అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అంబిక నయా గేమ్! సహస్ర ప్రకాశ్‌కి ఇచ్చిన టాస్క్ ఏంటి?

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Sep15th లక్ష్మీ, విహారికి కచ్చితంగా విడాకులు రావాలని సహస్ర ప్రకాశ్‌కి చెప్పి లక్ష్మీ మెడలో తాళి తీసేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక గురించి పూర్తి నిజం తెలుసుకున్న విహారి అంబికను కాల్చేస్తాడు. అంబికకు బులెట్ తగలడంతో విహారి, లక్ష్మీ ఇద్దరూ అంబికను హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. ఇంతలో విహారికి తల్లి, అత్తలు కాల్ చేస్తే హాస్పిటల్‌లో ఉన్నామని జరిగింది అంతా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. 

యమున మేం కూడా హాస్పిటల్‌కి వస్తాం అని అంటే వద్దు సహస్ర, చారుకేశవలు వస్తున్నారని మీరు వద్దని అనేస్తాడు. అంబిక కండీషన్ బాగానే ఉందని చెప్తాడు. పద్మాక్షి విహారితో అంబికను జాగ్రత్తగా ఇంటికి తీసుకురారా అందరం కలిసి మాట్లాడుదాం అని అంటుంది. విహారి సరే అంటాడు. ఇక డాక్టర్ అంబికను చూసి విహారి వాళ్లతో బులెట్ తీసేశాం.. ఇప్పుడు బాగానే ఉంది. మెలకువ రాగానే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని అంటాడు.

సహస్ర వాళ్లు వచ్చి విషయం తెలిసి షాక్ అయిపోతారు. అందరూ లోపలి అంబిక దగ్గరకు వెళ్తారు. అంబిక అందర్ని క్షమించమని అడుగుతుంది. సహస్ర అంబికతో పిన్ని నువ్వు ఇవన్నీ చేశావ్ అంటే నమ్మలేకపోతున్నాం.. నువ్వు నీ సొంత వాళ్లకే ఇదంతా చేస్తావని అనుకోలేదని అంటుంది. విహారి అత్తతో మీరు ఏ లాభంతో ఇలా చేయాలి అనుకున్నారో తెలీదు కానీ లక్ష్మీని ఎందుకు చంపాలి అనుకున్నారు అని అడుగుతుంది. 

అంబిక నీ కోసమే విహారి అని చెప్తుంది. ఇదంతా నేను నా అంతట చేయలేదు.. అని అంటే లక్ష్మీ మనసులో అంబికమ్మ ఏదో కొత్త కుట్ర చేస్తున్నారని అనుకుంటుంది. చారుకేశవ అయితే ఇదంతా నువ్వు నీ అంతట చేయలేదు అని చెప్తే నమ్మలేం అని అంటాడు. దానికి అంబిక తనని కొందరు బెదిరించి ఇదంతా చేయమని చెప్పారని వద్దు అనడంతో విహారిని చంపేస్తా అన్నారని చెప్పి కొన్ని వీడియోలు చూపిస్తుంది. వాటిలో విహారిని టార్గెట్ చేసి గన్ గురి పెట్టినట్లు ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. అంబిక విహారితో ఇవి చూపించి నన్ను బెదిరించి ఈ ఆస్తులు, కంపెనీల కంటే నాకు నువ్వే ముఖ్యం అనిపించి వాళ్లు చెప్పనట్లు చేశానని అంటుంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో విహారి అంబికను చంపాలని గన్ గురిపెట్టినప్పుడే అంబిక సుభాష్‌కి సైగ చేసి కాల్చమని అంటుంది. ఈ బులెట్ కూడా వాళ్లు నీకు గురి పెడితే నాకు తగిలిందని అంటుంది. విహారి, సహస్రలు అంబిక చెప్పిన మొత్తం నమ్మేసి అంబికకు సారీ చెప్తారు. అంబికను తీసుకొని ఇంటికి వెళ్తారు. అందరూ అంబికను చూసి ఎలా ఉందని మాట్లాడుతారు. అంబిక అందరికీ సారీ చెప్తుంది. నువ్వు కావాలి అని తప్పు చేయలేదు కదా అని పద్మాక్షి అంటే బావ కోసమే ఇదంతా చేశావ్ కదా పిన్ని అందరూ నిన్ను అర్థం చేసుకున్నారని సహస్ర అంటుంది. మొత్తానికి అంబిక అందర్ని తన మాయలో పడేస్తుంది. 

లక్ష్మీకి అందరి ముందు థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు మా వాళ్లని నన్ను కాపాడావని చెప్తుంది. ఇక మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మీ అంటుంది. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉంటానని అంబిక అంటుంది. లక్ష్మీ మనసులో అంబికమ్మ కట్టుకథ అల్లేసి అందర్ని నమ్మించింది ఇప్పటికైనా మారితే మంచిది అనుకుంటుంది. ఇక లక్ష్మీ జడ్జి తమని ఎందుకు గుడికి రమ్మని చెప్పారా అని ఆలోచిస్తుంది. జడ్జికి కాల్ చేసి విడాకులు ఇచ్చేలా చెప్పాలని బతిమాలుతా అని జడ్జికి కాల్ చేస్తుంది. విడాకులు ఇచ్చేయండి మేడం అంటే మీరు గుడికి రావాల్సిందే అని జడ్జి అంటుంది. సహస్ర చాటుగా ఆ మాటలు వింటుంది.

విహారి లక్ష్మీని పిలిచి జడ్జి ఎందుకు గుడికి రమ్మని పిలిచారని అడుగుతాడు. విడాకులు ఇస్తారా ఇవ్వరా ఏమైనా గెస్ చేసుంటావ్ కదా చెప్పు అని అడుగుతాడు. సహస్ర ప్రకాశ్‌ని పిలిచి విహారి, లక్ష్మీని జడ్జి గుడికి రమ్మని చెప్పారని విషయం చెప్తుంది. వాళ్లకి కచ్చితంగా విడాకులు అయిపోవాలని సహస్ర అంటే విహారి లక్ష్మీతో అస్సలు నీకు నేను విడాకులు ఇవ్వను అని అంటాడు. మీ భవిష్యత్ బాగుండాలి అంటే ఈ ఇంట్లో అందరూ కలిసిమెలసి ఉండాలి అంటే మీరు విడాకులు ఇవ్వాల్సిందే అని అంటుంది. నువ్వు లేని భవిష్యత్ నాకు వద్దు కనకం.. నువ్వు లేనప్పుడు నా చుట్టూ ఎవరు ఉంటే నాకేంటి అని అంటాడు.

సహస్ర ప్రకాశ్‌తో లక్ష్మీ మెడలో తాళి ఉండటానికి వీల్లేదు. దాని మెడలో ఆ తాళి నువ్వే తీసేయాలి అని అంటుంది. విహారి లక్ష్మీతో నువ్వే కాదు జడ్జి కాదు ఎవరు నీ మెడలో తాళి తీయాలి అన్నా తీయలేరు అని అంటాడు. ప్రకాశ్ సహస్రతో లక్ష్మీ, విహారిని కచ్చితంగా విడదీస్తానని చెప్తాడు. ఉదయం యమున పూజ చేస్తుంది. నీ ముందు దీపం వెలిగిస్తూ ఒక బంధాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తున్నాను.. నేను ఎంత గానో అభిమానించే లక్ష్మీకి అన్యాయం చేస్తున్నాను అని తెలుసు కానీ నా భర్త కోరిక విహారి ఆశయం కోసం ఇంత మందిని బాధ పెట్టలేక లక్ష్మీని బాధ పెడుతున్నా విహారికి లక్ష్మీకి విడాకులు వచ్చేలా చూడమని కోరుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget