకి చేయి గుద్దుకుంటాడు. లక్ష్మీ తన కొంగు కట్టి ఎమోషనల్ అయిపోతుంది. విహారి కోపంగా సహస్ర నా పక్కన ఉంటుందేమో నువ్వు మాత్రం ఎప్పటికీ నాలోనే ఉంటావ్ అంటాడు.
మరోవైపు అంబిక, సుభాష్ వాళ్లు బాంబ్‌లు పెట్టిన కనస్ట్రక్షన్ బిల్డింగ్‌ల దగ్గరకు వెళ్లి బాంబ్‌లతో వాటిని పేల్చేస్తారు. టీవీలో విహారి కనస్ట్రక్షన్ కంపెనీల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలిపోయి కార్మికులు గాయపడినట్లు చూపిస్తారు. ఇంటిళ్లపాది న్యూస్ చూసి షాక్ అయిపోతారు. ఈ దారుణం ఏంటో తెలుసుకోవాలని విహారి అంటాడు. సైట్ దగ్గర ఉన్నవాళ్లకి కాల్ చేయమని సహస్ర అంటుంది. ఎవరూ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విహారి సైట్ దగ్గరకు వెళ్తానని అంటాడు. వద్దు అన్నా విహారి, లక్ష్మీ సైట్ దగ్గరకు వెళ్తారు.
చాలా మంది చనిపోవడం, గాయాల పాలవ్వడం చూసి అంబిక వాళ్లు నవ్వుకుంటారు. విహారి, లక్ష్మీ, చారుకేశవ లొకేషన్‌కి వచ్చి ఎమోషనల్ అయిపోతారు. ఓ పాపకి గాయాలు అయి ఏడుస్తుంటే విహారి తీసుకుంటాడు. విహారి మీదకు అగ్ని దూసుకొస్తుంటే లక్ష్మీ కాపాడుతుంది. ఇక అందరూ విహారి వాళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగింది అని డౌన్ డౌన్ అని చెప్తారు. కల్తీ సిమెంట్ వాడారని అంటారు. గోల గోల చేస్తారు. ఎంత సర్ది చెప్పాలి అన్నా వికపోవడంతో విహారి, లక్ష్మీ, చారుకేశవ కారు ఎక్కి కూర్చొంటారు. అందరూ కారు మీదకు విరుచుకు పడతారు. లక్ష్మీ వల్లే ఇదంతా తను వచ్చినప్పుడు నుంచే ఈ గొడవలు ఇంటిలో ఉంటే ఇంట్లో గొడవలు.. ఎండీ అయింది ఇప్పుడు ఇలా జరిగింది అని అందరూ లక్ష్మీని అంటారు. ఎవరి ప్రాణాలు అయినా పోతే దానికి కారణం లక్ష్మీనే అని పద్మాక్షి అంటుంది. ఎవరూ కావాలి అని ఏం చేయరు కదా అని లక్ష్మీ అంటుంది. అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంట్లోకి రాళ్లు రువ్వుతారు. అందరూ కంగారు పడతారు.
చనిపోయిన కార్మికుల శవాలను తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఇంట్లోకి రాళ్లు విసురుతారు. విహారి బయటకు వెళ్తాను అంటే లక్ష్మీ నేను వెళ్తాను అంటుంది. ఎండీ కదా దాన్నే వెళ్లమని చెప్పండి అని ఇంట్లో అందరూ అంటారు. విహారి, లక్ష్మీ వెళ్తే అందరూ వెళ్తారు. చనిపోయిన వాళ్లని చూసి అందరూ ఏడుస్తారు. కార్మికుల రోదన మిన్నుంటుంది. విహారి అందరికీ క్షమాపణలు చెప్తాడు. డబ్బులు ఇస్తామని అంటే డబ్బులతో ప్రాణాలు తీసుకొస్తారా అని అడుగుతారు. లక్ష్మీనే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇలా చేసింది అని లక్ష్మీని తిడతారు. నేను బాధ్యత తీసుకుంటానని విహారి అంటే నేను బాధ్యత తీసుకుంటా అని లక్ష్మీ అంటుంది. పద్మాక్షి కూడా లక్ష్మీనే కారణం అంటుంది. అంబిక, సహస్ర అందరూ లక్ష్మీనే కారణం అంటారు. ఇంతలో పోలీసులు వచ్చి విహారిని అరెస్ట్ చేస్తామని అంటే లక్ష్మీ నేను ఎండీ నాదే బాధ్యత నన్ను అరెస్ట్ చేయండి అంటుంది. ఇంతలో చారుకేశవ వాళ్లిద్దరూ కాదు నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















