Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీకి పదహారు రోజుల పండగ చేస్తున్న యమున.. తల్లితో కనకాన్ని విహారి చూస్తాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, సహస్రలతో పూజ చేయించడానికి పద్మాక్షి కనకం, యమున ఉన్న గుడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున లక్ష్మీ దగ్గరకు వచ్చి పద్మాక్షి కొట్టినందుకు తాను క్షమాపణ చెప్పి ఓదార్చుతుంది. కనక మహాలక్ష్మీ మెడలో తాళి చూసిన యమున నీ తాళి చూసినప్పుడల్లా బాధగా ఉంటుందని తాళి రంగు పోకుండానే భర్త వదిలేసి వెళ్లిపోయాడని బాధ పడతుంది.
యమున: ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అసలు అలాంటి మనిషిని..
లక్ష్మీ: అమ్మా ఆయన్ను ఏమీ అనొద్దు. ఎందుకంటే అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివో మనకు తెలీదు కదా.
యమున: సరేలే లక్ష్మీ. నీ తాళిని నీకు తాళి కట్టిన మనిషిని నేను గౌరవిస్తాను. లక్ష్మీ నీకు పెళ్లి అయి రేపటికి 16 రోజులు కదా. నువ్వు నీ పుట్టింట్లో ఉంటే ఈ పసుపు తాడు మార్చి నల్లపూసలు వేసి పండగలా చేసేవారు.
లక్ష్మీ: ఏం చేస్తాం అమ్మగారు నాకు అంత అదృష్టం లేదు కదా.
యమున: అదృష్టం ఏంటి నేను నిన్ను అలా వదిలేస్తానా నేనే ఆ కార్యక్రమం చేస్తాను.
లక్ష్మీ: వద్దమ్మా ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు నా వల్ల అందరి దగ్గర మాటలు పడొద్దు.
యమున: అవన్నీ నేను చూసుకుంటాలే.
లక్ష్మీ: భగవంతుగా నా మూలంగా అక్కడ నా అక్కడ నా తల్లి దండ్రులు ఇక్కడ నా భర్త, అత్త ఇబ్బంది పడుతున్నారు. నా వల్ల నా చుట్టూ ఉన్న వారికి కూడా ఇబ్బందులే.
ఉదయం కనక మహాలక్ష్మీని తీసుకొని యమున గుడికి వస్తుంది. యమున దేవుడికి దండం పెట్టుకుంటే లక్ష్మీ యమునకు దండం పెట్టుకొని మనసులో అత్త అయిన మీరే నాకు తల్లి స్థానంలో పదహారు రోజుల పండగ చేస్తున్నారని మొక్కుకుంటుంది. ఇక యమున పంతులుతో కనకానికి పదహారు రోజుల పండగ అని చెప్తుంది. పంతులు లక్ష్మీకి కొత్త చీర కట్టుకొని అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజ చేయమని అంటే లక్ష్మీకి యమున చీర ఇస్తుంది. ఇంతలో లక్ష్మీ తన తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన చీర తీసి అది కట్టుకుంటానని అంటుంది. యమున సరే అంటుంది. ఇక యమున తన కొడుకు పెళ్లి పనుల్లో తననే ఉండొద్దని అంటున్నారని తన కొడుకుకి అంతా మంచి జరిగితే చాలు నా కొడుకు పెళ్లి పనుల్లో దూరంగా ఉంటానని అనుకుంటుంది. యమున పద్మాక్షి మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో లక్ష్మీ చీర కట్టుకొని వస్తే యమున చాలా సంతోషంతో చాలా అందంగా ఉన్నావని అంటుంది.
లక్ష్మీ: అమ్మగారు మీకు ఓ విషయం అడగనా. ఈ రోజు బాబుగారిది సహస్ర గారిది ఏదో పూజ ఉంది అంట కదా. తులాభారం కూడా ఉంది అంట కదా దానికి వెళ్లకుండా నాతో పాటు ఇక్కడికి వచ్చారేంటి.
యమున: దానికి నేను వెళ్లకపోయినా పర్లేదు కానీ ఈ రోజు నీ మెడలో నల్లపూసలు పడటం చాలా ముఖ్యం. అందుకే నీతో పాటు వచ్చా.
లక్ష్మీ: నాకోసం ఆలోచించి అక్కడికి వెళ్లలేదు కదా
యమున: లక్ష్మీ అవన్నీ ఆలోచించకు ఈ కార్యక్రమం సక్రమంగా అయ్యేలా చూద్దాం.
కాదాంబరి ఇంట్లో అందరికీ రమ్మని తొందర పెడుతుంది. అందరూ చక్కగా రెడీ అయి వస్తారు. పద్మాక్షి విహారి గురించి అడుగుతుంది. పెద్దాయన విహారిని పిలుస్తాడు. విహారి పంచె కట్టులో కిందకి దిగుతాడు. సహస్ర చూస్తూ ఉండిపోతుంది. అంబిక సహస్ర మీద సెటైర్లు వేస్తుంది. గుడికి ఇక వెళ్దామని పద్మాక్షి అంటే అమ్మ లేకుండా ఎలా వెళ్తామని విహారి అని తల్లిని పిలుస్తాడు. పండుని పిలిచి అడుగుతాడు. పండు తనకు తెలీదు అంటాడు. ఇంట్లో అందరికీ అడుగుతాడు. ఎవరూ తెలీదు అంటారు.
పద్మాక్షి: విహారి ఇప్పుడు మీ అమ్మ రాకపోతే పూజ ఆగిపోతుందా.
విహారి: పూజ ఆగిపోదు కానీ నా మనసు ఆగిపోతుంది. నేను ఏం చేసినా అమ్మ సమక్షంలో అమ్మకి నచ్చినట్లు అమ్మ చూసుకునేలా చేయాలి.
చారుకేశవ: మనసులో సరిపోయింది అమ్మ అంటే అత్తకి నచ్చదు. అమ్మ లేకుండా అల్లుడు ఏ పనీ చేయడు.
విహారి, పండు ఇళ్లంతా యమున కోసం వెతుకుతారు. లక్ష్మీని తన ఊరిలో దింపడానికి వెళ్లి ఉంటుందని అంబిక అనుకుంటుంది. ఇక పెద్దాయన మనకంటే ముందు గుడికి వెళ్లిపోయింటుందని అందరినీ గుడికి తీసుకెళ్తారు. ఇక యమున మరో ఇద్దరి ఆడవాళ్లతో కలిసి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేయిస్తుంటుంది. విహారి వాళ్లు గుడికి వెళ్తారు. ఆ ఆలయంలో ప్రస్తుతం పూజలు అవ్వమని కేవలం దర్శనం మాత్రమే ఉంటుందని అంటారు. అందరూ షాక్ అవుతారు. ముందే విషయం చెప్పలేదని పద్మాక్షి పూజారి మీద సీరియస్ అవుతుంది. ఇక పంతులు లక్ష్మీ, యమున ఉన్న గుడి అడ్రస్ చెప్పి వెళ్లమంటారు. పంతులు లక్ష్మీలో నల్లపూసలకు పూజ చేయిస్తారు. తాళి కట్టిన భర్తే నల్లపూసలు వేయాలని అబ్బాయి ఎక్కడని పంతులు అడుగుతారు. మరోవైపు విహారి వాళ్లు అదే గుడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.